బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: బెంగళూరు- న్యూజిలాండ్ ఢీ, కరోనా కట్టడిలో ఎవరు గొప్ప, మీరే చెప్పండి, ఇది లెక్క!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం నేడు కరోనా వైరస్ (COVID 19) మహమ్మారితో పోరాటం చేస్తున్నది. భారతదేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడంలో న్యూజిలాండ్ దేశం ప్రయత్నాలు ఫలించాయి. నేడు భారతదేశం ఐటీ హబ్ బెంగళూరుతో న్యూజిలాండ్ ను పోల్చుతున్నారు. బెంగళూరు జనాభా, న్యూజిలాండ్ జనాభాతో పోల్చుతూ ఎవరు కరోనా కట్టడిలో నిజంగా విజయం సాధించారు ? అనే విషయంపై చర్చ మొదలుపెట్టారు. కరోనా కట్టడిలో బెంగళూరు గ్రేటా ? లేదా న్యూజిలాండ్ మేలా ? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైయ్యింది.

Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్తLockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త

బెంగళూరుతో న్యూజిలాండ్ కు పోలిక!

బెంగళూరుతో న్యూజిలాండ్ కు పోలిక!

కరోనా కట్టడిలో న్యూజిలాండ్ ఎక్కువ కష్టపడిందా ? లేదా బెంగళూరు సిటీలో కరోనా పాజిటివ్ కేసుల కట్టడికి కర్ణాటక ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందా ? అనే చర్చ మొదలైయ్యింది. జనాభా లెక్కలు, కరోనా పాజిటివ్ కేసుల విషయంలో న్యూజిలాండ్ తో పోల్చుకుంటే కర్ణాటక ప్రభుత్వం ఏం అంత నిర్లక్షంగా పని చెయ్యలేదని, బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం చాల కష్టపడిందని వెలుగు చూసింది.

 బెంగళూరు- న్యూజిలాండ్ లెక్కలు

బెంగళూరు- న్యూజిలాండ్ లెక్కలు

2018 జనాభా లెక్కల ప్రకారం బెంగళూరులో కోటి మందికి పైగా నివాసం ఉంటున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో బెంగళూరులో 1 కోటి 30 లక్షల మందికి పైగా నివాసం ఉంటున్నారని కొందరు అధికారులు అంటున్నారు. న్యూజిలాండ్ జనసంఖ్య 48. 90 లక్షలు మాత్రమే. అయితే కరోనా కట్టడిలో న్యూజిలాండ్ కంటే బెంగళూరు ఎక్కువ శ్రమించిందని వెలుగు చూసింది. న్యూజిలాండ్ లో కరోనా పాజిటివ్ కేసులు 1, 154 నమోదైనాయి. బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులు 522 మాత్రమే నమోదైనాయి.

ఎక్కడ ఎక్కువ మంది చనిపోయారంటే ?

ఎక్కడ ఎక్కువ మంది చనిపోయారంటే ?

న్యూజిలాండ్ మొత్తం విస్తీర్ణం 268. 021 Km ఉంది. బెంగళూరు విస్తీర్ణం 709 Km. బెంగళూరులో జనసంద్రత 11847/Km ఉంటే న్యూజిలాండ్ లో జనసంద్రత 18/Km ఉంది. బెంగళూరుతో పోల్చుకుంటే న్యూజిలాండ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. బెంగళూరులో ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధితో 19 మంది మరణించారు. అదే న్యూజిలాండ్ లో కరోనా వైరస్ కాటుకు 22 మంది బలి అయ్యారు.

న్యూజిలాండ్ గ్రీన్ జోన్

న్యూజిలాండ్ గ్రీన్ జోన్

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల లెక్కల ప్రకారం చూసుకుంటే న్యూజిలాండ్ కంటే బెంగళూరులో వైరస్ కట్టడి కోసం ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా పని చేశారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంది. జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే న్యూజిలాండ్ కంటే బెంగళూరు ఎంతో మేలు అని వెలుగు చూసింది. న్యూజిలాండ్ లో 1, 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితే అందులో 22 మంది మాత్రమే మరణించారు. మిగిలిన 1, 132 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ నేడు అందరూ డిశ్చార్జి అయ్యారు.

 బెంగళూరులో కరోనా కేసులు

బెంగళూరులో కరోనా కేసులు

బెంగళూరు సిటీలో మొత్తం 522 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధితో పోరాటం చేసిన 298 మంది వ్యాధి నయం చేసుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 204 ఆక్టివ్ కేసులు మాత్రమే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాయి. కరోనా చికిత్స విఫలమై 19 మంది మరణించారు. న్యూజిలాండ్ తో పోల్చుకుంటే బెంగళూరులో కరోనా కేసులు తక్కువగా నమోదైనాయి.

బెంగళూరు ఏ జోన్ లో ఉందంటే?

బెంగళూరు ఏ జోన్ లో ఉందంటే?

బెంగళూరు సిటీ ఇంకా గ్రీన్ జోన్ లోకి రాలేదు. కర్ణాటకలోని ఉడిపి, కలబురిగి, యాదగిరి జిల్లాలతో పోల్చుకుంటే బెంగళూరు సిటీలో కరోనా పాజిటివ్ కేసులు చాలా తక్కువగా నమోదైనాయని అధికారులు అంటున్నారు. మొత్తం మీద కరోనా కట్టడిలో న్యూజిలాండ్ కంటే బెంగళూరు చాలా గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. ఐటీ హబ్ బెంగళూరులో కరోనా కట్టడికి బీబీఎంపీ అధికారులు చాలా ఎక్కువగా శ్రమిస్తున్నారని అక్కడి ప్రజలు అంటున్నారు.

English summary
Coronavirus: Comparison between Bengaluru and New Zealand COVID 19 cases. Bengaluru has less Coronavirus cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X