వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కరోనా భయంతో ఆసుపత్రిలో మాజీ సీఎం, నన్ను కాపాడండి, క్వారంటైన్ లో డాక్టర్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ పాట్నా: కరోనా వైరస్ (COVID 19) పేరు చెబితో ప్రపంచంలో భయపడిన వారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఇప్పుడు ఆ కోవలోకి బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేరిపోయారు. కరోనా భయం పట్టుకున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనకు వెంటనే పెరోల్ ఇవ్వాలని, తాను ఇంటికి వెళ్లిపోతానని, తనను మహమ్మారి నుంచి కాపాడాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన రోగికి వైద్యం చేసిన డాక్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ కు చికిత్స చెయ్యడం, ఆ డాక్టర్ క్వారంటన్ లోకి వెళ్లడంతో ఎక్కడ తనకు కరోనా వైరస్ సోకుతుందో ? అనే భయంతో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ హడలిపోతున్నారు.

Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !

జైల్లో మాజీ సీఎం లాలూ

జైల్లో మాజీ సీఎం లాలూ

పశుదాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (71) జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా కిడ్నీ వైఫల్యంతో అనారోగ్యంతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను రాంచీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మాజీ సీఎంకు, కరోనా రోగికి ఒకే వైద్యుడు

మాజీ సీఎంకు, కరోనా రోగికి ఒకే వైద్యుడు

జార్ఖండ్ లోని రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు సీనియర్ వైద్యుడు ఉమేష్ ప్రసాద్ వైద్యం చేస్తున్నారు. అయితే అదే ఆసుపత్రిలో కరోనా క్వారంటైన్ లో ఉన్న కరోనా పాజిటివ్ రోగికి అదే వైద్యుడు ఉమేష్ ప్రసాద్ చికిత్స చేశారు.

కరోనా క్వారంటైన్ లో డాక్టర్ అండ్ టీం

కరోనా క్వారంటైన్ లో డాక్టర్ అండ్ టీం

కరోనా పాజిటివ్ వచ్చిన రోగికి చికిత్స అందించిన డాక్టర్ ఉమేష్ ప్రసాద్, ఆయన బృందంలోని కొందరు అనారోగ్యానికి గురైనారు. డాక్టర్ ఉమేష్ ప్రసాద్ తో పాటు ఆయన బృందంలోని అందర్నీ కరోనా క్వారంటైన్ కు తరలించి ప్రత్యేక వైద్య చికిత్సలు చేస్తున్నామని రిమ్స్ ఆసుపత్రి సీనియర్ అధికారులు తెలిపారు. డాక్టర్ ఉమేష్ ప్రసాద్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూస్తే మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు సైతం కరోనా పరీక్షలు నిర్వహిస్తామని రిమ్స్ వైద్యులు తెలిపారు.

మాజీ సీఎంకు కరోనా భయం !

మాజీ సీఎంకు కరోనా భయం !

తనకు వైద్యం చేసిన డాక్టర్ ఉమేష్ ప్రసాద్ కరోనా క్వారంటైన్ లో ఉన్నారని తెలుసుకున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ హడలిపోయారు. వైద్యుడి వలన తనకు ఎక్కడ కరోనా వైరస్ వస్తుందో ? అంటూ భయపడిన మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనకు పెరోల్ ఇవ్వాలని, తాను ఇంటికి వెళ్లిపోతానని జార్ఖండ్ ప్రభుత్వానికి, న్యాయస్థానానికి మనవి చేశారు.

Recommended Video

Fake News Buster : 18 కేంద్ర ప్రభత్వ ఉద్యోగులారా.. కంగారు పడొద్దు !
మెలిక పెట్టిన జార్ఖండ్ సీఎం

మెలిక పెట్టిన జార్ఖండ్ సీఎం

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను పెరోల్ పై విడుదల చేసే ప్రతిపాదనను జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ కు పంపించామని, అక్కడి నుంచి సమాధానం వచ్చిన తరువాత సరైన నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మెలిక పెట్టారు. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడిన ఖైదీలను మాత్రమే పెరోల్ మీద విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు చెప్పింది కదా ? అంటున్నారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. అయితే వెంటనే మా నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ను పెరోల్ మీద విడుదల చెయ్యాలని ఆర్జేడీ నాయకులు జార్ఖండ్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు.

English summary
Coronavirus: Bihar former CM Lalu Yadav’s party RJD has demanded his release from prison on parole, citing a coronavirus threat to the 71-year-old former Bihar Chief Minister at a hospital where he has been staying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X