బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా వచ్చిన పోలీసును వదిలేసి వేరే పోలీసుకు చికిత్స ?, అసలు వ్యక్తి మాయం, ట్విస్ట్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బతో కొన్ని చోట్ల చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ వచ్చిందనే అనుమానంతో ఓ పోలీసులకు ఆసుపత్రిలో వైద్యపరీక్ష్లలు చేసి ఆ శాఖపై అధికారులకు నివేదిక ఇచ్చారు. పోలీస్ కు ఎలాంటి కరోనా వైరస్ లేదని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తమ పరీక్షల్లో వెలుగు చూసింది వైద్యులు పోలీసు అధికారులకు నివేదిక సమర్పించారు.

ఇంత వరకు బాగానే ఉన్నా అసలు కరోనా వైరస్ వచ్చిన పోలీసును వదిలేసి అదే పేరు ఉన్న మరో పోలీసుకు వైద్య పరీక్షలు చేశారు ? అనే అనుమానాలు మొదలైనాయి. కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి పోలీసు మొబైల్ స్వీచ్ ఆఫ్ చెయ్యడం, ఆయన ఎక్కడ ఉన్నారో ? ఎవ్వరికి తెలీకపోవడంతో ఇప్పుడు బెంగళూరు పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు.

100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!

 ఒకే పేరుతో ఇద్దరు పోలీసులు

ఒకే పేరుతో ఇద్దరు పోలీసులు

బెంగళూరు నగరంలోని బేగూరు పోలీస్ స్టేషన్ లో ఒకే పేరుతో ఇద్దరు పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరి పేర్లు ఒక్కటే అయినా వారి ఇంటి పేర్లు వేర్వేరుగా ఉన్నాయి. బేగూరు పోలీస్ స్టేషన్ లో ఓ పోలీసుకు కరోనా వైరస్ సోకిందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

పోలీసుకు కరోనా వైరస్ చికిత్స

పోలీసుకు కరోనా వైరస్ చికిత్స

బేగూరు పోలీస్ స్టేషన్ లో పోలీసుగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. రెండు మూడు రోజుల పాటు ఆ పోలీసుకు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేశారు. అయితే కోవిడ్ 19 రిపోర్టు షీట్ లో పోలీసు కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ లేదని వైద్యులు నివేదిక తయారు చేసి బేగూరు పోలీస్ స్టేషన్ అధికారులకు పంపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన పోలీసు కుటుంబ సభ్యులు 12 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వారిలో ఎవ్వరికీ ఆ వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు తేల్చి చెప్పారు.

పేరు ఒక్కటే, మనిషి మారిపోయాడు ?

పేరు ఒక్కటే, మనిషి మారిపోయాడు ?

బెంగళూరులోని బేగూరు పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు పోలీసుల పేర్లు ఒక్కటే. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన పోలీసును వదిలేసి అదే పేరుతో ఉన్న మరో పోలీసును ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైరస్ లేని పోలీసుకు చికిత్స చెయ్యడం వలనే ఆయనకు కరోనా లక్షణాలు కనపడటం లేదని తెలిసింది.

కరోనా ఉన్న పోలీసు మాయం !

కరోనా ఉన్న పోలీసు మాయం !

బేగూరు పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తూ కరోనా వైరస్ వచ్చిన పోలీసు ప్రస్తుతం మాయం అయ్యాడని తెలిసింది. ఆ పోలీసు మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసు అధికారులతో పాటు వైద్యులు హడలిపోతున్నారు. కరోనా పాజిటివ్ అని వచ్చిన తరువాత ఆ పోలీసు ఎక్కడికి వెళ్లాడు ?, ఏం చేస్తున్నాడు ? అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు.

చిన్న తప్పుతో పిచ్చిపట్టిపోయింది

చిన్న తప్పుతో పిచ్చిపట్టిపోయింది

ఒకే పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు పోలీసుల విషయంలో అధికారులు చిన్న తప్పు చెయ్యడంతో మొదటికే మోసం వచ్చిందని తెలిసింది. కరోనా వైరస్ వచ్చిన పోలీసు మాయం కావడం, అదే పేరుతో ఉన్న మరో పోలీసును వెంట తీసుకెళ్లి వైద్య పరీక్షలు చెయ్యడంతో అనేక అనుమానాలు మొదలైనాయి. పోలీసు శాఖలో మొత్తం 29 మంది పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పోలీసుల వైద్య పరీక్షల నివేదికలు పూర్తిగా వచ్చిన తరువాత ఇలాంటి ట్వీస్టులు ఓ కొలిక్కి వస్తాయని అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఒకే పోలీస్ స్టేషన్ లో ఒకే పేరుతో ఇద్దరు ఉండటం, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వదిలేసి వేరే వ్యక్తికి చికిత్స చేసి నివేదిక ఇవ్వడంతో పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

English summary
Coronavirus: Bengaluru Begur police constable corona case got twist. He tested negative.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X