బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: అమిత్ షాకు కరోనా పాజిటివ్, సోషల్ మీడియాలో సెటైర్లు, కాంగ్రెస్ టాప్ లీడర్ అరెస్టు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ప్రస్తుతం కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా గురుగావ్ లోని మేదాంత అనే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సైతం కరోనా పాజిటివ్ అని తేలడంతో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కేంద్ర హోమ్ మంత్రికి కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత ఆయన గురించి అవహేళనగా సోషల్ మీడియాలో కామెంట్లు చేశాడని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన టాప్ లీడర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను వెంటనే అరెస్టు చేశారు. కేంద్ర హోమ్ మంత్రిపై జోకులు వేసి సోషల్ మీడియాలో లేనిపోని రాద్దాంతం చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ప్రముఖ లీడర్ పై పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు.

Coronavirus: సీఎంకు కరోనా, నేడు కూతురికి పాజిటివ్, కొడుకు క్వారంటైన్, బల్లాల్ క్లారిటీ!Coronavirus: సీఎంకు కరోనా, నేడు కూతురికి పాజిటివ్, కొడుకు క్వారంటైన్, బల్లాల్ క్లారిటీ!

కేంద్ర మంత్రి అమిత్ షా

కేంద్ర మంత్రి అమిత్ షా

కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాకు ఆదివారం కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. గురుగ్రామ్ లోని మేదాంత ప్రైవేట్ ఆసుపత్రిలో అమిత్ షా చికిత్స పొందుతున్నారు. కేంద్ర హోమ్ శాఖా మంత్రికి కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆసుపత్రి ప్రత్యేక వైద్యులు గురుగ్రామ్ చేరుకుని అమిత్ షాకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

అమిత్ షాపై కాంగ్రెస్ లీడర్ సెటైర్లు

అమిత్ షాపై కాంగ్రెస్ లీడర్ సెటైర్లు

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) కార్యవర్గ సభ్యుడు ఆనంద్ ప్రసాద్ కేంద్ర మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత ఆయన గురించి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశారు. అమిత్ షాకు కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే చాలా మంది ఆయన గురించి సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో కేపీసీసీ సభ్యుడు ఆనంద్ ప్రసాద్ సైతం కొన్ని కామెంట్లు చేశారు.

కేంద్ర మంత్రిపై జోకులా ?

కేంద్ర మంత్రిపై జోకులా ?

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కించపరిచే విధంగా, ఆయన్ను వ్యక్తిగతంగా అవహేళన చేసే విధంగా కేపీసీసీ సభ్యుడు ఆనంద్ ప్రసాద్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారని కొందరు బీజేపీ నాయకులు బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే సమమంలో అమిత్ షాను అవహేళన చేస్తూ ఆనంద్ ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని కామెంట్ల స్క్రీన్ షాట్ లను బీజేపీ నాయకులు కబ్బన్ పార్క్ పోలీసులకు అందించారు.

దెబ్బకు కాంగ్రెస్ లీడర్ దిమ్మతిరిగింది

దెబ్బకు కాంగ్రెస్ లీడర్ దిమ్మతిరిగింది

అమిత్ షాను కించపరిచే విధంగా కేపీసీసీ సభ్యుడు కామెంట్లు చేశారని కేసు నమోదు చేసిన కబ్బన్ పార్క్ పోలీసులు సోమవారం ఆనంద్ ప్రసాద్ ను అరెస్టు చేశారు. బెంగళూరులోని కేఆర్ పురం శాసన సభ నియోజక వర్గం బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా ఆనంద్ ప్రసాద్ పని చేస్తున్నారని పోలీసులు న్నారు.

Recommended Video

#AmitabhBachchan : కరోనా నుంచి కోలుకున్న Amitabh Bachchan! || Oneindia Telugu
సోషల్ మీడియాలో సెటైర్లు ?

సోషల్ మీడియాలో సెటైర్లు ?

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేసి ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని, అందుకే ఆనంద్ ప్రసాద్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు కరోనా పాజిటివ్ రావడంతో కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

English summary
Coronavirus: Bengaluru Cubbon park police arrested a KPCC member Anand Prasad for posting a derogatory post on union home minister Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X