• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lockdown curfew: అధికార పార్టీ లీడర్ బర్త్ డే ‘మందు’పార్టీ: 250 మంది జల్సాలు, శివశివ, సీఎం!

|

బెంగళూరు/ గదగ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రులు మనవి చేస్తున్నారు. తన కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే సీఎం హోమ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. కరోనా వైరస్ కట్టడి కోసం కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో అర్దరాత్రి దాటిపోయినా అధికార పార్టీ నాయకుడి బర్త్ డే సందర్బంగా మందుపార్టీ చేసుకుని చిందులు వేశారు. ఆరోగ్య శాఖ మంత్రికి అత్యంత సన్నిహితుడి బర్త్ డే పార్టీ రోజు ఇంత హంగామా జరగడం, అంటు వ్యాధులు వ్యాపించడానికి ప్రయత్నించారని వెలుగు చూడటంతో ప్రజలు శివశివ అంటూ మండిపడుతున్నారు.

Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !

 హోమ్ క్వారంటైన్ లో సీఎం

హోమ్ క్వారంటైన్ లో సీఎం

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అధికారిక నివాసం కృష్ణలోని కొందరు ఉద్యోగులు, కారు డ్రైవర్, ఎస్కార్ట్ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో సీఎం హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. కర్ణాటకలో కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో లాక్ డౌన్ నియమాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. కర్ణాటకలో కరోనా వైరస్ ను అరికట్టడానికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలని స్వయంగా సీఎం బీఎస్. యడియూరప్ప అన్ని పార్టీల నాయకులకు పదేపదే మనవి చేస్తూనే ఉన్నారు.

 ఆరోగ్య మంత్రి అనుచరుడి హంగామా

ఆరోగ్య మంత్రి అనుచరుడి హంగామా

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములకు ఆ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో అత్యంత సన్నిహితులు, అనుచరులు ఉన్నారు. కర్ణాటకలోని గదగ్ జిల్లా బీజేపీ కార్యదర్శి శివనగౌడ మంత్రి శ్రీరాములుకు అత్యంత సన్నిహితుడు. జులై 10వ తేదీన శివనగౌడ పుట్టిన రోజు. శివనగౌడ బర్త్ డే సందర్బంగా గదగ్ జిల్లాలో భారీ ఎత్తున ప్రధాని మోడీ, అమిత్ షా, సీఎం బీఎస్. యడియూరప్ప, మంత్రి శ్రీరాములతో సహ బీజేపీ ప్రముఖుల ఫోటోలతో పెద్దపెద్ద బ్యానర్లు, ఫెక్సీలు ఏర్పాటు చేశారు. శివనగౌడ బర్త్ డే సందర్బంగా శుక్రవారం గదగ్ లో భారీ హంగామా జరిగింది.

 కర్ఫ్యూ సమయంలో మందు పార్టీ

కర్ఫ్యూ సమయంలో మందు పార్టీ

కరోనా వైరస్ కట్టడి కాకపోవడంతో బాగల్ కోటే, కలబురిగి తదితర జిల్లాలో పెళ్లిళ్లతో పాటు అన్ని శుభకార్యాలను ప్రభుత్వం నిషేధించింది. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ప్రతిరోజు కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి, కర్ఫ్యూను లెక్క చెయ్యకుండా బీజేపీ నాయకుడు శివనగౌడ గదగ్ లోని శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఆయన బర్త్ డే పార్టీకి అందర్నీ ఆహ్వానించారు.

 అర్దరాత్రి మందు పార్టీ, చిందులు, ఫోటోలకు ఫోజులు

అర్దరాత్రి మందు పార్టీ, చిందులు, ఫోటోలకు ఫోజులు

శివనగౌడ బర్త్ డే పార్టీ సందర్బంగా సుమారు 250 మందికి పైగా ఒకేచోట గుమికూడారు. శుక్రవారం రాత్రి శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో శివనగౌడకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పిన ఆయన సన్నిహితులు, అనుచరులు అర్దరాత్రి దాటిపోయినా శనివారం వేకువ జామున వరకు మందుపార్టీలో ఎంజాయ్ చేస్తూ చిందులు వేశారు. గదగ్ లో ఇప్పటి వరకు 262 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ మహమ్మారి వ్యాధి కాటుకు 6 మంది మరణించారు. ఇంత జరుగుతున్నా బీజేపీ నాయకులు లాక్ డౌన్ నియమాలు గాలికి వదిలేసి బర్త్ డే పార్టీ చేసుకోవడంతో స్థానికులు మండిపడుతున్నారు.

  Complete Lockdown From July 14-22 బెంగళూరు రూరల్, అర్బన్ జిల్లాల్లో లాక్ డౌన్ || Oneindia Telugu
   అధికార పార్టీ నాయకులకు నో రూల్స్ ?

  అధికార పార్టీ నాయకులకు నో రూల్స్ ?

  బీజేపీ నాయకుడు శివనగౌడ మీద చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పతో పాటు ఆయన గురువు, ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటేల్ కు స్థానికులు మనవి చేస్తున్నారు. మొత్తం మీద అధికార పార్టీ నాయకులు ఏం చేసినా చెల్లుతుందని, మాకేమైనా అవసరం ఉండి అర్దరాత్రి రోడ్లమీదకు వెళితో పోలీసులు లాఠీలో కొడుతున్నారని, బీజేపీ నాయకులను మాత్రం ఏమీ అనడం లేదని గదగ్ జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు.

  English summary
  Lockdown: Karnataka Health Minister Shriramulu's close associate SH Sivanagouda had organized Cocktail party at the Srinivasa Bhavan in Gadad city for his birthday. The party had forgotten the social distance and other lockwdown guidelines. More than 200 BJP party workers and close associates of SH Sivanagouda had participated.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more