• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Coronavirus effect: స్కూల్, 78% తల్లిదండ్రులు ఇదే మాట, బిస్కెట్ మేలు, బిర్యానీలు వద్దు !

|

న్యూఢిల్లీ/ హైదరాబాద్/ బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో గత మార్చిలో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇంకా పాఠశాలలు తెరవడానికి అనుమతి ఇవ్వలేదు. ఐదున్నర నెలల తరువాత పాఠశాలల ఉపాధ్యాయులు విధులకు హాజరౌతున్నారు. అయితే దేశంలో అధిక శాతం మంది తల్లిదండ్రులు వారి పిల్లలను స్కూల్ కు పంపించడానికి ఆసక్తి చూపించడం లేదు. కరోనా వైరస్ మహమ్మారితో పాటు అంటు వ్యాధులు వ్యాపిస్తాయనే భయంతో దేశవ్యాప్తంగా 78% మంది తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలలకు పంపించడానికి ఆసక్తి చూపించడం లేదని ఓ సర్వేలో వెలుగు చూసింది. బతికుంటే బిస్కెట్ తింటాం, ఇప్పుడు మాకు బిర్యానీలు వద్దు అంటున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబాయి తదితర నగరాల్లో ఈ సర్వే జరిగింది.

Salam bhai: హిందూ అమ్మాయిలను దత్తత తీసుకున్న ముస్లీం, పెళ్లి ఎలా చేశాడంటే, గ్రేట్, వైరల్ !Salam bhai: హిందూ అమ్మాయిలను దత్తత తీసుకున్న ముస్లీం, పెళ్లి ఎలా చేశాడంటే, గ్రేట్, వైరల్ !

కరోనా వైరస్ దెబ్బ

కరోనా వైరస్ దెబ్బ

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాధి తాండవం చేస్తోంది. చిన్నా పెద్ద, కులం మంతం అని తేడా లేకుండా కరోనా వైరస్ దెబ్బతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల ప్రజలకు కరోనా వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

తల్లిదండ్రులకు భయం

తల్లిదండ్రులకు భయం

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో గత మార్చి 25వ తేదీన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రజలు సంచరించడానికి, పలు వ్యాపారాలు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం అనేక నియమాలతో సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం జన సంచారానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే విద్యాసంస్థలు ప్రారంభించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచూతూచి అడుగులు వేస్తోంది. విద్యాసంస్థల కారణంగా కరోనా వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందనే భయం విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువగా ఉందని సమాచారం.

ఈ ఏడాది కాకంటే వచ్చే ఏడాది

ఈ ఏడాది కాకంటే వచ్చే ఏడాది

ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంటున్న తమ పిల్లలను స్కూల్ కు పంపిస్తే ఎక్కడ అంటు వ్యాధులు వ్యాపిస్తాయో ? అనే భయంతో చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ నుంచి విద్యాసంస్థలు తెరుచుకునే అవకాశం ఉంది ? అనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఎస్.పి. రోబోటివ్ వర్క్ అనే సంస్థ దేశ వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. మా పిల్లల చదవు ఒక సంవత్సరం వృధా అయినా పర్వాలేదు, వచ్చే ఏడాది చదువుకుంటారు, మార్చి కాకపోతే సెప్టెంబర్, వాయిదా పద్దతుంది దేనికైనా అంటూ శివ సినిమాలోని పాటను గుర్తు చేస్తున్నారు. మా పిల్లలు ఆరోగ్యంగా ఉండటమే మాకు ముఖ్యం అని అధిక శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఎస్.పి. రోబోటివ్ వర్క్ సంస్థ సర్వేలో వెలుగు చూసింది.

 78% మంది అభిప్రాయం అదే

78% మంది అభిప్రాయం అదే

ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరంతో సహ హైదరాబాద్, ముంబాయి తదితర నగరాల్లో ఎస్.పి. రోబోటివ్ వర్క్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. కరోనా వైరస్ తాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీ పిల్లలను స్కూల్ కు పంపించడానికి మీరు ఆసక్తి చూపిస్తున్నారా ? లేదా ? అంటూ దాదాపు 3, 600 మంది కుటుంబ సభ్యుల అభిప్రాయాలు సేకరించారు. వారిలో దాదాపు 82% నుంచి 86% మంది కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లో మా పిల్లలను స్కూల్ కు పంపించమని అభిప్రాయం వ్యక్తం చేశారని ఎస్.పి. రోబోటివ్ వర్క్ సంస్థ వెల్లడించింది. సరాసరి 78% మంది కుటుంబ సభ్యులు వారి పిల్లలను స్కూల్ కు పంపించడానికి వెనకడుగు వేస్తున్నారని సర్వేలో వెలుగు చూసింది.

  India’s Overall Growth For 2020-21 Projected at Minus 4.5%: RBI || Oneindia Telugu
  బతికుంటే బిస్కెట్ ఓకే, నో బిర్యాని

  బతికుంటే బిస్కెట్ ఓకే, నో బిర్యాని

  కరోనా వైరస్ మహమ్మారి వ్యాధి ఎప్పుడు ఎలా ఎవరికి వ్యాపిస్తుందో అనే భయం చాలా మందికి ఉంది. స్కూల్ లో ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు అనారోగ్యంగా ఉన్న పిల్లల వలన అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని, ఎంతకాలం మా పిల్లలను బయట కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది మీరే చెప్పండి, కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు, కరోన విరుగుడుకు వ్యాక్సిన్ వచ్చే వరకు ఆన్ లైన్ క్లాస్ లు ఎంతో మేలు అని చాలా మంది తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఎస్.పి. రోబోటివ్ వర్క్ సర్వేలో వెలుగు చూసింది. బతికుంటే బిస్కెట్ తిని అయినా ప్రాణాలు నిలబెట్టుకోవచ్చని, ప్రస్తుతం బిర్యానీలు అవసరం లేదని చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Coronavirus effect: 78% Parents Not Ready To Send Children Back To School in India.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X