బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనాకు బీజేపీ ఎంపీ బలి, ఒక్కసారైనా రాజ్యసభ ముఖం చూడకుండానే, షాక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత అశోక్ గస్తి కరోనా వైరస్ మహమ్మారి కాటుకు బలి అయ్యారు. గత 15 రోజుల నుంచి బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీ అశోక్ గస్తి చికిత్స విఫలమై మహాలయ అమావాస్య రోజే ప్రాణాలు వదిలారు. గత జూన్ నెలలోనే అశోక్ గస్తి రాజ్యసభ ఎన్నిక అయ్యారు. రాజ్యసభలో ఒక్కసారికూడా అడుగుపెట్టక ముందే అశోక్ గస్తి కరోనా వైరస్ కాటుకు బలి కావడంతో బీజేపీ నాయకులు, ఆయన సన్నిహితులు షాక్ కు గురైనారు.

Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !Kangana: కరోనా కంటే కంగనా డేంజర్, క్వీన్ పక్కలో డాన్ అబుసలేం తమ్ముడా ? నగ్మా ఎంట్రీతో కలకలం !

బీజేపీలో సామాన్య కార్యకర్త

బీజేపీలో సామాన్య కార్యకర్త

కర్ణాటకలోని రాయచూరు ప్రాంతానికి చెందిన అశోక్ గస్తి బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. కర్ణాటకలో చాలా మందికి అశోక్ గస్తి గురించి తెలీదు. వివాదాలకు, గ్రూపు రాజకీయాలకు అశోక్ గస్తి చాలా దూరంగా ఉంటారు. తనపని తాను చేసుకు వెలుతున్న అశోక్ గస్తి గత రాజ్యసభ ఎన్నికల పోటీలో అసలు లేరు.

 బీజేపీ హైకమాండ్ డిసైడ్

బీజేపీ హైకమాండ్ డిసైడ్

కర్ణాటక శాసన సభ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలని చాలా మంది బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేశారు .అయితే ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ హైకమాండ్ అశోక్ గస్తి పేరు సూచించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు షాక్ కు గురైనారు. సామాన్య కార్యకర్తలకు కూడా మేము గుర్తింపు ఇస్తామని అశోక్ గస్తిని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక చేసిన బీజేపీ హైకామండ్ అందరికి ఊహించని షాక్ ఇచ్చింది.

ఒక్కసారైనా వెళ్లాలి

ఒక్కసారైనా వెళ్లాలి


గత జూన్ నెలలో కర్ణాటక శాసన సభ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అశోక్ గస్తి సంతోషంలో మునిగిపోయారు. జులై 22వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా అశోక్ గస్తి కన్నడలోనే ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఢిల్లీ వెళ్లడానికి అశోక్ గస్తి సిద్దం అయ్యారు. అయితే కరోనా వైరస్ దెబ్బకు అది సాధ్యం కాలేదు.

Recommended Video

COVID-19 : Coronavirus ను సృష్టించారంటూ బాంబు పేల్చిన China Virologist అకౌంట్‌ బ్లాక్! || Oneindia
సీటులో కుర్చోకుండానే !

సీటులో కుర్చోకుండానే !

ఈనెల 2వ తేదీన అశోక్ గస్తికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. అప్పటి నుంచి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న అశోక్ గస్తి త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకున్నారు. త్వరగా కోలుకుని ఒక్కసారైనా రాజ్యసభలో తనకు కేటాయించిన సీటులో కుర్చోవాలని అశోక్ గస్తి కలలు కన్నారు. అయితే చికిత్స విఫలమై సెప్టెంబర్ 17వ తేదీ గురువారం మహాలయ అమావాస్య రోజే బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తి కరోనా కాటుకు బలి అయ్యారు. అశోక్ గస్తి ఆత్మశాంతించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో పాటు మంత్రులు, బీజేపీ నాయకులు దేవుడిని ప్రార్థించారు.

English summary
Coronavirus: BJP leader and Rajya Sabha member from Karnataka Ashok Gasti died in private hospital in Bengaluru. He tested positive for COVID 19 and admitted to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X