బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: లాక్ డౌన్, రోడ్లలో హంగామా, లేడీ ఎస్ఐ పై దాడులు, కాల్చిపారేసిన పోలీసులు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ లో భాగంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో స్థానికులు పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. కొన్ని చోట్ల లాక్ డౌన్ లో భాగంగా స్థానికుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయితే కొన్నిచోట్ల రోడ్ల మీద హంగామా చేస్తున్న యువకులను అడ్డుకున్న పోలీసుల మీద స్థానికులు దాడులు చేశారు. కరోనా వైరస్ ను అందరూ కలిసికట్టుగా అరికడాదమని, మీరు ఇళ్లలోకి వెళ్లి సహకరించాలని చెప్పిన లేడీ ఎస్ఐ మీద బెంగళూరులోని అల్లరిమూకలు దాడులు చెయ్యడంతో ఆమెకు తీవ్రగాయాలైనాయి. ఇదే సమయంలో రెచ్చిపోతున్న అల్లరిమూకల మీద పోలీసులు కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Coronavirus: కరోనా వచ్చిందని హేళన చేసిన మాస్ లీడర్ ని కసకస పొడిచి చంపేశాడు !Coronavirus: కరోనా వచ్చిందని హేళన చేసిన మాస్ లీడర్ ని కసకస పొడిచి చంపేశాడు !

 బెంగళూరులో యువకులు హల్ చల్

బెంగళూరులో యువకులు హల్ చల్

కరనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్న సమయంలో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అక్కడక్కడా పోలీసులకు, స్థానికుల మధ్య వాగ్వివాదం జరుగుతోంది. బెంగళూరు నగరంలో యువకులు ఇష్టం వచ్చినట్లు ఇళ్ల నుంచి బయటకు వచ్చి నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్ల మీద హల్ చల్ చేస్తున్నారు.

 రంగంలోకి దిగిన లేడీ ఎస్ఐ

రంగంలోకి దిగిన లేడీ ఎస్ఐ

బెంగళూరు నగరంలోని సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. సంజయ్ నగరలోని ప్రధాన రహదారుల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు సంచరించకుండా చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానిక యువకులు తాజుద్దీన్ (25), శతుబుద్దీన్ (25) తదితరులను ఇళ్లలోని వెళ్లాలని సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లేడీ ఎస్ఐ రూపా సూచించారు.

 నువ్వు లేడీ ఎస్ఐ జాగ్రత్త !

నువ్వు లేడీ ఎస్ఐ జాగ్రత్త !

రోడ్ల మీద తిరగకుండా ఇళ్లలోకి వెళ్లాలని సూచించిన లేడీ ఎస్ఐ రూపా మీద స్థానిక యువకులు దౌర్జన్యం చేశారు. ఆ సమయంలో స్థానికులు నువ్వు లేడీ ఎస్ఐ మాత్రమే, మా మీద నీ ప్రతాపం చూపించడానికి ప్రయత్నించకు, జాగ్రత్తగా ఉండూ అంటూ ఎస్ఐ రూపా మీద రెచ్చిపోయారు. ఆ సమయంలో పోలీసులు, స్థానికుల మద్య మాటామాటా పెరిగిపోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

 లేడీ ఎస్ఐ, పోలీసులపై దాడులు

లేడీ ఎస్ఐ, పోలీసులపై దాడులు

స్థానికులు, పోలీసుల మద్య మాటామాటా పెరిగిపోవడంతో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఆ సమయంలో తాజుద్దీన్, శతుబుద్దీన్ తదితరులు లేడీఎస్ రూపా మీద దాడులు చేశారు. లేడీ ఎస్ఐ రూపా చేతులు, కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో ఆమె కుప్పకూలిపోయారు. ఆ సమయంలో లేడీ ఎస్ఐ రూపాతో పాటు స్థానిక పోలీసులు షాక్ కు గురైనారు.

 కాల్చిపారేసిన పోలీసులు

కాల్చిపారేసిన పోలీసులు

లేడీ ఎస్ఐ రూపా తదితర పోలీసుల మీద దాడులు జరగడంతో స్థానిక పోలీసులు ఆత్మరక్షణలో పడిపోయారు. వెంటనే సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బాలాజీ తన చేతిలో ఉన్న సర్వీసు తూపాకి తీసుకుని అల్లరిమూకల మీద కాల్పులు జరిపారు. ఆ సమయంలో తాజుద్దీన్ కాలిలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అతను కుప్పకూలిపోయాడు. లేడీ ఎస్ఐ రూపా మీద దాడి చేసి తూటా గాయాలైన తాజుద్దీన్ తో పాటు శతుబుద్దీన్ అనే యువకుడిని అరెస్టు చేశారు. తూటా గాయాలైన తాజుద్దీన్, అల్లరిమూకల దాడుల్లో గాయాలైన లేడీ ఎస్ఐ రూపాను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

 మీ అంతు చూస్తాం జాగ్రత్త !

మీ అంతు చూస్తాం జాగ్రత్త !

లేడీ ఎస్ఐతో పాటు పోలీసుల మీద అల్లరిమూకలు దాడులు చేశారని, ఈ సంఘటన కొందరు పోలీసుల మీద దాడులు చేసినట్లు తాము బావించడం లేదని, మొత్తం పోలీసు శాఖ మీద దాడులు చేశారని అనుకుంటున్నామని, ఇలాంటి సంఘటనలు మరోసారి జరిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయని, అల్లరిమూకల పనిపడతామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ హెచ్చరించారు.

English summary
COVID 19: Attack On Police In Sanjay Nagar Limit: Bengaluru Police Fired To One Of The Accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X