బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

PM Cares Funds: సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్, సీఎంపై సొంత పార్టీ నేతలు ఫైర్, ఆరోజు కళ్లు లేవా ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/శివమొగ్గ: ప్రధాని నరేంద్ర మోదీ సహాయ నిధికి (PM Cares Funds) వెలుతున్న విరాళాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై బీజేపీ నాయకులు కేసు పెట్టడంతో ఎఫ్ఐఆర్ నమోదైయ్యింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సందర్బంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పపై సొంత పార్టీ నాయకులు సైతం అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలో మీరు (UPA) అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ నాయకుల మీద అనేక కేసులు నమోదైనాయని, ఆరోజు మీకు కళ్లు కనపడలేదా ? అంటూ కాంగ్రెస్ పార్టీని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Lockdown: ఒరేయ్.... నువ్వు ముస్లీం కదా ?, గడ్డం లాయర్ కు వాతలు, లేపేస్తాం అని ఇంట్లో వార్నింగ్ !Lockdown: ఒరేయ్.... నువ్వు ముస్లీం కదా ?, గడ్డం లాయర్ కు వాతలు, లేపేస్తాం అని ఇంట్లో వార్నింగ్ !

 మోదీపై సోనియా గాంధీ ఫైర్

మోదీపై సోనియా గాంధీ ఫైర్

కరోనా వైరస్ ను అరికట్టడానికి, లాక్ డౌన్ సందర్బంగా పేదలు ఆదుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సహాయ నిధికి (PM Cares Funds) అందుతున్న విరాళాలు దుర్వినియోగం అవుతున్నాయని, పేదల అవసరాల కోసం ఆ నిధులు వినియోగించడం లేదని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులపై సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

 కేసు పెట్టిన లాయర్

కేసు పెట్టిన లాయర్

ప్రధాన మంత్రి సహాయ నిధికి వెలుతున్న విరాళాలు దుర్వినియోగం అవుతున్నాయని లేనిపోని ఆరోపణలు చేసి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపణలు చేశారని, ఆమె మీద కేసు నమోదు చేసి విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గకు చెందిన బీజేపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్

సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్

న్యాయవాది, బీజేపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు శివమొగ్గ పోలీసులు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సోనియా గాంధీ మీద రాజకీక్ష కక్షతో కేసు నమోదు చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు.

ట్రబుల్ షూటర్ వార్నింగ్

ట్రబుల్ షూటర్ వార్నింగ్

తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఆర్ ను 24 గంటల్లో వెనక్కి తీసుకోకపోతే తాము తీవ్రస్థాయిలో పోరాటం చేస్తామని కేపీసీసీ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు, కేసు పెట్టిన లాయర్, బీజేపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ కు డెడ్ లైన్ విధించారు. ఇదే సమయంలో డీకే. శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం యడియూరప్పను కలిసి సోనియా గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను వెంటనే రద్దు చెయయాలని ఒత్తిడి చేశారు.

 ఆ రోజు మోదీ సీఎం, మీరు ఎన్ని కేసులు పెట్టారు ?

ఆ రోజు మోదీ సీఎం, మీరు ఎన్ని కేసులు పెట్టారు ?

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండేదని బీజేపీ నాయకులు గుర్తు చేశారు. సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ గా ఉన్న సమయంలో బీజేపీ నాయకులు మీద ఎన్ని కేసులు పెట్టారు ? అనే విషయం అప్పుడు మీకు గుర్తుకు రాలేదా ? అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను బీజేపీ ప్రశ్నిస్తోంది.

 రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి

రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి

రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్ణబ్ గోస్వామి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్కలేని కేసులు పెట్టారని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్లు మూసుకుని ఉన్నారా ? అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సోనియా గాంధీ మీద ఒక్క కేసు నమోదు కావడంతో లేనిపోని రాద్దాంతం చేస్తున్న నాయకులు అదే మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ నాయకుల మీద కేసులు పెడితే మీరు ఎందుకు ప్రశ్నించలేదని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

 కోర్టులో తేల్చుకోండి

కోర్టులో తేల్చుకోండి

సోనియా గాంధీ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓ సలహా ఇచ్చారు. మీరు ఎదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని, లేనిపోని ఆరోపణలు చెయ్యడం మంచిది కాదని అంటున్నారు. ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో బీజేపీ నాయకులు సోనియా గాంధీపై కేసు పెట్టడంతో బీజేపీలోని సొంత పార్టీకి చెందిన కొందరు నాయకులు సీఎంపై అసహనంగా ఉన్నారని తెలిసింది.

English summary
Coronavirus: FIR Against AICC President Sonia Gandhi, Is BJP Leaders Unhappy With Karnataka CM BS. Yediyurappa,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X