వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మో.. మాయదారి కరోనా.. మరో రెండేళ్ల వరకూ వెంటాడుతుందట..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మొత్తం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాలు మొత్తం లాక్‌డౌన్‌ ఆంక్షలు పాటిస్తూ స్వీయ నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ప్రజలెవరూ బాహ్య ప్రపంచంలోకి తొంగి చూడలేని పరిస్థితిలు నెలకొన్నియి. కరోనా వైరస్ ప్రభావం తగ్గితే లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. చాలా వరకు సభ్య దేశాలు 40నుండి 60రోజుల పైనే స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయి. ఐనప్పటికి కరోనా విలయతాండవం చేయడం పట్ల షాక్ కు గురవుతున్నారు ప్రపంచ దేశాల ప్రజలు.

Recommended Video

Coronavirus Update : Coronavirus Could Last Beyond 2022 Says Reports
శాస్త్రవేత్తల తాజా పరిశోధన.. 2022వరకూ వైరస్ ప్రభావం చూపే అవకాశం..

శాస్త్రవేత్తల తాజా పరిశోధన.. 2022వరకూ వైరస్ ప్రభావం చూపే అవకాశం..

ఇదిలా ఉండగా ఈ వైరస్ ప్రభావం ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. 2022 వరకూ దీని ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. శాస్త్రవేత్తల తాజా నివేదికతో ప్రపంచ దేశాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ ఆంక్షల నుండి బయటపడదామనుకుంటున్న ప్రజానికానికి పిడుగులాంటి వార్తగా ఈ నివేదిక పరిణమించిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వాక్సీన్ తయారీలో శాస్త్రజ్ఞులు వేగం పెంచినట్టు తెలుస్తోంది.

అవాక్కవుతున్న ప్రపంచ దేశాలు.. వాక్సీన్ కనిపెట్టడంలో వేగం పెంచిన అగ్ర దేశాలు..

అవాక్కవుతున్న ప్రపంచ దేశాలు.. వాక్సీన్ కనిపెట్టడంలో వేగం పెంచిన అగ్ర దేశాలు..

అంతే కాకుండా యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన సెంటర్ ఫర్ ఇన్‌ఫెక్షన్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ విభాగం తమ తాజా నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల ప్రజలకు రోగ నిరోధక శక్తి పెరిగే వరకూ ఈ వైరస్ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సహజంగా అనారోగ్యంతో ఉన్న వారిపై ఈ వైరస్ వేగవంతంగా ప్రభావం చూపించే లక్షణం ఉంటుందని, కరోనా వైరస్ నివారణ తాజా పరిస్థితుల నేపథ్యంలో అంత సులువు కాదని శాస్ర్తవేత్తలు చెప్పుకొస్తున్నారు. వ్యాక్సిన్లు ఉన్నా కూడా దీన్ని అప్పుడే అదుపు చేయడం కుదరదని వారు తమ నివేదికలో పొందుపరచడం సభ్య దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్టు తెలుస్తోంది.

పిగులాంటి వార్త చెప్పిన డిసీజ్ రీసెర్చ్ విభాగం.. విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న సభ్య దేశాలు..

పిగులాంటి వార్త చెప్పిన డిసీజ్ రీసెర్చ్ విభాగం.. విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న సభ్య దేశాలు..

కరోనా వైరస్ లక్షణాలు కనిపించడానికి ముందే అది సోకిన వారి శరీరంలో ఇన్‌ఫెక్షన్ ఉంటుందని ఆ నివేదికలో పొందుపరిచారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేసి ప్రజలు వైరస్ బారిన పడి ప్రాణ నష్టం కలగకుండా ఆయా దేశాలు ముందు జాగ్రత్త వహిస్తున్నాయి. వైరస్ ప్రభావం జీరో ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వ్యాపార, వాణిజ్య కేంద్రాలను తెరిచేందుకు అనుమతి ఇస్తున్నాయి.

2022వరకు వైరస్ ప్రభావం.. నివేదిక పొందుపరిచిన డిసీజ్ రీసెర్చ్ విభాగం..

2022వరకు వైరస్ ప్రభావం.. నివేదిక పొందుపరిచిన డిసీజ్ రీసెర్చ్ విభాగం..

అయితే, ఈ కరోనా వైరస్ విడతల వారీగా 2022 వరకూ ఉండొచ్చని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన సెంటర్ ఫర్ ఇన్‌ఫెక్షన్ డిసీజ్ రీసెర్చ్ అండ్ పాలసీ విభాగం తమ నివేదికలో పేర్కొంది. ఇక ప్రభుత్వ అధికారులు చెబుతున్న వివరాలను పరిశీలిస్తే ఈ మహమ్మారి అంత త్వరగా అంతం కాదని, ప్రజలు మానసికంగా 2022 వరకూ సిద్ధమవ్వాల్సి అవశ్యకత ఉందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. తాజా నివేదిక ప్రకారం సభ్య దేశాలు స్పందన ఎలా ఉండబోతుందో, వ్యాక్సీన్ తయారీలో ఇంకెంత వేగం పెంచుతారో చూడాలి.

English summary
According to the University of Minnesota's Center for Infection Disease Research and Policy, the coronavirus virus is likely to last until 2022. Scientists are analyzing what the government officials say is that the epidemic will not end soon, and that people will need to be mentally prepared until 2022.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X