బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: హోటల్ లో కరోనా క్వారంటైన్, బాత్ రూంలో మీనాక్షి, కుప్పకూలిన సీలింగ్, అంతే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రజలు వారివారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అయితే విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిని పలు రాష్ట్రాల నగరాలు, జిల్లాల్లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉండటానికి ఏర్పాట్లు చేసి వారికి కరోనా వైరస్ ఉందా ? లేదా ? అని తెలుసుకోవడానికి చికిత్సలు చేస్తున్నారు. ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్ లో ఉంటున్న మహిళ బాత్ రూంలో ఉన్న సమయంలో పైన సీలింగ్ కుప్పకూలింది. రెండు మూడు రోజుల నుంచి ఆమె బాత్ రూం సీలింగ్ సక్రమంగా లేదని, సిమెంట్ పెళ్లలు పడుతున్నాయని హోటల్ నిర్వహకులకు చెప్పినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !

బెంగళూరు హోటల్స్ లో క్వారంటైన్ లు

బెంగళూరు హోటల్స్ లో క్వారంటైన్ లు

విదేశాల నుంచి బెంగళూరు చేరుకున్న వారికి నగరంలోని పలు ప్రముఖ హోటల్స్ తో పాటు కొన్ని విలాసవంతమైన హోటల్స్ , ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి బెంగళూరు వచ్చిన వారు అందరూ ప్రస్తుతం అధికారులు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్నారు.

 మెజస్టిక్ లో హోటల్

మెజస్టిక్ లో హోటల్

బెంగళూరు నగరంలోని మెజస్టిక్ ప్రాంతాల్లోని పలు హోటల్స్ లో కరోనా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి బెంగళూరు వచ్చిన వెంకటరమణ, మీనాక్షి కుటుంబ సభ్యులు మెజస్టిక్ లోని ప్రైవేట్ హోటల్ లో బస చేసి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.

బాత్ రూంలో ఉంటే సీలింగ్ ?

బాత్ రూంలో ఉంటే సీలింగ్ ?

హోటల్ లోని క్వారంటైన్ లో ఉంటున్న మీనాక్షి బాత్ రూంలోకి వెళ్లారు. ఆమె బాత్ రూంలో ఉన్న సమయంలో పైన సీలింగ్ పగలి సిమెంట్ పెళ్లలు ఆమె మీద పడ్డాయి. పెద్ద శభ్దంతో ఒక్కసారిగా సిమెంట్ పెళ్లలు మీద పడటంతో మీనాక్షికి గాయాలు అయ్యాయి. మీనాక్షి కేకలు వెయ్యడంతో గదిలో ఉన్న ఆమె భర్త వెంకటరమణ బాత్ రూంలోకి పరుగు తీసి మీనాక్షిని బయటకు తీసుకొచ్చారు. గత ఏడు రోజుల నుంచి మీనాక్షి, వెంకటరమణ కుటుంబ సభ్యులు ఈ హోటల్ లో ఉంటున్నారు. బాత్ రూంలో నుంచి సిమెంట్ పెళ్లలు రాలుతున్నాయని గత మూడు రోజుల నుంచి చెప్పినా హోటల్ సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడంలేదని మీనాక్షి ఆరోపించారని ది మింట్ మీడియా కథనంలో వివరించింది.

Recommended Video

Trump To Bring Back Drug Making To US From India And China
 వైద్యపరీక్షలు లేదు, హోటల్ బిల్లు బొక్క !

వైద్యపరీక్షలు లేదు, హోటల్ బిల్లు బొక్క !

విదేశాల నుంచి వచ్చి 7 రోజులు అయ్యిందని, అప్పటి నుంచి హోటల్ లో ఉంటున్నామని, ఇంత వరకు తామకు కరోనా వైరస్ వ్యాధిని దృవీకరించే పరీక్షలు మాత్రం చెయ్యలేదని మీనాక్షి ఆరోపించారని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం తెలిపింది. వైద్యపరీక్షలు ఎప్పుడు చేస్తారు అని అధికారులను ప్రశ్నిస్తే 10 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లలు, వృద్దులకు మాత్రం వైద్యపరీక్షలు చెయ్యాలని తమకు పై అధికారులు సూచించారని, మీకు ఎప్పుడు వైద్యపరీక్షలు చెయ్యాలి ? అనే విషయం ఇంకా చెప్పలేదని అధికారులు అంటున్నారని మీనాక్షి ఆరోపించారు. ఇలాంటి నాసిరకంలోని క్వారంటైన్ కేంద్రాల్లో మమ్మల్ని పెట్టి వేల రూపాయల అద్దె వసూలు చేస్తున్నారని, మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మీనాక్షి ఆరోపించారని ది మింట్ మీడియా తెలిపింది.

English summary
Bathroom Ceiling Collapses In Quarantine Hotel in Bengaluru, Woman Escapes, woman upset with Quarantine system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X