చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనాకు మందు కనిపెట్టే ప్రయత్నం, వైద్య నిపుణుడు మృతి, ట్రంప్ చెప్పారని ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) వ్యాధి ప్రపంచ దేశాలతో ఫుల్ బాల్ ఆడుకుంటోంది. కరోనా వైరస్ వ్యాధికి విరుగడు మందు కనుగోనే పరిశోధనలో ఓ ఆయుర్వేద నిపుణుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కరోనా వైరస్ విరుగుడు మందు కనిపెట్టి పేరు సంపాధించుకోవాలని ప్రయత్నించిన ఆయుర్వేద వైద్య నిపుణుడు మరణించడంతో ఆయనతో పాటు పని చేస్తున్న సాటి వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురైనారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాము కొన్ని రసాయనాలు ఉపయోగించి కరోనా విరుగుడుకు మందు కనిపెడుతున్నామని చెప్పారని, తాను ఆ మాటలు విన్నానని, ఆ రసాయనాలతో తాను ఔషదం తయారు చేస్తానని, వాటిని తాను ఫాలో అవుతానని ఆ వైద్య నిపుణుడు సాటి వైద్యులతో అన్నారని తెలిసింది. ఆయుర్వేద వైద్య నిపుణుడు తయారు చేసిన ఔషదం ఆయనే సేవించడం వలన ప్రాణాలు పోయాయని వెలుగు చూడటంతో ఆయనతో పాటు పని చేస్తున్న వైద్యులను పోలీసులు విచారణ చేస్తున్నారు.

Lockdown: లవ్ మ్యారేజ్, కేరళలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు, కరోనా పరీక్షలు చేసిన గంటలో ఫినిష్ !Lockdown: లవ్ మ్యారేజ్, కేరళలో భర్త, బెడ్ రూంలో ప్రియుడు, కరోనా పరీక్షలు చేసిన గంటలో ఫినిష్ !

చెన్నైలో ల్యాబ్

చెన్నైలో ల్యాబ్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని టీ. నగర్ లో సుజాత బయోటెక్ కంపెనీలో ఆయుర్వేద ఔషదాలు తయారు చేస్తుంటారు. కరోనా వైరస్ విరుగుడు కోసం మందు కనిపెట్టాలని సుజాత బయోటెక్ కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు డాక్టర్ శివనేశన్ (47) అదే కంపెనీకి ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్నారు.

కరోనాకు మందు కనిపెట్టాలని ఆశ

కరోనాకు మందు కనిపెట్టాలని ఆశ

సుజాత బయోటెక్ కంపెనీలో డాక్టర్ శివనేశన్, డాక్టర్ రాజ్ కుమార్ తదితరులు కరోనా వైరస్ విరుగుడు కోసం మందు కనిపెట్టే పనిలో నిమగ్నం అయ్యారు. సోడియం నైట్రేట్ ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ తయారు చేస్తే కరోనా వైరస్ ను నిర్మూలించవచ్చని డాక్టర్ శివనేశన్, డాక్టర్ రాజ్ కుమార్ తదితరులు భావించారు.

బెడిసికొట్టిన వైద్యంతో దుర్మరణం

బెడిసికొట్టిన వైద్యంతో దుర్మరణం

కొన్ని రోజుల నుంచి పరిశోధనలు చేస్తున్న డాక్టర్ శివనేశన్ కరోనా వైరస్ విరుగుడుకు మందు కనిపెట్టామని ఊహించారు. వారు తయారు చేసిన సోడియం నైట్రేట్ ద్రావకాన్ని గురువారం శివనేశన్ సేవించాడు. ఆ సమయంలో తయారు చేసిన ఔషదం బెడిసికొట్టింది. వెంటనే శివనేశన్ ను ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చేసిన చికిత్స విఫలమై శివనేశన్ దుర్మరణం చెందారు.

