బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: దుబాయ్ టూ బెంగళూరు, 6 మందికి కరోనా వైరస్, 195 మందిలో, మొత్తం 21!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID-19) పాజిటివ్ కేసులు భారత్ లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి కరోనా వైరస్ వ్యాధి సోకుందో అర్థం కాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దుబాయ్ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రం చేరుకున్న 6 మందికి కరోనా వైరస్ వచ్చిదని వైద్యులు దృవీకరించారు. కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధి సోకిన వారి సంఖ్య 21కి చేరింది. దుబాయ్ నుంచి వచ్చిన ఆరు మందికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని వెలుగు చూడటంతో వారితో పాటు వచ్చిన మిగిలిన 189 మంది ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద బెంగళూరులోని ప్రజలకు కరోనా వైరస్ వ్యాధి ఎక్కడ వస్తుందో అనే భయం రోజురోజుకు పెరిగిపోతుంది.

Coronavirus: కర్ణాటక సరిహద్దులు క్లోజ్, పరీక్షలు, ఎన్నికలు వాయిదా, బెంగళూరు, ఆంధ్రా!Coronavirus: కర్ణాటక సరిహద్దులు క్లోజ్, పరీక్షలు, ఎన్నికలు వాయిదా, బెంగళూరు, ఆంధ్రా!

దుబాయ్ టూ బెంగళూరు

దుబాయ్ టూ బెంగళూరు

కరోనా వైరస్ వ్యాధితో దుబాయ్ లో నివాసం ఉంటున్న వారు ఆందోళన చెందుతున్నారు. దుబాయ్ లో చిక్కుకున్న తమను రక్షించాలని కన్నడిగులు కర్ణాటక ప్రభుత్వానికి మనవి చేశారు. దుబాయ్ లో చిక్కుకున్న 195 మంది కన్నడిగులను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం) తీసుకు వచ్చారు.

6 మంది కన్నడిగులకు కరోనా

6 మంది కన్నడిగులకు కరోనా

దుబాయ్ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న 195 మందిలో 6 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకిందని వైద్యులు దృవీకరించారు. ఈ విషయంపై కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు స్పందించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆరు మంది కన్నడిగులకు కరోనా వైరస్ వచ్చిందని వైద్యులు చెప్పారని మంత్రి శ్రీరాములు అన్నారు.

 ఆసుపత్రిలో 6 మంది కన్నడిగులు

ఆసుపత్రిలో 6 మంది కన్నడిగులు

దుబాయ్ నుంచి వచ్చిన 6 మంది కన్నడిగులకు కరోనా వైరస్ వ్యాధి సోకిందని వెలుగు చూడటంతో వారిని వెంటనే బెంగళూరు నగరంలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నామని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు ట్వీట్ చేశారు.

 189 మందిపై అనుమానాలు ?

189 మందిపై అనుమానాలు ?

దుబాయ్ నుంచి వచ్చిన ఆరు మందికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో వారితో పాటు దుబాయ్ నుంచి వచ్చిన మిగిలిన 189 మందికి ఏమైనా కరోనా వైరస్ వ్యాధి సోకిందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, వైద్య పరీక్షలు చేయిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.

బెంగళూరు ఎయిర్ పోర్టులో !

బెంగళూరు ఎయిర్ పోర్టులో !

దుబాయ్ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న అందరికీ బెంగళూరు నగరంలోని ఆకాష్ మెడికల్ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్ నిషేధించారు. ఇదే సమయంలో భారతదేశంలోని ఇతర నగరాల నుంచి వచ్చి వెలుతున్న విమాన ప్రయాణికుల మీద ప్రత్యేక నిఘా వేశామని వైద్య శాఖ, ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

English summary
COVID 19 symptoms detected in 6 people who came from Dubai to Bengaluru. total 195 people came to Bangalore from Dubai, now Six are admitted to Rajiv Gandhi Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X