వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: బెంగళూరులో ఎక్కువైన కేసులు, డాక్టర్లు, నర్సులు ఫైర్, క్వారంటైన్ లో ఉంటాం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి Coronavirus క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులకు తరలించి వారు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ దెబ్బకు లక్ష మందికి పైగా పిట్టల్లా రాలిపోయారు. భారతదేశంలో కరోనా వ్యాధి సోకిన వారికి వైద్యులు, నర్సులు, వైద్య శాఖ అధికారులు చికిత్స చేస్తున్నారు. అయితే బెంగళూరులో ఇఎస్ఐ ఆసుపత్రుల్లో కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స చేస్తున్న ఇఎస్ఐ ఆసుపత్రి వైద్యులు, నర్సులు మాకు ఆసుపత్రుల్లో క్వారంటైన్ లో ఉండటానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి చికిత్స చేస్తున్న వైద్యులు, నర్సులు ఆందోళనకు దిగడంతో ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు షాక్ కు గురైనారు.

Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !

బెంగళూరు రాజాజీనగర్

బెంగళూరు రాజాజీనగర్

బెంగళూరు నగరంలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాధి అనుమానిత కేసులు ఎక్కువ అవుతున్నాయి. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో అధికారులు వారికి ఆసుపత్రుల్లోని క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ లోని ఇఎస్ఐ ఆసుపత్రిలో కరోనా వైరస్ క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేష్ వార్డులు ఉన్నాయి.

చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులు

చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులు

బెంగళూరులోని రాజాజీనగర్ లోని ఇఎస్ఐ ఆసుపత్రి చాలా పెద్దది. ఈ రాజాజీనగర్ ఇఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగులు, కార్మికులు వేల సంఖ్యలో చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ కేసులతో పాటు కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఇఎస్ఐ ఆసుపత్రికి తరలిస్తున్నారు. వీరందరికి అక్కడి డాక్టర్లు, నర్సులు 24 గంటలు చికిత్స అందిస్తున్నారు.

ఐసోలేషన్ వార్డుల్లో 100 మంది

ఐసోలేషన్ వార్డుల్లో 100 మంది

ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మద్య కాలంలో ఇఎస్ఐ ఆసుపత్రికి కరోనా వైరస్ అనుమానితులు ఒక్కసారిగా పోటె్త్తారు. అందులో ఇద్దరికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసింది. బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ ఇఎస్ఐ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో వంద మందికి పైగా కరోనా వైరస్ వ్యాధి కోసం చికిత్స పొందుతున్నారు.

డాక్టర్లు, నర్సులకు భయం

డాక్టర్లు, నర్సులకు భయం

కరోనా వైరస్ వ్యాధి కేసులు రోజురోజుకు ఎక్కువగా వస్తున్న సమయంలో ఇఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగాలు చేస్తున్న డాక్టర్లు, నర్సులకు భయం పట్టుకుంది. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి తాము ఇక్కడ చికిత్స చేస్తున్నామని, అలాగే ఇక్కడి నుంచి ఇళ్లకు వెలుతున్నామని ఎక్కడ మా కుటుంబ సభ్యులకు ఆ వ్యాధి సోకుతుందో అనే భయంగా ఉందని వైద్యులు, నర్సులు అంటున్నారు.

Recommended Video

Vizag Municipal Commissioner Srujana Attending Duties With One Month Baby
క్వారంటైన్ లోనే ఉంటాం, లేదంటే ?

క్వారంటైన్ లోనే ఉంటాం, లేదంటే ?

కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి చికిత్స చేస్తున్న మేము ఇక్కడి నుంచి ఇళ్లకు వెళ్లలేమని, ఆసుపత్రిలోని క్వారంటైన్ లో మేమూ ఉండటానికి అవకాశం ఇవ్వాలని ఇఎస్ఐ వైద్యులు, నర్సులు వారి పై అధికారులకు చెప్పారు. అయితే వైద్యులు, నర్సులు ఆసుపత్రిలోని క్వారంటైన్ లో ఉండటానికి అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తాము క్వారంటైన్ లో ఉండటానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇఎస్ఐ ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు ఆందోళనకు దిగారు. వైద్యులు, నర్సుల ఆందోళన ఎక్కడ పెరిగి పెద్దది అవుతుందో అనే భయంతో ఇఎస్ఐ ఆసుపత్రి ఉన్నత స్థాయి అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వైద్యులు, నర్సులు ఆసుపత్రిలోని క్వారంటైన్ లో ఉండటానికి అవకాశం ఇవ్వాలా ? వద్దా ? అనే విషయంపై చర్చిస్తున్నారు.

English summary
Coronavirus: Bengaluru Rajajinagar ESI Hospital Doctors and Nurse who are treating COVID 19 patients Urging that Please Quarantine Them in Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X