వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus fixed fee: గీత దాటితే గీతాగోవిందం, దేవుడుకూడా కాపాడలేడు, దూలతీరింది !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ రాంచీ/ జార్ఖండ్: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి సోకిన సామాన్య ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం ప్రజలకు కరోనా వ్యాధిని నయం చెయ్యకుండానే వారి నుంచి రక్తం పీల్చినట్లు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే కరోనా వైరస్ తో ప్రాణాలు పోయినా వారి కుటుంబ సభ్యులను పీడించి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసి తరువాత వారికి మృతదేహాలు అప్పగిస్తున్నారని వెలుగు చూసింది. అయితే సామాన్య ప్రజల కష్టాలు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ కు చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షణ రేఖ గీచింది. ప్రభుత్వం విధించిన ఫీజులు మాత్రమే కరోనా రోగుల నుంచి వసూలు చెయ్యాలని, ఎక్కడైనా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే మీమ్మల్ని ఆదేవుడు కూడా కాపాడలేడని, గీత దాటితే మీకు గీతాగోవిందం గ్యారెంటీ అంటూ హెచ్చరించింది. ఇంతకాలం విచ్చలవిడిగా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వ ఆదేశాలతో దూలతీరిపోతుంది సామన్య ప్రజలు అంటున్నారు.

Coronavirus: ఆసుపత్రిలో రోగి మాయం, డ్రైనేజ్ లో శవం, కిడ్నీలు కొట్టేసి హత్య ?, ఆసుపత్రి మటాష్ !Coronavirus: ఆసుపత్రిలో రోగి మాయం, డ్రైనేజ్ లో శవం, కిడ్నీలు కొట్టేసి హత్య ?, ఆసుపత్రి మటాష్ !

పీక్కుతింటున్న ఆసుపత్రులు

పీక్కుతింటున్న ఆసుపత్రులు

జార్ఖండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్న రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేసుకోవడానికి వెళితే ఆసుపత్రుల యాజమాన్యం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని, మా రక్తం పీల్చుకుని తాగుతున్నారని ఆరోపిస్తూ అనేక మంది బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. విషయం తెలుసుకున్న జార్ఖండ్ ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగి గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేసి వివరాలు సేకరించారు.

మిమ్మల్ని దేవుడు కూడా కాపడలేడు

మిమ్మల్ని దేవుడు కూడా కాపడలేడు

ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల కుటుంబ సభ్యుల నుంచి జార్ఖండ్ ప్రభుత్వ అధికారులు రహస్యంగా వివరాలు సేకరించారు. కరోనా వ్యాధి నయం కావడానికి రోగులకు చికిత్స అందిస్తున్న కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని వెలుగు చూసింది, అందుకే ప్రభుత్వం కరోనా వ్యాధి చికిత్సకు ధరలు నిర్ణయించామని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బన్నాగుప్తా అన్నారు. మీరు నియమాలు ఉల్లంఘించి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే తరువాత మిమ్మల్ని ఆదేవుడు కూడా కాపాడలేడని జార్ఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బన్నాగుప్తా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాన్ని హెచ్చరించారు.

గ్రూప్ A,B,C కేటగిరి

గ్రూప్ A,B,C కేటగిరి

జార్ఖండ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను ఎ, బీ, సీ కేటగిరులుగా విభజించారు. అలాగే ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆసుపత్రులకు గుర్తించి వాటి సామర్థ్యం గుర్తించి ఆసుపత్రులకు విభజించారు. జార్ఖండ్ రాష్ట్రంలో A,B,C జిల్లాల పరిధిలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు యాజమాన్యం కరోనా రోగుల నుంచి ఇంతే ఫీజులు వసూలు చెయ్యాలని ప్రభుత్వం ధరలు ఫిక్స్ చేసింది. అధిక మొత్తంలో కరోనా రోగుల నుంచి ఫీజులు వసూలు చేస్తే మీ దూలతీరిపోతుందని ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాన్ని హెచ్చరించింది.

A కేటగిరి ఫీజులు ఇంతే ఉండాలి

A కేటగిరి ఫీజులు ఇంతే ఉండాలి

జార్ఖండ్ రాష్ట్రంలో A కేటగిరి పరిదిలోని ఆసుపత్రులు కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్న వారి నుంచి చికిత్స చెయ్యడానికి రూ. 6, 000, ఆక్సిజన్ అందిస్తూ ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తే రూ. 10, 000, ఐసీయూలో వెంటిలేటర్ అమర్చితే రూ. 18, 000 మాత్రమే వసూలు చెయ్యాలి. అదే విదంగా కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తుల నుంచి రూ. 5,500, ఐసోలేషన్ వార్డులో ఆక్సిజన్ అందిస్తే రూ. 8,000, ఐసీయూలో వెంటిలేటర్ అమర్చితే రూ. 15, 000 మాత్రమే వసూలు చెయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

B C కేటగిరిలు

B C కేటగిరిలు

జార్ఖండ్ లోని B కేటగిరి జిల్లాలో కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న రోగుల నుంచి రూ. 5,500, ఐసోలేషన్ వార్డులో ఆక్సిజన్ అందిస్తూ చికిత్స చేస్తే రూ. 8,000, ఐసీయూలో చికిత్స అందిస్తే రూ. 14,400 మాత్రమే వసూలు చెయ్యాలి. ఇక జార్ఖండ్ లోని C కేటగిరి జిల్లాలో కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న రోగుల నుంచి రూ. 5,000, ఐసోలేషన్ వార్డులో ఆక్సిజన్ అందిస్తూ చికిత్స చేస్తే రూ. 6,400, ఐసీయూలో చికిత్స అందిస్తే రూ. 10, 800 మాత్రమే వసూలు చెయ్యాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బన్నా గుప్తా ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

India’s Overall Growth For 2020-21 Projected at Minus 4.5%: RBI || Oneindia Telugu
గేమ్స్ ఆడితే జైలు గ్యారెంటి

గేమ్స్ ఆడితే జైలు గ్యారెంటి

జార్ఖండ్ లో అధిక మొత్తంలో కరోనా రోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేసినట్లు వెలుగు చూస్తే మీ ఆసుపత్రుల లైసెన్స్ లు రద్దు చెయ్యడమే కాకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని, అందులో ఎలాంటి రాజీ లేదని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాన్ని జార్ఖండ్ ప్రభుత్వం హెచ్చరించింది.

English summary
Coronavirus fixed fee: Jharkhand Govt Fixed Fee For Private Hospitals for Treatment COVID-19 Patients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X