• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
LIVE
30 Mar, 2020         18:46:39 IST

కోవిడ్-19: అమెరికాలో పెరుగుతున్న మృతుల సంఖ్య..ఇటలీలో లూటీలకు పాల్పడుతున్న జనం

|

న్యూఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనావైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 23వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక 5 లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ఇక అమెరికాలో అయితే కరోనావైరస్ 70వేల మందికి సోకింది. ఇక 1000 మందికి పైగా మృతి చెందారు. భారత్‌లో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 700కు పైగా ఉంది. రోజురోజుకూ మరణాల సంఖ్య కూడా భారత్‌ను కబళిస్తోంది. దీంతో ఏప్రిల్ 14వరకు భారత్ సంపూర్ణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఇక కరోనావైరస్‌కు సంబంధించి ఇటు అంతర్జాతీయంగా, జాతీయంగా, తెలుగు రాష్ట్రాల పూర్తి అప్‌డేట్స్ మీకోసం..

Coronavirus enters India Two from Hyderabad and Delhi tested positive live updates

Newest First Oldest First
6:46 PM, 30 Mar
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
6:28 PM, 30 Mar
శ్రీనగర్‌లో పరిసరాలను క్రిమిసంహారక మందుతో శుభ్రం చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
6:00 PM, 30 Mar
కరోనాకారణంగా వాయిదా పడ్డ టోక్యో ఒలంపిక్స్ 2020: 2021 జూలై 23 నుంచి ఆగష్టు 8 వరకు జరగనున్న ఒలింపిక్స్, ఆగష్టు 24, 2021 నుంచి సెప్టెంబర్ 5 వరకు పారాలింపిక్స్
5:07 PM, 30 Mar
వలస కూలీల కోసం ఖమ్మం నగరంలో మూడు భోజనశాలలు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి పువ్వాడ
4:50 PM, 30 Mar
కరోనావైరస్ ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు చేరలేదని స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ. ఒకవేళ అలాంటిది ఉంటే కచ్చితంగా చెబుతామని వెల్లడించిన ప్రభుత్వం
4:48 PM, 30 Mar
బెంగళూరు నగరంలో అవసరంలో ఉన్నవారికి ఆహారం, శానిటైజర్లను పంపిణీ చేసిన అధికారులు
4:07 PM, 30 Mar
ఏపీ గవర్నర్‌తో భేటీ అయిన సీఎం జగన్..రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని వివరించిన సీఎం జగన్
3:34 PM, 30 Mar
పూణేలో కరోనాతో 52 ఏళ్ల వ్యక్తి మృతి..దీంతో మహారాష్ట్రలో 9కి చేరిన మృతుల సంఖ్య
3:33 PM, 30 Mar
తమ ఒక్కరోజు వేతనంను ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అందజేయాలని తమ ఉద్యోగస్తులకు పిలుపునిచ్చిన ముంబై యూనివర్శిటీ
2:39 PM, 30 Mar
కరోనావైరస్‌పై ఎలా పోరాడి విజయం సాధించాలో కొన్ని సూచనలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ సూచనలను ట్వీట్ చేసిన ప్రియాంకా గాంధీ
2:12 PM, 30 Mar
విదేశాల్లో ఉంటున్న భారతీయ రాయబారులతో సాయంత్రం 5 గంటలకు మాట్లాడనున్న ప్రధాని మోడీ
2:09 PM, 30 Mar
క్రిటికల్ కేర్ ట్రీట్‌మెంట్ కోసం కృష్ణా జిల్లాలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ, గుంటూరులో జీజీహెచ్, తిరుపతిలో పద్మావతి మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది: మంత్రి కన్నబాబు
2:06 PM, 30 Mar
ప్రతీ వార్డుల్లో రెండు టీమ్‌లను ఏర్పాటు చేయాలి: సీఎం జగన్
2:06 PM, 30 Mar
అర్బన్ ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రావాలి: మంత్రి కన్నబాబు
