బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: బెంగళూరు టెక్కీకి పాజిటివ్, పంజాబ్‌లో తొలికేసు, 45కు చేరిక

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు భారతదేశాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ఇందుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులే కారణం. తాజాగా, మరో రెండు పాజిటివ్ కేసులు వెలుగుచూడటం మరింత ఆందోళనలకు గురిచేస్తోంది.

Recommended Video

3 Minutes 10 Headlines | Coronavirus In India | Yes Bank | 2 Presidents Inaugurations | Oneindia

అమెరికా నుంచి తిరిగి వచ్చిన బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. మరో కేసు పంజాబ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఇటలీ నుంచి తిరిగి వచ్చిన పంజాబ్ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ణారణ అయ్యింది. దీంతో భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య 45కు చేరింది.

Coronavirus: Bengaluru Techie who returned from US tests positive, punjab gets 1st positive case

అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన టెక్కీకి కరోనావైరస్ పాజిటివ్‌గా తేలినట్లు కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ వెల్లడించారు. వైరస్ సోకిన వ్యక్తిని ఆయన కుటుంబాన్ని బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఛాతి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు తెలిపారు. బాధితుడు మొదట అమెరికాలోని ఆస్టిన్ నగరానికి ప్రయాణించి అక్కడ్నుంచి న్యూయార్క్ దుబాయ్ మీదుగా భారత్ చేరుకున్నట్లు తెలిసింది.

మరో కేసు పంజాబ్ రాష్ట్రంలో నమోదైంది. పంజాబ్ రాష్ట్రంలో తొలిసారి నమోదైన కరోనా కేసు ఇదే కావడం గమనార్హం. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని పంజాబ్ అధికారులు వెల్లడించారు.

కాగా, ఇటలీలో కరోనావైరస్ బారిన పడి 366 మంది మృతి చెందగా, 7వేల మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో కూడా కరోనా విజృంభిస్తోంది. దాదాపు 30మంది కరోనాబారిన పడి మృతి చెందారు. వందమంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

English summary
Coronavirus: Bengaluru IT professional who returned from US tests positive, punjab gets 1st positive case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X