చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Corona Lockdown: కరోనా ఆటో వస్తే ప్రజలు పరుగో పరుగు, అలా వెళితే ఇలా వచ్చి, గానా బజానా !

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రాణాంతకమైన కరోనా వైరస్ (COVID 19) ప్రభావంతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు భారతదేశంలో నెల రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనా వైరస్ ఎంత భయంకరంగా ఉంటుందో అని ఎంత చెప్పినా కొందరు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. లాక్ డౌన్ నియమాలు పాటించండి, ఇళ్లలోనే ఉండండి అంటూ నెత్తినోరు మొత్తుకుంటున్నా కొందరు ప్రజలు, యువకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇప్పటికే ప్రభుత్వాలు, పోలీసులు, స్వచ్చంద సేవా సంస్థలు అనేక ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ ఆకారంలో ఓ ఆటోను తయారు చేసి రోడ్ల మీద తిప్పుతూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి మరో ప్రయత్నం చేస్తున్నారు. అయితే కరోనా ఆటో వచ్చిన సమయంలో ప్రజలు పరుగో పరుగు అంటున్నారు. ఆటో అలా వచ్చి ఇలా వెళితే మళ్లీ రోడ్ల మీదకు వచ్చి గానా బజానా అంటూ మీటింగ్ లు పెడుతున్నారు.

Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!

నెత్తినోరు కొట్టుకుంటున్న ప్రభుత్వాలు

నెత్తినోరు కొట్టుకుంటున్న ప్రభుత్వాలు

కరోనా వైరస్ ప్రబళుతున్న సమయంలో అత్యవసరం ఉందంటే తప్ప ఎవ్వరూ బయటకు రాకూడదని, ముఖానికి మాస్కులు వేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా పని చేస్తున్నాయి.

చెవికి ఎక్కించుకోకుండా !

చెవికి ఎక్కించుకోకుండా !

ప్రభుత్వాలు, పోలీసులు, వైద్య సిబ్బంది చెబుతున్న మాటలు చాలా మంది చెవికెక్కడం లేదు. ఉదయం నిద్రలేవగానే బైక్ లు వేసుకుని రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. చిన్నా పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తున్న కరోనా వైరస్ ను లెక్కచెయ్యకుండా ఇప్పుడు కూడా పనిపాటలేదని జులాయిగా తిరిగేస్తున్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా డోంట్ కేర్

ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా డోంట్ కేర్

కరోనా వైరస్ ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ వైరస్ ఎలా వ్యాపిస్తుందో అనే విషయం ప్రతిరోజు టీవీల్లో చూపిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాతో పాటు దిన పత్రికల్లో ప్రతిరోజు కరోనా వైరస్ గురించే అందరూ తెలుసుకుంటున్నారు. అయినా కొందరి బుధ్దిమాత్రం మారడం లేదు.

కరోనా ఆటో వచ్చేసింది !

కరోనా ఆటో వచ్చేసింది !

తమిళనాడు రాజధాని చెన్నై సిటీలో కరోనా ఆకారంలో ఓ ఆటోను తయారు చేసి అక్కడి వీధుల్లో తిప్పుతున్నారు. కరోనా వైరస్ ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి అంటూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి కరోనా వైరస్ బారినపడకూడదని, ఇంట్లోనే ఉంటే మన ప్రాణాలకు ఎలాంటి హాని జరగదని, తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే కచ్చితంగా ముఖానికి మాస్కు వేసుకోవాలని ఆటోలో తిరుగుతూ చెన్నై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఆటో వచ్చి వెళ్లేంత వరకే !

ఆటో వచ్చి వెళ్లేంత వరకే !

కరోనా వైరస్ ఆకారంలో తయారు చేసిన ఆటో చెన్నై సిటీ వీధుల్లోకి వచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తూ మైక్ లో నెత్తినోరు కొట్టుకుంటూ చెప్పినంత వరకు అక్కడి ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారు. ఆటో వెళ్లిపోయిందా మళ్లీ రోడ్ల మీదకు వచ్చి గానా బజానా అంటూ మీటింగ్ లు పెడుతున్నారు. రోడ్ల మీదకు వచ్చిన వారికి ఫైన్ వేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, అనసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెన్నై పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Lockdown : PM Narendra Modi Interacted With Village Panchayats Via Video Conference

English summary
Coronavirus Lockdown: Chennai Artist Modifies Auto On Theme Of COVID 19 To Spread Awareness in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X