వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో 4కు చేరిన కరోనా మృతుల సంఖ్య: పంజాబ్‌లో తొలి మరణం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 172 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వందలాది మంది అనుమానితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కరోనాబారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో మరణం చోటు చేసుకుంది.

పంజాబ్ రాష్ట్రంలో కరోనాబారినపడిన ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్ రాష్ట్రం బంగాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆ వృద్ధుడు చనిపోయాడు. అయితే, అతని రిపోర్టులు గురువారం వచ్చాయి. ఆ రిపోర్టుల్లో వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తేలింది.

Coronavirus death Increasing to 4 in India, Punjab 1st COVID-19 Death Reported

మృతుడు బల్దేవ్ సింగ్(70) ఇటీవలే ఇటలీ, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కరోనాపాజిటివ్ సోకిన ఇతడు గుండెపోటు రావడంతో బుధవారం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కరోనా తొలి మరణం కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకోగా.. ఢిల్లీ రెండో మరణం సంభవించింది.

Recommended Video

Nishabdham Team About Corona Virus | Oneindia Telugu

మూడో మరణం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా మరణంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4కు చేరింది. 172 మందికి పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ ఎక్కువగా నమోదవడం గమనార్హం. ఇక తెలంగాణలో 13, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి.

English summary
A man, who died at a civil hospital in Banga on Wednesday, is confirmed to have suffered from coronavirus according to tests conducted by the state government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X