వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్ దూరం కావాలంటే Bootleg alcoholతాగండి, పుకార్లతో 44 మంది మృతి, బ్యాన్ !

|
Google Oneindia TeluguNews

టెహ్రాన్/ ఇరాన్: కరోనా వైరస్ వ్యాధి ( కోవిడ్- 19) వ్యాపిస్తుందనో భయంతో కొందరు ఆకతాయిలు చేసిన ప్రచారం నమ్మిన 44 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. Bootleg alcohol,మద్యపానంతో పాటు క్లోరిన్ సేవించినా, వాటిని పరిసర ప్రాంతాల్లో చల్లినా కరోనా వైరస్ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చని ఇరాన్ లో జోరుగా ప్రచారం జరిగింది. ఎవరో చేసిన ఈ ప్రచారం కారణంగా ఇరాన్ లో విషపూరిత ఆల్కాహాల్ ( మద్యం) సేవించిన 44 మంది మరణించారు. అనకే మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దెబ్బతో ఇరాన్ లోని అనేక ప్రాంతాల్లో మద్యం సేవించడాన్ని బ్యాన్ (నిషేధం) చేశారు.

కరోనా వైరస్ వచ్చే చాన్స్ లేదు, ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ, మంత్రి బళ్లారి, డోంట్ వర్రీ!కరోనా వైరస్ వచ్చే చాన్స్ లేదు, ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ, మంత్రి బళ్లారి, డోంట్ వర్రీ!

 కరోనా వైరస్ భయం

కరోనా వైరస్ భయం

చైనా తరువాత ఇరాన్ దేశంలోనే ఎక్కువగా కరోనా వైరస్ వ్యాధి కేసులు వెలుగు చూశాయి. ఇరాన్ లో కరోనా వైరస్ వ్యాధి అరికట్టడానికి అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అయితే కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలు కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కు మంటున్నారు.

బూట్లెగ్ ఆల్కాహాల్ విరుగుడు !

బూట్లెగ్ ఆల్కాహాల్ విరుగుడు !

ఇరాన్ లోని మధ్య ప్రాచ్య దేశంలో ఇప్పటి వరకు 8, 042 కరోనా వ్యాధి కేసులు నమోదైనాయి. మద్యప్రాచ్య దేశంలో ఎక్కువగా కరోనా వైరస్ వ్యాధి సోకడంతో అక్కడి ప్రజలు హడలిపోయారు. ఇదే సమయంలో ఆల్కాహాల్ సేవిస్తే కరోనా వైరస్ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చని ఆ ప్రాంతంలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ సందర్బంలో స్థానికంగా నివాసం ఉంటున్న వేల మంది విపరీతంగా Bootleg alcohol మద్యం సేవించారు.

 విషపూరిత మద్యం సేవించి 44 మంది బలి

విషపూరిత మద్యం సేవించి 44 మంది బలి

ఇరాన్ లోని మధ్యప్రాచ్య దేశంలోని ఖుజెస్తాన్ ప్రాంతంలో విపరీతంగా బూట్లెగ్ మద్యం (Bootleg alcohol)సేవించారు. విషపూరిత ఆల్కాహాల్ సేవించడంతో వందలాది మంది ఆసుపత్రి పాలైనారు. చికిత్స విఫలమై ఇప్పటి వరకు 44 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఇరాన్ మీడియా తెలిపింది. ఒక్క ఖుజెస్తాన్ ప్రాంతంలోనే మద్యం సేవించిన 218 మంది ఆసుపత్రిలో చేరారని, వారిలో 22 మంది మరణించారని పుర్ మెడికల్ యూనివర్శిటీ అధికార ప్రతినిధి ఎసెన్ ఆలీ హౌర్ స్థానిక మీడియాకు చెప్పారు.

 అవును నిజమే

అవును నిజమే

బూట్లెగ్ ఆల్కాహాల్ సేవించడం వలన ఇప్పటి వరకు 44 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని IRNA agency news సంస్థ తెలిపింది. బూట్లెగ్ ఆల్కాహాల్ సేవించిన వారిలో ఇంకా 30 మంది మృత్యువుతో పోరాడుతున్నారని, వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని IRNA agency news సంస్థ తెలిపింది.

Recommended Video

CoronaVirus : Pune Woman Argument With A Mizoram Girl | Oneindia Telugu
 మ్యద్యపానం నిషేధం

మ్యద్యపానం నిషేధం

ఇరాన్ లో మద్యపానం నిషేధం అమలులో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లోని ముస్లీం మైనారిటీలు మద్యం సేవిస్తున్నారు. ఇలాంటి సందర్బంలోనే కరోనా వైరస్ వ్యాధి నుంచి తప్పించుకోవాలంటే మద్యం సేవించాలని జోరుగా తప్పుడు ప్రచారం జరగడంతో ఇలాంటి దారుణం చోటు చేసుకుందని ఇరాన్ ఆరోగ్య శాఖ అధికారులు విచారం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేసి అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారి మీద ఇరాన్ ప్రభుత్వం నిఘా వేసిందని ఇరాన్ మీడియా వెల్లడించింది.

English summary
Coronavirus (COVID-19) Cure Rumours: 44 People Death From Drink Alcohol Consumed In Iran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X