బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా విరుగుడుకు మందు కనిపెట్టాం, బెంగళూరు వైద్యులు, కేంద్రం ఓకే అంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధి విరుగుడుకు ప్రపంచ వ్యాప్తంగా ఔషదం కనిపెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధి పూర్తిగా విరుగుడు కావడానికి మందు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. బెంగళూరులోని భారతి కర్ణాటక ఆయుర్వేద వైద్య బృందం కరోనా వైరస్ కు మేము విరుగుడు మందు కనిపెట్టామని ప్రకటించారు. తాము కనిపెట్టిన కరోనా వైరస్ విరుగుడు మందును అమోదించాలని కేంద్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేశామని, వారి అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని భారతి కర్ణాటక ఆయుర్వేద వైద్య బృందం తెలిపింది.

Coronavirus:ఆసుపత్రిలో కరోనా రోగి టిక్ టాక్ వీడియోలతో యువతి హంగామా, సెల్ఫీలు !Coronavirus:ఆసుపత్రిలో కరోనా రోగి టిక్ టాక్ వీడియోలతో యువతి హంగామా, సెల్ఫీలు !

20 ఏళ్ల అనుభవం

20 ఏళ్ల అనుభవం

భారతి కర్ణాటక ఆయుర్వేద బృందంలో డాక్టర్ డిపి. రమేష్ పని చేస్తున్నారు, డాక్టర్ డిపి, రమేష్ కు 20 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. ఇప్పటికే అంతు చిక్కని కొన్ని వ్యాధులను డాక్టర్ రమేష్ నయం చేశారని పేరు ఉంది. ఇలాంటి పేరు ఉన్న డాక్టర్ రమేష్ ఆయుర్వేద బృందం అంతుచిక్కని మహమ్మారి కరోనా వైరస్ వ్యాధిని నయం చేసే పనిలో పడింది.

గోవు మూత్రంతో కరోనా విరుగుడు !

గోవు మూత్రంతో కరోనా విరుగుడు !

ప్రపంచాన్ని హడలు పుట్టిస్తున్న కరోనా వైరస్ కు మందు కనిపెట్టాలని కొంతకాలంగా డాక్టర్ రమేష్ బృందం ప్రయత్నాలు చేసింది. కరోనా వ్యాధి లక్షణాలను, ఆ వైరస్ పనితీరుపై అధ్యయనం చేశారు. గోవు మూత్రంతో పరీక్షలు చేసి కరోనా వ్యాధికి కళ్లెం వెయ్యవచ్చని డాక్టర్ రమేష్ బృందం ఒక అంచనాకు వచ్చింది.

సారా లాంటి ఔషదం

సారా లాంటి ఔషదం

గోవు మూత్రంతో తయారు చేసిన సారా లాంటి ఔషదంతో కరోనా వ్యాధిని అరికట్టడానికి అవకాశం ఉందని డాక్టర్ రమేష్ అంటున్నారు. కరోనా రోగులకు తాము గోవు మూత్రంతో తయారు చేసిన ఔషదం ఇచ్చి చూడాలని డాక్టర్ రమేష్ బృందం కర్ణాటక ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖ అధికారులకు మనవి చేశారు.

Recommended Video

Fake News Buster : 18 కేంద్ర ప్రభత్వ ఉద్యోగులారా.. కంగారు పడొద్దు !
అనుమతి కోసం ఎదురు చూపులు !

అనుమతి కోసం ఎదురు చూపులు !

గోవు మూత్రంతో తాము తయారు చేసిన సారా ఔషదం కరోనా రోగులకు ఇచ్చి నయం చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని, కేంద్ర ఆరోగ్య శాఖ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని భారతి కర్ణాటక ఆయుర్వేద వైద్య బృందం అంటోంది. గోవు మూత్రంతో తయారు చేసిన ఔషదం కరోనా వ్యాధిని నయం చేస్తే తమతో పాటు కర్ణాటకకు, బెంగళూరుకు పేరు వస్తోందని భారతి కర్ణాటక ఆయుర్వేద వైద్య బృందం అంటోంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు కర్ణాటక ప్రభుత్వం వీరు తయారు చేసిన ఔషదాన్ని పరీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారని వైద్య నిపుణులు అంటున్నారు.

English summary
Coronavirus: Bharathi Karnataka Ayurveda doctors invented a medicine for Coronavirus from cow urine in Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X