2:05 PM, 30 Mar
మీడియాతో ఏపీ మంత్రి కన్నబాబు
పలువురు అధికారులతో కరోనావైరస్‌పై సీఎం జగన్ సమీక్షించారు: మంత్రి కన్నబాబు
2:04 PM, 30 Mar
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు
పలువురు అధికారులతో కరోనావైరస్‌పై సీఎం జగన్ సమీక్షించారు: మంత్రి కన్నబాబు
2:02 PM, 30 Mar
ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు
పలువురు అధికారులతో కరోనావైరస్‌పై సీఎం జగన్ సమీక్షించారు: మంత్రి కన్నబాబు
1:51 PM, 30 Mar
నిజాముద్దీన్ దర్గాలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్న 200 మందిని క్వారంటైన్‌కు తరలింపు
1:45 PM, 30 Mar
ఢిల్లీలోని రెండు హాస్పిటల్స్‌లో కోవిడ్-19 పేషెంట్స్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్లకు హోటల్ లలిత్‌లో ప్రత్యేక గదులను కేటాయించిన ఢిల్లీ సర్కార్
1:43 PM, 30 Mar
తమిళనాడులో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు
1:41 PM, 30 Mar
కరోనావైరస్ పై పరిస్థితిని సమీక్షించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అదే సమయంలో ఐఐటీలోని మహిళల హాస్టల్స్ ను సమీక్షించిన సీఎం
1:27 PM, 30 Mar
రెండు దేశీయ కంపెనీలు 50వేల N-95 మాస్కులను తయారు చేస్తున్నారు.వచ్చే వారం నుంచి రోజుకు 1లక్ష మాస్కుల ఉత్పత్తి జరుగుతుంది.భారత్‌లోని హాస్పిటల్స్‌లో 11.95 లక్షల మాస్కులు స్టాక్‌లో ఉన్నాయి. గతరెండు రోజుల్లో అదనంగా 5 లక్షల మాస్కులను పంచాము: కేంద్ర ఆరోగ్య శాఖ
12:36 PM, 30 Mar
కరోనా జాతీయ విపత్తు నేపథ్యంలో వైద్య విభాగాలు మొత్తం ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తూ ఉత్తర్వులు
12:36 PM, 30 Mar
ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలు, రోగ నిర్దారణ పరీక్షలు, ఇన్ పేషెంట్ సేవలు మొత్తం ప్రభుత్వ అధీనంలోకి
11:48 AM, 30 Mar
ప్రిస్క్రిప్షన్‌లో ఆల్కహాల్ రాస్తున్న డాక్టర్లు వైద్యం చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని కేరళ ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేరళ విభాగం
11:20 AM, 30 Mar
ఏపీ హెల్త్ బులిటెన్ విడుదల
ఏపీలో హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అధికారులు: ఇప్పటి వరకు 23 పాజిటివ్ కరోనా కేసులు నమోదు
10:44 AM, 30 Mar
ఆదివారం రోజున చైనాలో 30 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు
10:32 AM, 30 Mar
ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ పొడిగింపు ఉంటుందన్న వార్తల్లో వాస్తవం లేదు: కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గోబే
10:02 AM, 30 Mar
దేశవ్యాప్తంగా 30కి చేరిన మరణాల సంఖ్య, మహారాష్ట్ర కేరళలో పరిస్థితి దారుణం
9:46 AM, 30 Mar
లాక్‌డౌన్ నేపథ్యంలో రోడ్లపై తిరుగుతున్న వాహనాలను అడ్డుకుని పాస్‌లను చెక్ చేస్తున్న ఢిల్లీ పోలీసులు
READ MORE

English summary
A 76 year old man from Kalaburagi who died on March 10 is the country's first Covid-19 fatality, with test results on Thursday confirming that he was infected. The man with a travel history to Saudi Arabia and died when he was being brought from a Hyderabad hospital to Kalaburagi on March 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X