చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా కాటుతో తంబీలకు టెన్షన్, చెన్నై సిటీలో 13 వేల కేసులు, మోదీ, సీఎం !

|
Google Oneindia TeluguNews

చెన్నై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) కాటుకు దేశం మొత్తం హడలిపోతున్నది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అయితే తమిళనాడులో ఊహించని విదంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో తమిళ తంబీలకు టెన్షన్ మొదలై తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ పై ఉక్కుపాదం మోపితే తప్పా ఫలితం ఉండదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తమిళనాడు జిల్లా కలెక్టర్లకు ఆ రాష్ట్ర సీఎం ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఇక చెన్నై సిటీలో ఏకంగా 13,380కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తమిళ ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమిళనాడులో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు సేకరించారు.

lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !

తల్లడిల్లుతున్న తమిళనాడు

తల్లడిల్లుతున్న తమిళనాడు

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో తమిళనాడు తల్లడిల్లిపోతున్నది. కరోనా వైరస్ కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నా పాజిటివ్ కేసులు తగ్డడం లేదని, మరింత పెరిగిపోతున్నాయని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం ఎడప్పాడి పళనిస్వామి వీడియో కాన్ఫరెన్స్ తో మాట్లాడి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు.

చెన్నై చిత్తడి, తంబీలకు టెన్షన్

చెన్నై చిత్తడి, తంబీలకు టెన్షన్

తమిళనాడులో శుక్రవారం వరకు మొత్తం 20, 246 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో కరోనా కేసుల సంఖ్య 13, 380కి చేరింది. తమిళనాడులో సుమారు 60 శాతం కరోనా పాజిటివ్ కేసులు ఒక్క చెన్నై సిటీలో నమోదు కావడంతో ఆ నగర ప్రజలతో పాటు ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. చెన్నై సిటీలో ఒక్క శుక్రవారం మాత్రమే 618 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

చెన్నై సెంట్రల్ జైల్లో

చెన్నై సెంట్రల్ జైల్లో

చెన్నై సిటీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ఆ నగరంలోని ప్రజలతో పాటు సిటీ శివార్లలోని చెన్నై పుళల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలు మరింత ఆందోళన చెందుతున్నారు. చెన్నై పుళల్ సెంట్రల్ జైల్లో 94 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 30 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిందని అధికారులు అంటున్నారు.

ఎవరు వచ్చినా వదలద్దు !

ఎవరు వచ్చినా వదలద్దు !

తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులను కట్టడి చెయ్యడానికి అక్కడి ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఇతర రాష్ట్రాల నుంచి ఎవ్వరు వచ్చినా నిర్లక్షం చెయ్యకుండా వారిని వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు పంపించాలని, ఎవ్వరినీ వదలకూడదని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పనులు జరగాలి, అయితే ?

పనులు జరగాలి, అయితే ?

నిర్మాణ రంగం పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలని, కార్మికులు ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. మే 31వ తేదీ అర్దరాత్రితో 4.0 లాక్ డౌన్ పూర్తి అవుతోందని, తరువాత లాక్ డౌన్ నియమాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం అధికారులకు సూచించింది.

తమిళ తంబీల కోసం రూ. 300 కోట్ల కరోనా ప్యాకేజ్

తమిళ తంబీల కోసం రూ. 300 కోట్ల కరోనా ప్యాకేజ్

లాక్ డౌన్ అమలు కావడంతో దెబ్బతిన్న గ్రామీణ పరిశ్రమల ఉద్దీపన కోసం రూ. 300 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయ పథకాన్ని ప్రవేశ పెడుతున్నామని తమిళనాడు ప్రబుత్వం ప్రకటించింది. ఈ కరోనా ప్రత్యేక ప్యాకేజీ వలన పరిశ్రమలకు ఆర్థిక బలోపేతం, ప్రజలకు ఉపాది అవకాశాలు మెరుగుపడతాయని, గ్రామీణ పరిశ్రమల స్థాపనకు ఈ నిధులు ఉపయోగిస్తామని, చితికిపోయిన గ్రామీణ వృత్తులు అభివృద్ది చెయ్యడానికి ఈ నిధులు ఉపయోగిస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

ప్రధాని మోదీ, అమిత్ షా ఆరా

ప్రధాని మోదీ, అమిత్ షా ఆరా

తమిళనాడులో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు సేకరించారు. తమిళనాడులో కరోనా వైరస్ కట్టడికి ఎలాంటి సహాయం చెయ్యడానికైనా తాము సిద్దంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి హామీ ఇచ్చారని తెలిసింది.

English summary
Coronavirus: 874 new positive cases reported in the state today, taking the total positive patients in the state to 20,246: Tamil Nadu Health Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X