వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కొడుకు పుట్టాడని గెస్ట్ హౌస్ లో ఎస్ఐ గ్రాండ్ పార్టీ, సీఐకి పాజిటివ్, 19 మంది !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ బళ్లారి: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తున్న సమయంలో లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం సభలు, సమావేశాలు, శుభకార్యాలు, పార్టీలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. సామన్య ప్రజలు లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు పోలీసులకు సూచించింది. అయితే కొడుకు పుట్టాడని సంతోషంలో పోలీసు అధికారే గెస్ట్ హౌస్ లో గ్రాండ్ గా మందు పార్టీ నిర్వహించడంతో పార్టీకి హాజరైన అధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎస్ఐ ఇచ్చిన మందు పార్టీకి హాజరైన ఇన్స్ పెక్టర్ తో సహ ఎస్ఐలు, పోలీసులతో సహ మొత్తం 19 మంది ఇప్పుడు కరోనా వైరస్ భయంతో హడలిపోతున్నారు.

Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్

కరోనా తాండవం

కరోనా తాండవం

కర్ణాటకలో కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధించాలా ? వద్దా ? అనే దానిపై వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్* కర్ణాటక సరిహద్దులోని బళ్లారి జిల్లాలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, ఆ వ్యాధి చికిత్స విఫలమై అనేక మంది వరుసగా మరణించడంతో కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది.

కొడుకు పుట్టాడని ఎస్ఐ మందు పార్టీ

కొడుకు పుట్టాడని ఎస్ఐ మందు పార్టీ


బళ్లారి జిల్లాలోని కంప్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పని చేస్తున్న వ్యక్తికి వారం రోజుల ముందు కొడుకు పుట్టాడు. తనకు కొడుకు పుట్టాడని కంప్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంతోషంలో మునిగిపోయాడు. కంప్లి పట్టణం సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లో ఎస్ఐ సాటి పోలీసు అధికారులతో పాటు కానిస్టేబుల్స్, తెలిసిన వారికి గ్రాండ్ గా మందు పార్టీ ఇచ్చాడు.

సార్..... అందరూ వచ్చేయండి

సార్..... అందరూ వచ్చేయండి

కంప్లి ఎస్ఐ ఇచ్చిన మందుపార్టీకి కంప్లి డివిజన్ పోలీసు సర్కిల్ ఇన్స్ పెక్టర్ (సీఐ), ఆయన జీపు డ్రైవర్ తో సహ కంప్లిలోని మరో ఎస్ఐ, కమలాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐతో పాటు మరో రెండు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, కంప్లి పోలీస్ స్టేషన్ లోని కొందరు కానిస్టేబుల్స్, హోమ్ గార్డులు హాజరైనారు. అర్దరాత్రి దాటి వరకు గెస్ట్ హౌస్ లో ఎస్ఐ ఇచ్చిన మందు పార్టీలో అందరూ ఎంజాయ్ చేశారు.

తేడా వచ్చి కరోనా తగులుకుంది

తేడా వచ్చి కరోనా తగులుకుంది


కంప్లి ఎస్ఐ ఇచ్చిన మందు పార్టీకి హాజరై పీకలదాక మద్యం సేవించిన ఓ కానిస్టేబుల్ అనారోగ్యానికి గురైనాడు. వెంటనే ఆ పోలీసులకు వైద్యపరీక్షలు చెయ్యడంతో అతనికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. విషయం ఏమిటంటే ఎస్ఐ ఇచ్చిన మందు పార్టీకి ఆ గెస్ట్ హౌస్ లో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చిన కానిస్టేబుల్ మందు పోసి మాంసం ముక్కలు, బిరియానీలు వడ్డించాడని వెలుగు చూడటంతో అందరూ హడలిపోయారు.

సీఐ అంటే కరోనాకు భయమా ?

సీఐ అంటే కరోనాకు భయమా ?

ఎస్ఐ ఇచ్చిన మందు పార్టీకి హాజరైన 19 మందికి వైద్యపరీక్షలు చేశారు. ఇప్పుడు కంప్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ (51)కి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. అంతే మూడు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, పోలీసులు, హోమ్ గార్డులు అందర్నీ క్వారంటైన్ కు పంపించారు. కంప్లి పోలీస్ స్టేషన్ లను పూర్తిగా సీల్ డౌన్ చేశారు.

పోలీస్ స్టేషన్, గెస్ట్ హౌస్ క్లోజ్

పోలీస్ స్టేషన్, గెస్ట్ హౌస్ క్లోజ్

కంప్లి పోలీస్ స్టేషన్ తో పాటు మందు పార్టీ జరిగిన గెస్ట్ హౌస్ ను మూసివేసిన వైద్య సిబ్బంది, పారిశుద్ద కార్మికులు ఆ పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేశారు. ఎస్ఐ ఇచ్చిన మందు పార్టీకి హాజరైన 19 మందికి ఇప్పుడు కరోనా వైరస్ భయం పట్టుకుంది. కొడుకు పుడితే తరువాత మందు పార్టీ ఇవ్వాలి కాని కరోనా కాలంలో ఇలాంటి పనులు ఏమిటి అని మండిపడిన పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Coronavirus: The 51 year old CPI of Kampli police station in Bellary district has been confirmed infected by the coronavirus and the infected CPI has been shipped to Covid Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X