బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: దేశ ఐటీ రాజధాని హడల్, ఒక్కసారి కరోనా పాజిటివ్ కేసులు డబుల్, ఏం చెయ్యాలో ? ప్రజలే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతదేశంలో కరోనా పాజిటివ్ (COVID 19) కేసుల సంఖ్య గంటగంటకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాధి పాజిటివ్ కేసుల దెబ్బకు దేశ ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరు నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేవలం ఐదు రోజుల్లో ఇన్ని రోజులు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండితలకు పైగా పెరిగిపోయాయి. ఎన్నడూ లేని విధంగా కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా మూడింతలు పెరిగిపోవడంతో కర్ణాటక ప్రభుత్వంతో పాటు బీబీఎంపీ అధికారులు ఉలిక్కిపడ్డారు.

Recommended Video

Bengaluru Lockdown : Every Sunday Complete Lockdown From July 5th || Oneindia Telugu

Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి!Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి!

ఇప్పటికే సిలికాన్ సిటీ సీల్ డౌన్

ఇప్పటికే సిలికాన్ సిటీ సీల్ డౌన్

సిలికాన్ సిటీ బెంగళూరులో ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అక్షరాలా 1, 556 కేసులు ఉన్నాయి. బెంగళూరు సిటీలో వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, జూన్ 23వ తేదీ నాటికి 1, 556కి చేరిందని ప్రభుత్వం ఆందోళన చెందింది. బెంగళూరులో కరోనా వైరస్ కట్టడి చెయ్యడానికి అనేక ప్రాంతాలను బీబీఎంపీ అధికారులు ఇప్పటికే సీల్ డౌన్ చేశారు.

కేంద్రం కితాబు ఇస్తే?

కేంద్రం కితాబు ఇస్తే?

బెంగళూరులో 1, 556 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడిలో కర్ణాటక ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పని చేస్తోందని, బెంగళూరు సిటీని మిగిలిన నగరాలు ఆదర్శంగా తీసుకోవాలని స్వయంగా కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి కితాబు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన కితాబుతో ఎంతో సంతోషంగా ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి ఎక్కువ రోజులు ఆ సంతోషం ఉండలేదు.

లాక్ డౌన్ పెట్టేద్దామా?

లాక్ డౌన్ పెట్టేద్దామా?

బెంగళూరులో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బెంగళూరు సిటీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, బీబీఎంపీ అధికారులు, వైద్యశాఖ, పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అత్యవసర సమావేశాలు వరుసగా నిర్వహించి బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ అమలు చేద్దామా ? అనే దిశలో చర్చలు జరిపారు.

ఫలించని ప్రయత్నాలు

ఫలించని ప్రయత్నాలు

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప నిర్వహించిన సమావేశంలో బెంగళూరు సిటీకి చెందిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మీ నియోజక వర్గాల పరిధిలో మీరే కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని, ప్రజలు భౌతిక దూరం పాటించేలా మీరే చూసుకోవాలని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప బెంగళూరు సిటీలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులకు మనవి చేశారు. అయితే సీఎం చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదని తెలిసింది.

ఐదు రోజుల్లో కరోనా కేసులు డబుల్

ఐదు రోజుల్లో కరోనా కేసులు డబుల్

బెంగళూరు సిటీలో జూన్ 23వ తేదీ వరకు 1, 556 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనాయి. అయితే ఐదు రోజుల తేడాలో జైన్ 28వ తేదీ రాత్రికి బెంగళూరు సిటీలో ఏకంగా 3, 419 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో బెంగళూరు సిటీ ప్రజలతో పాటు కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. బెంగళూరు సిటీలో ఒక్కరోజులో 789 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. బెంగళూరులో ఇంకా 2, 692 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. బెంగళూరు సిటీలో కరోనా వైరస్ చికిత్స విఫలమై 88 మంది మరణించారని అదికారులు తెలిపారు.

English summary
Bengaluru had 1556 COVID19 Positive cases as on June 23 which has doubled to 3419 cases as on June 28. Bengaluru now constitutes 25.92% of total cases in Karnataka.State Govt is taking all measures to ensure that every #COVID patient gets best treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X