వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: పెళ్లి కూతురి తల్లి, పెళ్లి కొడుకు తండ్రి కరోనాకు బలి, వధూవరులు, 32 మందికి పాజిటివ్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హావేరి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు సామాన్య ప్రజలతో పాటు శ్రీమంతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీతారలు హడలిపోతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివాహం జరిగిపోయింది అని సంతోషంగా ఉన్న పెళ్లి ఇంట విషాదచాయలు నెలకొన్నాయి. కరోనా కాటుకు పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కుమార్తె తల్లి మరణించారు. వధూవరులతో సహ ఇదే పెళ్లికి హాజరైన 32 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. మరో 90 మందితో పాటు వారితో టచ్ లో ఉన్న ఎమ్మెల్యే కరోనా వైరస్ వ్యాధి ఎక్కడ తమను వెంటాడుతుందో అంటూ టెన్షన్ టెన్షన్ గా వైద్యపరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు.

Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!

 15 రోజుల్లో సినిమా చూపించిన కరోనా

15 రోజుల్లో సినిమా చూపించిన కరోనా

కర్ణాటకలో గత 15 రోజుల నుంచి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా కట్టడిలో కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని రాష్ట్రాల వారు పాటించాలని స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ కితాబు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్న వారం రోజుల తరువాత కర్ణాటకలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో కన్నడనాట ప్రజలు కరోనా వైరస్ భయంతో హడలిపోతున్నారు. ఇప్పటికే కర్ణాటకను కేంద్ర ప్రభుత్వం కరోనా హాట్ స్పాట్ గా గుర్తించింది.

 హ్యాపీగా పెళ్లి జరిగింది

హ్యాపీగా పెళ్లి జరిగింది

కర్ణాటకలోని హావేరి జిల్లా రాణిబెన్నూరు పట్టణంలోని మారుతినగర్ లో నివాసం ఉంటున్న 55 ఏళ్ల వ్యక్తి తన కుమారుడి వివాహం జూన్ 29వ తేదీన అదే ప్రాంతంలోని శ్రీ మునేశ్వరస్వామి ఆలయంలో జరిపించారు. కేంద్ర ప్రభుత్వం నియమాల ప్రకారం 50 మందికి మించకుండా కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లికి హాజరైనారు. ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చాలా సంతోషంగా పెళ్లి జరిగిపోయింది.

 పెళ్లి రోజే పెళ్లి కొడుకు తండ్రికి షాక్

పెళ్లి రోజే పెళ్లి కొడుకు తండ్రికి షాక్

పెళ్లి జరిగిన జూన్ 29వ తేదీ రాత్రి పెళ్లి కొడుకు తండ్రికి జ్వరం వచ్చింది. రాత్రి విపరీతంగా జ్వరం రావడంతో మరుసటి రోజు పెళ్లి కొడుకు తండ్రిని దావణగెరెలోని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్ష్లలు చేసిన వైద్యులు పెళ్లి కొడుకు తండ్రికి కరోనా పాజిటివ్ అని నిర్దారించారు. అప్పటి నుంచి దావణగెరె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెళ్లి కొడుకు తండ్రి ( PNo. 25830) చికిత్స విఫలమై జులై 7వ తేదిన ప్రాణాలు విడిచారు.

 కరోనాకు పెళ్లి కూతురి తల్లి బలి

కరోనాకు పెళ్లి కూతురి తల్లి బలి

పెళ్లి కుమార్తె తల్లి (45) అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. పెళ్లి కుమార్తె తల్లికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెళ్లి కుమార్తె తల్లి ( P No.36881)కరోనా వైరస్ వ్యాధి చికిత్స విఫలమై మరణించింది. పెళ్లి కుమార్తె తల్లి, పెళ్లి కొడుకు తండ్రి కరోనా వైరస్ కు బలికావడంతో నవధంపతులు విషాదంలో మునిగిపోయారు.

 పెళ్లికి వెళ్లిన 32 మందికి కరోనా పాజిటివ్

పెళ్లికి వెళ్లిన 32 మందికి కరోనా పాజిటివ్

రానేబెన్నూరులో పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకుతో పాటు పెళ్లికి హాజరైన వారందరికి వైద్యులు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. నవవధూవరులతో సహ పెళ్లికి హాజరైన వారిలో 32 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. దెబ్బకు నవవధూవరులతో సహ 32 మందిని రానేబెన్నూరులోని అంతరవళ్ళి రోడ్డులోని ప్రభుత్వ హాస్టల్ లోని కరోనా క్వారంటైన్ కేంద్రానికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. పెళ్లికి హాజరైన మరో 10 మంది వైద్యపరీక్షలు అందవలసి ఉందని అధికారులు తెలిపారు.

Recommended Video

Kharif Cultivation కి కరోనా దెబ్బ, రైతన్నలకు అదనపు భారం- కూలీల రేట్లు పెరగడంతో Farmers ఆవేదన...!!
 టెన్షన్ తో చెమలుపడుతున్నాయి

టెన్షన్ తో చెమలుపడుతున్నాయి

పెళ్లికి హాజరైన వారు మొత్తం 90 మందికి పైగా కలిశారని, వారిలో రాణేబెన్నూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అరుణ్ కుమార్ కూడా ఉన్నారని అధికారులు గుర్తించారు. వైద్యపరీక్షలు ఆలస్యం కావడంతో పెళ్లికి హాజరైన వారు టెన్షన్ టెన్షన్ గా వైద్యపరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లి దెబ్బకు రాణేబెన్నూరులో మాత్రమే 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. హావేరి జిల్లాలో ఇప్పటి వరకు 389 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయని అధికారులు తెలిపారు.

English summary
Coronavirus: bride mother and groom father died and 32 guests coronavirus positive in Karnataka. 58 cases of coronavirus were detected in the Haveri district today, and the total number of infected cases increased to 389.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X