బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: విదేశీ తబ్లీగిలకు ఆశ్రయం, కార్పోరేటర్ కు కరోనా, ఎమ్మెల్యేకి టెన్షన్, తిక్కచేష్టలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశంలో కరోనా వైరస్ (COVID 19) వ్యాధి వ్యాపించడానికి హాట్ స్పాట్ అయిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన విదేశీ తబ్లీగిలకు అక్రమంగా ఆశ్రయం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఒక ప్రాంతంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 20కి పైగా నమోదు కావడానికి కారణం అయ్యారు. ఢిల్లీ నుంచి తప్పించుకుని బెంగళూరు చేరుకున్న విదేశీ తబ్లీగిలకు ప్రార్థనా మందిరంలో అక్రమంగా దాచిపెట్టి అల్లర్లకు కారణం అయిన కార్పోరేటర్ కు ఇప్పుడు అదే కరోనా పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కార్పోరేటర్ తో సన్నిహితంగా ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు ఇప్పుడు కరోనా భయంతో హడలిపోతున్నారు.

Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?

పోలీసులు, వైద్యులపై దాడి

పోలీసులు, వైద్యులపై దాడి

బెంగళూరు నగరంలోని పాదరాయనపుర వార్డులో కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్న స్థానికులను ఆసుపత్రికి తరలించడానికి వెళ్లిన పోలీసులు, వైద్య శాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు, వైద్యులపై దాడి చేసిన వారిని పాదరాయనపుర కార్పోరేటర్ ఇమ్రాన్ పాషా వెనుకేసుకువచ్చాడని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికే ఇమ్రాన్ పాషా మీద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసులు నమోదైనాయి.

ఎదురు తిరిగిన కార్పోరేటర్

ఎదురు తిరిగిన కార్పోరేటర్

బెంగళూరులోని పాదరాయనపుర వార్డు కార్పోరేటర్ ఇమ్రాన్ పాషాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ ఇమ్రాన్ పాషాను ఆసుపత్రికి తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే తాను ఆసుపత్రికి రానని, తనకు ఏ రోగం లేదని కార్పోరేటర్ ఇమ్రాన్ పాషా ఎదురుతిరగడంతో అధికారులు సాక్ కు గురైనారు.

భారీ బందోబస్తు

భారీ బందోబస్తు

పాదరాయనపురలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ ఇమ్రాన్ పాషాను ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఇమ్రాన్ పాషాకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇమ్రాన్ పాషా సుమారు 20 మంది అనుచరులతో కలిసి పాదరాయనపురలో కరోనా వైరస్, లాక్ డౌన్ సందర్బంగా అనేక మంది స్థానికులకు నిత్యవసర వస్తువుల కిట్ లు పంపిణి చేశాడని, ఆ సమయంలో అతనికి కరోనా వైరస్ వ్యాధి సోకి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విదేశీ తబ్లీగిలకు ఆశ్రమం

విదేశీ తబ్లీగిలకు ఆశ్రమం

ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన విదేశీ తబ్లీగిలు అక్కడి నుంచి చాకచక్యంగా తప్పిచుకుని దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో బెంగళూరు చేరుకున్న విదేశీ తబ్లీగిలు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 19 మంది విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులను కార్పోరేటర్ ఇమ్రాన్ పాషా, మసీదు పెద్ద కలసి పాదరాయనపురలోని మసీదులో అక్రమంగా వారిని దాచిపెట్టారని పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే విచారణ చేస్తున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేతో లింక్

సిట్టింగ్ ఎమ్మెల్యేతో లింక్

కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరులోని చిక్కపేట కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు జమీర్ అహమ్మద్ కూడా విదేశీ తబ్లీగిలు మసీదులో తలదాచుకోవడానికి సహకరించాడని బీజేపీ నాయకులు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైయ్యింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఇంటికి కార్పోరేటర్ ఇమ్రాన్ పాషా నిత్యం వెళ్లి వస్తున్నాడని వెలుగు చూసింది. ఇ

మాజీ మంత్రి హడల్

మాజీ మంత్రి హడల్

బెంగళూరు నగరంలోని పాదరాయనపుర వార్డు కార్పోరేటర్ ఇమ్రాన్ పాషా ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ వెళ్లి వచ్చాడని అధికారులు అంటున్నారు. కార్పోరేటర్ ఇమ్రాన్ పాషాకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జమీర్ అహమ్మద్ తో పాటు ఆయనకు సన్నిహితంగా ఉంటున్న వారు ఇప్పుడు కరోనా భయంతో హడలిపోతున్నారు.

ఆసుపత్రిలో కార్పోరేటర్ తిక్కచేష్టలు !

ఆసుపత్రిలో కార్పోరేటర్ తిక్కచేష్టలు !

పాదరాయనపుర కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ ఇమ్రాన్ పాషా మొదటి నుంచి తిక్కచేష్టలు చేసేవాడని, కరోనా వైరస్ పాజిటివ్ అని తేలినా అతను ఆసుపత్రికి వెళ్లడానికి నిరాకరించి రాద్దాంతం చేశాడని కర్ణాటక రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ మండిపడ్డారు. కరోనా పాజిటివ్ అనే నిర్దారణ అయిన తరువాత ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డు నుంచి బయటకు వచ్చి ఆసుపత్రి మొత్తం తిరుగుతున్న ఇమ్రాన్ పాషా సాటి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని మంత్రి ఆర్. అశోక్ ఆరోపించారు.

English summary
Coronavirus: Bengaluru Padarayanapura Corporator Imran Pasha Tests Positive For COVID-19, Shifted to Victoria Hospital in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X