వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఒకే ఫ్యామిలీలో ఐదు మందికి, యువతితో లింక్, ఎలా వెళ్లి ఎలా వచ్చిందంటే ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ కోల్ కతా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి ఎప్పుడు ఎవరికి వ్యాపిస్తుందో అనే విషయం అంతుచిక్కడం లేదు. కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజల పిట్టల్లా రాలిపోతున్నారు. భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకు వ్యాపించడంతో ప్రజలు హడలిపోతున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసి కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడానికి అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పశ్చిమ బెంగాల్ లో ఒకే ఫ్యామిలీలో 9 నెలల చిన్నారితో సహ ఐదు మందికి కరోనా వైరస్ వ్యాపించడంతో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యూకే నుంచి వచ్చిన వ్యక్తితో లింక్ ఉన్న యువతి ఫ్యామిలీ సభ్యులకు కరోనా వైరస్ సోకింది.

నాకు కరోనా వైరస్ వచ్చింది, దమ్ముంటే దగ్గరకు రండి, చస్తారు, పోలీసులకు సవాల్, సీన్ కట్ చేస్తే ! నాకు కరోనా వైరస్ వచ్చింది, దమ్ముంటే దగ్గరకు రండి, చస్తారు, పోలీసులకు సవాల్, సీన్ కట్ చేస్తే !

పశ్చిమ బెంగాల్ లో ఒకే ఫ్యామిలీలో !

పశ్చిమ బెంగాల్ లో ఒకే ఫ్యామిలీలో !

పశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ వ్యాధి సోకిన వారి సంఖ్య 15కు చేరింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన 9 నెలల చిన్నారి, ఆరు సంవత్సరాల బాలిక, 11 సంవత్సరాల బాలుడు, 27, 45 సంవత్సరాలు వయసు ఉన్న ఇద్దరు మహిళలతో సహ మొత్తం ఐదు మందికి కరోనా వైరస్ వ్యాధి వ్యాపించింది.

యూకే నుంచి వచ్చిన వ్యక్తితో యువతికి లింక్ !

యూకే నుంచి వచ్చిన వ్యక్తితో యువతికి లింక్ !

ఇటీవల యూకే నుంచి భారత్ వచ్చిన వ్యక్తికి కరోనా వ్యాధి సోకిందని నిర్ధారణ అయ్యింది. యూకే నుంచి వచ్చిన వ్యక్తితో 27 ఏళ్ల యువతికి సంబంధం ఉందని వెలుగు చూసింది. యూకే నుంచి వచ్చిన వ్యక్తితో సంబంధం సాగిస్తున్న 27 ఏళ్ల యువతి కరోనా వైరస్ వ్యాపించడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఆవ్యాధి సోకిందని వెలుగు చూసింది.

హౌస్ అరెస్టు చేస్తే ?

హౌస్ అరెస్టు చేస్తే ?

పశ్చిమ బెంగాల్ లోని నాదియా జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువతి, ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉంటున్నారు. యూకేలో విద్యాభ్యాసం చేస్తూ భారత్ వచ్చిన యువకుడికి కరోనా వైరస్ లక్షనాలు ఉన్నాయనే అనుమానంతో అతన్ని ఇంటిలో హౌస్ అరెస్టు చేశారు. అయితే హౌస్ అరెస్టులో ఉన్న యువకుడు, అతని కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు వచ్చిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఎలా వెళ్లి ఎలా వచ్చిందంటే ?, 18 మందికి దెబ్బ !

ఎలా వెళ్లి ఎలా వచ్చిందంటే ?, 18 మందికి దెబ్బ !

కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని యూకే నుంచి వచ్చిన యువకుడి కుటుంబ సభ్యులు ఆరు మందిని మార్చి 23వ తేదీ హౌస్ అరెస్టు చేశారు. వారిలో ఐదు మందికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసింది. ఆ ఐదు మందితో టచ్ లో ఉన్న మరో 18 మందిని ప్రస్తుతం క్వారంటైన్ కు తరలించారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన ఒకే ఫ్యామిలీలోని ఐదు మందికి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని నాదియా జిల్లాలో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

English summary
Coronavirus: Five members of a family, including three children, tested positive for COVID-19 in West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X