బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus కాటు: చైనా నుంచి వచ్చి తప్పించుకుని ఊరూరు తిరిగేశాడు, సీఎం ఊరిలో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ శివమొగ్గ: ప్రపంచం మొత్తాన్ని హడలు పుట్టిస్తున్న కరోనా వైరస్ (COVID-19) పుట్టిన చైనా దేశం నుంచి భారత్ వచ్చిన వ్యక్తి అధికారుల ఆదేశాలను లెక్కచెయ్యకుండా ఊరూరు తిరిగి స్థానిక ప్రజలకు నిద్ర లేకుండా చేశాడు. హోమ్ క్వారంటైన్ లో ఉండకుండా అధికారుల కళ్లు కప్పి అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ ఎంజాయ్ చేసిన వ్యక్తి మీద పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ వచ్చిందా ? లేదా ? అనే విషయం తేలకముందే ఆ వ్యక్తి పలు ప్రాంతాల్లో హల్ చల్ చేశాడు. ఒక సీఎం సొంత జిల్లాలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపేరింది. చైనా నుంచి వచ్చిన వ్యక్తిని కలిసిన వారు, అతనితో మాట్లాడిన వారు ఈ రోజు ఎక్కడ కరోనా వైరస్ మా ప్రాణాలు తీస్తుందో అంటూ హడలిపోతున్నారు.

Coronavirus: ఒకే ఫ్యామిలీలో ఐదు మందికి, యువతితో లింక్, ఎలా వెళ్లి ఎలా వచ్చిందంటే?Coronavirus: ఒకే ఫ్యామిలీలో ఐదు మందికి, యువతితో లింక్, ఎలా వెళ్లి ఎలా వచ్చిందంటే?

చైనా టూ కర్ణాటక

చైనా టూ కర్ణాటక

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హోసనగర పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తి చైనా వెళ్లాడు. హోసనగరకు చెందిన ఈ వ్యక్తి చైనా వెళ్లాడు. తరువాత చైనాలో అనేక ప్రాంతాల్లో తిరిగిన ఆ వ్యక్తి ఇటీవల భారత్ చేరుకుని శివమొగ్గ జిల్లాలోని హోసనగరలోని సొంత ఇంటికి వెళ్ళడానికి సిద్దం అయ్యారు.

ఎయిర్ పోర్టులో వైద్యపరీక్షలు

ఎయిర్ పోర్టులో వైద్యపరీక్షలు

చైనా నుంచి వచ్చిన హోసనగర నివాసికి ఎయిర్ పోర్టులో కరోనా వైరస్ కు సంబంధించిన వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పట్లో అతనికి కరోనా వైరస్ సోకిందా ? లేదా ? అనే విషయంలో క్లారిటీ తేలదని తెలుసుకున్న అధికారులు మార్చి 19వ తేదీ నుంచి ఎప్రిల్ 4వ తేదీ వరకు ఇంటిలోని క్వారెంటైన్ లో ఉండాలని శివమొగ్గ జిల్లా అధికారులు అతనికి సూచించారు.

ఊరూరు తిరిగి ఎంజాయ్ చేశాడు

ఊరూరు తిరిగి ఎంజాయ్ చేశాడు

ఇంటిలోని క్వారంటైన్ లో ఉండాలని జిల్లాధికారులు ఆదేశాలు జారీ చేసినా చైనా నుంచి వచ్చిన వ్యక్తి ఏమాత్రం లెక్కచెయ్యలేదు. హోసనగరలోని అంబేద్కర్ కాలనీలోని ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి హోసనగరలోని అనేక ప్రాంతాలతో పాటు చుట్టుపక్కలలోని ఊరూరు తిరిగి ఎంజాయ్ చేశాడు.

దేవుడా ఎక్కడెక్కడ తిరిగాడు!

దేవుడా ఎక్కడెక్కడ తిరిగాడు!

చైనా నుంచి వచ్చిన వ్యక్తికి వైద్యపరీక్షలు చెయ్యడానికి హోసనగరలోని అంబేద్కర్ కాలనీలోని అతనికి ఇంటికి జిల్లాధికారులు, వైద్యులు వెళ్లారు. అయితే అతను అక్కడ లేడని, ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని తెలుసుకున్న అధికారులు షాక్ కు గురైనాడు. చైనా నుంచి వచ్చిన వ్యక్తి ఎక్కడికి వెళ్లాడు దేవుడా ? అంటూ అధికారులు తలలు పట్టుకున్ననారు. చైనా నుంచి వచ్చిన వ్యక్తిని పట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసి ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నామని జిల్లాధికారులు తెలిపారు.

కర్ణాటక సీఎం సొంత జిల్లాలో!

కర్ణాటక సీఎం సొంత జిల్లాలో!

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో చైనా నుంచి వచ్చిన వ్యక్తి కరోనా వైరస్ విషయంలో కలకలంరేపాడని వెలుగు చూడటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. అధికారుల కళ్లు కప్పి క్వారంటైన్ నుంచి తప్పించుకుని పలు ప్రాంతాల్లో సంచరించి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడిన హోసనగర నివాసి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. సొంత ప్రాంతంల్లోనే చైనా నుంచి వచ్చిన వ్యక్తి అలజడి సృష్టించిన వ్యక్తి విషయంలో సీఎం యడియూరప్ప వర్గీయులు తలలు పట్టుకున్నారు.

English summary
Coronavirus (COVID 19): A case has been registered against a person who break the home quarantine rules in hosanagara of shivamogga in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X