బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనాకు బలి, ఔట్ గోయింగ్ కు రూ. 9 లక్షలు, ఆసుపత్రి నిర్వాకం, మంత్రి చెబితే, షాక్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్ తాండవం చేస్తోంది. కరోనా పాజిటివ్ తో మృతి చెందిన వ్యక్తి మృతదేహం అప్పగించాలంటే రూ. 9 లక్షలు ఇవ్వాలని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది. ఇప్పటికే రూ. 1.80 ఇన్సూరెన్స్, మరో లక్ష రూపాయలు చెల్లించినా మిగిలిన సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేసి మృతదేహం అప్పగించకుండా నరకం చూపించారు.

ఇదే ఆసుపత్రిలో కరోనాతో మరణించిన వ్యక్తి గత 20 ఏళ్ల నుంచి క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్న విషయం తెలుసుకున్న ప్రజలు షాక్ కు గురైనారు. మనిషి చనిపోయినా మృతదేహం అప్పగించడానికి (ఔట్ గోయింగ్) రూ. 9 లక్షలు డిమాండ్ చేస్తారా ? మీకేం పోయేకాలం వచ్చింది అంటూ ఆసుపత్రుల తీరుపై ప్రజలు శాపనార్తాలు పెడుతున్నారు.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

బెంగళూరులో ఏం జరిగిందంటే ?

బెంగళూరులో ఏం జరిగిందంటే ?

బెంగళూరు నగరంలోని ఆర్ పీసీ లేఔట్ లో నివాసం ఉంటున్న 62 ఏళ్ల వ్యక్తి జులై 19వ తేదీన ఊపిరి ఆడకపోవడం, జ్వరం రావడంతో కుమారస్వామి లేఔట్ లోని సాగర్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆ వ్యక్తిని బెంగళూరు నగరంలోని కుమారస్వామి లేఔట్ లోని సాగర్ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు.

కరోనా పాజిటివ్

కరోనా పాజిటివ్

అనారోగ్యానికి గురైన వ్యక్తికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని, మూత్రపిండాల సమస్య ఉందని చెప్పిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఆసుపత్రిలో చేరిన రెండుమూడు రోజులకు అతనికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. తరువాత అనారోగ్యానికి గురైన వ్యక్తికి ఐసీయూలో చికిత్స అందించాలని, మీరు డబ్బులు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం రోగి కుటుంబ సభ్యులకు చెప్పింది.

రూ. 9 లక్షలు డిమాండ్

రూ. 9 లక్షలు డిమాండ్

జులై 19వ తేదీ నుంచి సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి చికిత్స విఫలమై ఆగస్టు 7వ తేదీన మరణించాడు. మీకు మృతదేహం అప్పగించాలంటే రూ. 9 లక్షలు ఇవ్వాలని మృతుడి కుటుంబ సభ్యులను ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యుడి ప్రాణాలు పోయాయని ఆవేదన చెందుతున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమన్యం తీరుపై షాక్ కు గురైనారు.

లాభం లేదు ఇవ్వలేం !

లాభం లేదు ఇవ్వలేం !

సాగర్ ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించిన వ్యక్తికి చికిత్స చెయ్యడానికి రూ. 1. 80 లక్షలు ఇన్సూరెన్స్ రూపంలో ఆసుపత్రికి జమ అయ్యిందని, తాము వ్యక్తిగతంగా మరో లక్ష రూపాయలు చెల్లించామని, చికిత్సకు మొత్తం డబ్బులు రూ. 8. 96 లక్షలు ఖర్చు అయ్యిందని ,ఆడబ్బులు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మంత్రి జోక్యంతో క్లియర్

మంత్రి జోక్యంతో క్లియర్

కరోనా వైరస్ పాజిటివ్ తో మరణించిన వ్యక్తి మృతదేహం అప్పగించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు కర్ణాటక వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి సుధాకర్ జోక్యం చేసుకుని సాగర్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. మంత్రి మాటలతో వెనక్కి తగ్గిన ఆసుపత్రి వర్గాలు కరోనా పాజిటివ్ తో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని మూడు రోజుల తరువాత ఆదివారం సాయంత్రం మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సోదరుడు అదే ఆసుపత్రిలో 20 ఏళ్లు క్యాషియర్

సోదరుడు అదే ఆసుపత్రిలో 20 ఏళ్లు క్యాషియర్

ఆర్ పీసీ లేఔట్ లో కరోనా పాజిటివ్ తో ఆసుపత్రిలో మరణించిన 62 ఏళ్ల వ్యక్తి సోదరుడు అదే సాగర్ ఆసుపత్రిలో గత 20 ఏళ్ల నుంచి క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్నాడని వెలుగు చూసింది. తాను పని చేస్తున్న చోట సోదరుడికి చికిత్స అందిస్తే డబ్బులు మిగులుతుందని, చక్కగా వైద్యం చేసి ప్రాణాలు కాపాడుతారని అతని సోదరు బావించాడు. అయితే తీరా మృతదేహం ఔట్ గోయింగ్ కు రూ. 9 లక్షలు డిమాండ్ చెయ్యడంతో వారు షాక్ కు గురైనారు.

 మా తప్పు ఏమాత్రం లేదు

మా తప్పు ఏమాత్రం లేదు

ఆగస్టు 7వ తేదీన కరోనా పాజిటివ్ తో చనిపోయిన వ్యక్తి మృతదేహం తీసుకెళ్లాలని మృతుడి కుటుంబ సభ్యులకు అదే రోజు ఫోన్ చేసి చెప్పినా వారు పట్టించుకోలేదని, చివరికి బీబీఎంపీ, పోలీసు, వైద్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని. మేము ఎక్కువ డబ్బులు డిమాండ్ చెయ్యలేదని సాగర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్ విక్రమ్ అంటున్నారు. కరోనాతో మరణించిన వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చెయ్యకూడదని ప్రభుత్వాలు పదేపదే మనవి చేస్తున్నా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి.

English summary
A 62-year-old male Covid-19 positive patient who was admitted at a private hospital passed away on August 7. The patient’s brother has alleged that the body wasn’t given to the family for two days as they were unable to pay the full amount of Rs 8.96 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X