లాక్ డౌన్ తో చెన్నైలో మకాం

లాక్ డౌన్ తో చెన్నైలో మకాం

చెన్నైలోని పెరుంగుడి ప్రాంతానికి చెందిన శివనేశన్ ఆయుర్వేద నిపుణుడు. 30 ఏళ్ల క్రితం ఆయుర్వేద, మూలికలతో ఔషదాలు తయారు చెయ్యడానికి సుజాత బయోటెక్ అనే సంస్థను శివనేశన్ స్థాపించాడు. ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో ఇదే కంపెనీకి మరో ప్లాంట్ ఉంది. అక్కడ ఆయుర్వేద, మూలిక ఔషదాలు తయారు చేస్తుంటారు. నిత్యం తన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ కుమార్ తో కలిసి శివనేశన్ ప్రయోగాలు చేస్తుంటాడు. లాక్ డౌన్ కారణంగా చెన్నై వచ్చిన శివనేశన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు.

ప్యారిస్ కార్నర్ లో రసాయనాలు

ప్యారిస్ కార్నర్ లో రసాయనాలు

గురువారం ఉదయం చెన్నైలోని ప్యారిస్ కార్నర్ కు వెళ్లిన శివనేశన్ కరోనా వైరస్ విరుగుడు కోసం మందు కనిపెట్టాలని అక్కడ రసాయనాలు తీసుకుని వచ్చాడు. కరోనా వైరస్ విరుగుడు కోసం తయారు చేసిన ఔషదాన్ని డాక్టర్ శివనేశన్, డాక్టర్ రాజ్ కుమార్ సేవించారు. ఆ సమయంలో డాక్టర్ రాజ్ కుమార్ స్పృహతప్పి కుప్పకూలిపోయాడని, ఆపస్మారక స్థితిలో ఉన్న శివనేశన్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించగా ఆయన మరణించాడని చెన్నైలోని టీ. నగర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అశోక్ కుమార్ మీడియాకు చెప్పారు.

డోనాల్డ్ ట్రంప్ చెప్పారని ?

డోనాల్డ్ ట్రంప్ చెప్పారని ?

సుజాత బయోటెక్ కంపెనీ డిజైనర్, మీడియా మేనేజర్ ఎన్ఎస్. వాసన్ మీడియాతో మాట్లాడుతూ లాక్ డౌన్ కారణండా శివనేశన్ చెన్నైలోనే ఉంటున్నారని అన్నారు. ఒక రోజు మా దగ్గరకు వచ్చిన శివనేశన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాము కరోనా విరుగుడుకు మందు కనిపెడుతున్నామని కొన్ని రసాయనాల పేర్లు చెప్పారని శివనేశన్ అన్నారని గుర్తు చేశారు. తరువాత ప్యారీస్ కార్నర్ కు వెళ్లి కొన్ని రసాయనాలు తీసుకు వచ్చి ప్రయోగం చేసిన శివనేశన్ ఆ రసాయనాలు ఎక్కువ మోతాదులో తాగడం వలన మరణించి ఉంటారని ఎన్ఎస్, వాసన్ అనుమానం వ్యక్తం చేశారు.

మొదటి ప్రయోగంతో ప్రాణాలు !

మొదటి ప్రయోగంతో ప్రాణాలు !

ఇంత వరకు తమ కంపెనీలో ఆయుర్వేదం, మూలికలతో మాత్రమే ఔషదాలు తయారు చేస్తున్నామని, మొదటి సారి రసాయనాలతో కరోనా వైరస్ విరుగుడు కోసం మందు కనిపెట్టడానికి ప్రయత్నించిన శివనేశన్ ప్రాణాలు విడిచారని ఎన్ఎస్, వాసన్ అంటున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డాక్టర్ రాజ్ కుమార్ నుంచి వివరాలు సేకరించి విచారణ చేస్తున్నారు.

English summary
COVID 19: A 47-year-old pharmacist-cum-production manager of a Chennai-based Ayurvedic product company in T.Nagar died after drinking a chemical preparation he reportedly formulated for tackling the Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X