బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా కాటుకు తండ్రి మృతి, చిరంజీవి జోక్యంతో తలకొరివి పెట్టిన కుమార్తె, క్వారంటైన్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కట్టుకున్న భార్య, ముగ్గురు పిల్లలను పోషించడానికి ఆటో నడుపుతున్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైనాడు. ఆసుపత్రిలో వైద్యం చేసిన డాక్టర్లు అతనికి కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి సోకిందని తేల్చిచెప్పారు. కొన్ని రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న ఆటో డ్రైవర్ కాలం కలిసిరాకపోవడంతో మరణించాడు. కన్న కొడుకుతో సహ కుటుంబ సభ్యులు అందరూ క్వారంటైన్ లో ఉండటంతో కాంగ్రెస్ లీడర్ చిరంజీవి జెట్టి జోక్యంతో తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె ఆయన అంత్యక్రియలు పూర్తి చేసింది.

Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది !

 బెంగళూరు సిటీలో కరోనా కాటు

బెంగళూరు సిటీలో కరోనా కాటు

దేశ ఐటీ, బీటీ సంస్థల రాజధాని సిలికాన్ సిటి బెంగళూరులో కరోనా వైరస్ వ్యాధి తాండవం చేస్తోంది. పదిరోజుల్లో ఎవ్వరూ ఊహించని విధంగా కరోనా వైరస్ వ్యాధి వ్యాపించడంతో బెంగళూరు ప్రజలు హడలిపోయారు. బెంగళూరు సిటీలో ఇప్పటి వరకు 11, 316 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ చికిత్స విఫలమై బెంగళూరు నగరంలోనే 155 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మంగళవారం ఒక్కరోజు మాత్రమే బెంగళూరులో 800 లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

 ఆటో డ్రైవర్ అగచాట్లు

ఆటో డ్రైవర్ అగచాట్లు

బెంగళూరు సిటీలోని శక్తిగణపతి నగర వార్డులో ఓ ఆటో డ్రైవర్ నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు (చివరి సంతానం) ఉన్నారు. భార్య, ముగ్గురు పిల్లలను పెంచిపోషించి వారిని చదివించడానికి అతను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా సుమారు రెండు నెలలకు పైగా ఖాళీగా ఉన్న ఆటో డ్రైవర్ కొన్ని రోజుల నుంచి పగలు రాత్రి అని తేడా లేకుండా ఆటో నడుపుతున్నాడు.

 కరోనా పాజిటివ్ తో హడల్

కరోనా పాజిటివ్ తో హడల్

కొన్ని రోజుల క్రితం ఆనారోగ్యానికి గురైన ఆటో డ్రైవర్ ఆసుపత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకున్నాడు. కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిన వెంటనే ఆటో డ్రైవర్ ను జయదేవ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి జయదేవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ చికిత్స విఫలమై మరణించాడు.

Recommended Video

Telangana New Secretariat పై పెద్ద ఎత్తున విమర్శలు, ప్రజాధనం వృథా | MLA Jagga Reddy ఆవేదన...!!
 తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె

తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె

ఆటో డ్రైవర్ కరోనా వ్యాధి సోకిన వెంటనే అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని క్వారంటైన్ కు తరలించారు. ఆటో డ్రైవర్ అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యలేకపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ వ్యాపారి చిరంజీవి జెట్టి జయదేవ ఆసుపత్రి నుంచి ఆటో డ్రైవర్ మృతదేహాన్ని సుమనహళ్ళి స్మశానవాటికకు తెప్పించారు. తరువాత ఆటో డ్రైవర్ పెద్ద కుమార్తెకు ధైర్యం చెప్పిన చిరంజీవి జెట్టి ఆమెకు పీపీఇ కిట్ వేసి తండ్రికి తల కొరివి పెట్టించారు. తన తండ్రి దిక్కులేనివాడిగా పైకి పోవడం కంటే తానే అంత్యక్రియలు చెయ్యాలని నిర్ణయించానని ఆయన కుమార్తె బోరున విలపించింది.

English summary
Coronavirus: Bengaluru Shakthi Ganapathi Nagar ward auto driver died due to Coronavirus. Daughter performed last rites and followed guidelines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X