వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ఎవరూ మాస్క్ ధరించాలి, ఎప్పుడు వేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాపిస్తోండటంతో భయాందోళన నెలకొంది. వైరస్‌కు మందు లేకపోవడం, నివారణ ఒక్కటే మార్గం కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తుమ్మితే వచ్చే తుంపిర్లు, చేతులు మొహానికి అంటుకోవడంతో వైరస్ సోకుతోంది. దీంతో మాస్క్‌లు ధరించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఎవరూ మాస్క్ ధరించాలి..? మాస్క్ ధరించేందుకు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా..? అనే అంశంపై కేంద్ర వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు అని కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. ఒకవేళ మీకు దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఉంటే మాత్రమే మాస్క్ ధరించాలని సూచిస్తోంది. మీరు కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స ఇస్తున్నట్లైతే మాస్క్ ధరించాలని సజెస్ట్ చేశారు. వైరస్ అనుమానిత వ్యక్తులకు వైద్య సాయం అందజేస్తున్న ఆరోగ్య కార్యకర్త అయినా మాస్క్ ధరించాలని స్పష్టంచేసింది.

coronavirus: Everyone NEED NOT WEAR a mask! central government

మాస్క్ ధరించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా కేంద్ర వైద్యారోగ్యశాఖ వివరించింది. వైరస్ సోకిన వారికి ట్రీట్‌మెంట్ ఇచ్చేవారు ప్రతీ 6 గంటలకు ఒకసారి మాస్క్ మార్చాలని సూచించింది. లేదంటే మాస్క్ తడిగా మారే అవకాశం ఉందని హెచ్చరించంది. ముక్కు, నోరు, గదవను కవర్ చేస్తూ మాస్క్ ధరించాలని.. ఒక్కసారి ధరిస్తే తీయొద్దని.. ముక్కు నుంచి గదవ వరకు ఉండాలని గ్యాప్ ఉంచొద్దని సలహాచెప్పింది.

Recommended Video

Mega Star Chiranjeevi On Covid 19 | Megastar Chiranjeevi Message To People

డిస్పోజబుల్ మాస్క్‌లను ఒకసారి వాడి డస్ట్ బిన్‌లో పడేయాలని.. మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని తేల్చిచెప్పింది. మాస్క్ పెట్టుకున్నాక దానిని చేతులతో ముట్టుకోవద్దని తెలిపింది. మాస్క్ వాడే సమయంలో దానిని తీసి భుజాలకు వేసుకోవద్దని స్పష్టంచేసింది. మాస్క్ తీసేసిన తర్వాత చేతులను సబ్బు లేదా, శానిటైజర్‌తో శుభ్రపరచుకోవాలని సూచించింది. మాస్క్ ఎలా వాడాలనే అంశంపై సందేహాం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1075, 011-23978046 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరింది. సందేహాల కోసం [email protected]కు మెయిల్ చేయాలని సూచించింది.

English summary
when we wear mask and where we wear.. how to use mask central Ministry of Health & Family Welfare suggest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X