వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: బజాజ్ బైక్ ల ఫ్యాక్టరీలో 140 మందికి కరోనా, ఇద్దరు మృతి, కంపెనీ మాత్రం క్లోజ్ కాదు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ ఔరంగాబాద్: భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజు వేల సంఖ్యలో పెరిగిపోతున్నది. భారతదేశంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంతో అన్ని పరిశ్రమలు, వ్యాపారలావాదేవీలు మూతపడ్డాయి. అయితే లాక్ డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా పరిశ్రమల కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నియమాలు పాటించి పరిశ్రమలు, వ్యాపారలావాదేవీలు కొనసాగించడానికి అధికారులు అవకాశం ఇచ్చారు. అయితే దేశంలో ప్రముఖ బైక్ ల తయారీ సంస్థ అయిన బజాజ్ ఆటోలో ఫ్యాక్టరీలో 140 మంది ఉద్యోగులు, కార్మికులకు కరోనా వైరస్ వ్యాధి సోకడం, అందులో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది. అయినా కంపెనీ మాత్రం క్లోజ్ చెయ్యమని యాజమాన్యం అంటోందని సమాచారం.

TikTok: పోలీసు అధికారి పోటుగాడు, కరోనా కాలంలో పోయేకాలం, అమ్మాయిలు, ఆంటీలతో రోజుకు 20 సార్లు !TikTok: పోలీసు అధికారి పోటుగాడు, కరోనా కాలంలో పోయేకాలం, అమ్మాయిలు, ఆంటీలతో రోజుకు 20 సార్లు !

 బజాజ్ ఆటో కంపెనీ

బజాజ్ ఆటో కంపెనీ

కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక నియమాలతో లాక్ డౌన్ 5.0 సడలింపులకు అవకాశం ఇచ్చింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా అనేక పరిశ్రమలు, ఫ్యాక్టరీలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని వెలూజ్ ప్రాంతంలోని బజాజ్ ఆటో ఫ్యాక్టరీ (బైక్ లు తయారు చేసే ఫ్యాక్టరి) ఏప్రిల్ 24వ తేదీన అతి కొద్ది మంది సిబ్బందితో తాత్కాలికంగా ప్రారంభం అయ్యింది.

8 వేల మంది ఉద్యోగులు

8 వేల మంది ఉద్యోగులు

ఔరంగాబాద్ సమీపంలోని వెలూజ్ ప్రాంతంలోని బజాజ్ ఆటో ఫ్యాక్టరీలో 8, 100 మంది ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది ఉన్నారు. జూన్ 6వ తేదీ నుంచి బజాజ్ ఆటో ఫ్యాక్టరీలో ఉద్యోగుల తాకిడి ఎక్కువ అయ్యింది. బజాజ్ ఆటో కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కార్మికులు అనారోగ్యానికి గురి కావడంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

 140 మందికి కరోనా పాజిటివ్

140 మందికి కరోనా పాజిటివ్

బజాజ్ ఆటో ఫ్యాక్టరీలో పని చేస్తున్న వారికి కరోనా వైరస్ పరీక్షలు చెయ్యడంతో మొదట 79 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. తరువాత రానురాను కార్మికులు అనారోగ్యానికి గురి కావడంతో చాలా మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. బజాజ్ ఆటో ఫ్యాక్టరీలో పని చేస్తున్న 140 మంది ఉద్యోగులు, కార్మికులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటం, అందులో ఇద్దరు కార్మికులు ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో సాటి కార్మికులు హడలిపోయారు.

Recommended Video

Patanjali's Coronil: FIR Against Yoga Guru Ramdev ప్రజలను మోసం చేసారంటూ 420 కింద కేసు ! || Oneindia
 ఐదు లక్షల బైక్ లు, జీతాలు కట్ ?

ఐదు లక్షల బైక్ లు, జీతాలు కట్ ?

ఔరంగాబాద్ సమీపంలోని వెలూజ్ ప్రాంతంలోని బజాజ్ ఆటో ఫ్యాక్టరీలో సంవత్సరానికి 5 లక్షలకు పైగా బైక్ లు తయారు చేస్తుంటారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం నియమాలు పాటిస్తూ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో ఫ్యాక్టరీని మూసివేయాలని అధికారులు సూచించారు. అయితే ఫ్యాక్టరీని మూసివేస్తే కంపెనీ నియమాల ప్రకారం ఉద్యోగులు, కార్మికుల జీతాలు కట్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. అందువలన అనేక ముందు జాగ్రత్తలు తీసుకుని ఫ్యాక్టరీ కార్యకలాపాలు కొనసాగించాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిసింది.

English summary
Coronavirus: Two wheeler major Bajaj Auto Ltd Waluj factory in Aurangabad after 140 of the over 8,100 employees at the factory tested positive for coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X