వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: రాజ్యసభ ఎన్నికలు, కరోనా ఎమ్మెల్యేలకు లాస్ట్ చాన్స్, A to Z PPEకిట్లు, ఆంధ్రాలో ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ అహమ్మదాబాద్: భారతదేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తోంది. సామాన్య ప్రజలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, అధికారులు, వైద్యులు ఇలా అందరూ కరోనా వైరస్ బారినపడుతున్నారు. కరోనా వైరస్ దేశం అంతా వ్యాపిస్తున్న సమయంలోనే రాజ్యసభ ఎన్నికలను అన్ని పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 8 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో 1, 000 మందికిపైగా ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాధి సోకిన ఎమ్మెల్యేలు వారి ఓటు హక్కను వినియోగించుకోవడానికి భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కరోనా వైరస్ సోకిన ఎమ్మెల్యేలు అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో లాస్ట చాన్స్ లో ఓటు వెయ్యడానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలింగ్ సందర్బంగా కరోనా సోకిన ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు A to Z అందరికీ PPE కిట్లు ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

 ఆంధ్రా టూ గుజరాత్

ఆంధ్రా టూ గుజరాత్

భారతదేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ తాండవం చేస్తున్నా మరో వైపు రాజ్యసభ ఎన్నికల వేడి జోరుగా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తో సహ అన్ని పార్టీలు రాజ్యసభ ఎన్నికలను సవాలుగా స్వీకరించాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, రాజస్థాన్ లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి.

 ఎమ్మెల్యేలకు కరోనా వ్యాధి !

ఎమ్మెల్యేలకు కరోనా వ్యాధి !

దేశంలోని 8 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో దాదాపు 1, 000 మందికి పైగా ఎమ్మెల్యేలు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాధి సోకడంతో కొందరు ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు ఎలా వెయ్యాలి ? మన పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఎలా గెలిపించుకోవాలి ? అనే టెన్షన్ కొన్ని పార్టీ నేతల్లో ఉంది.

 నిఘాలో కరోనా ఎమ్మెల్యేలు

నిఘాలో కరోనా ఎమ్మెల్యేలు

రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లోని సచివాలయాల్లో నోడల్ అధికారులు COVID 19 జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నారు. కరోనా వైరస్ సోకిన ఎమ్మెల్యేలు ఓటు వెయ్యడానికి సచివాలయంలోకి వచ్చే సమయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.

 కరోనా ఎమ్మెల్యేలకు లాస్ట్ చాన్స్

కరోనా ఎమ్మెల్యేలకు లాస్ట్ చాన్స్

రాజ్యసభ ఎన్నికల్లో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని ఎమ్మెల్యేలు మొదట వారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కరోనా వైరస్ సోకిన ఎమ్మెల్యేలు చివరిలో సచివాలయాలకు చేరుకుని వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ బూత్ ల్లో ఓటు వెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. శానిటైజర్ చేసిన ప్రత్యేక అంబులెన్స్ ల్లో కరోనా సోకిన ఎమ్మెల్యేలకు PPE కిట్లు వేసి సచివాలయాలకు తీసుకు వస్తారని, పోలింగ్ బూత్ లో ఉండే ఎన్నికల సిబ్బందికి పీపీఇ కిట్లు అందించామని, వ్యాధి ఒకరి నుంచి మరోకరికి వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. కరోనా వైరస్ సోకిన ఎమ్మెల్యేలు చివరిగా వారి ఓటు వెయ్యడానికి అవకాశం ఇచ్చామని భారత ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

 ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలకు ఎలాంటి వైరస్ సోకకపోయినా రాజ్యసభ ఎన్నికల సందర్బంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఇవో) కె. విజయానంద్ ఆయనను కలిసిన మీడియాకు చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల సందర్బంగా సచివాలయాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నామని, ఏచిన్న పొరపాటు కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ముఖ్య ఎన్నికల అధికారి అశోక్ మానెక్ మీడియాకు చెప్పారు.

Recommended Video

IPL 2020 Line Clear : No T20 World Cup Plans, Cricket Australia Confirms
 గుజరాత్ లో గజగజ

గుజరాత్ లో గజగజ

గుజరాత్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారినపడ్డారు. గుజరాత్ కు చెందిన ఎమ్మెల్యేలు బలరామ్ తావాన్, జగదీష్ పాంచాల్ కు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో వారికి వైద్య చికిత్సలు అందించారు. మరో ఎమ్మెల్యే కిశోర్ చౌహాన్ సైతం కరోనా బారిన పడి జూన్ 18వ తేదీ వరకు క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 8 రాష్ట్రల్లో రాజ్యసభ ఎన్నికలకు ఏర్పాటు చేసిన అతి పెద్ద పోలింగ్ బూత్ గా రాజస్థాన్ ముందు వరుసలో ఉంది.

English summary
Rajya Sabha Elections 2020: From mock election training sessions to isolation rooms and separate voting booths, states are gearing up for the upcoming Rajya Sabha elections in the backdrop of the coronavirus disease (Covid-19).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X