వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అకౌంట్ బ్లాక్, ట్విట్టర్ భారత ద్రోహి, తబ్లీగి జీహాదీలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) భారత్ లో ఎక్కువగా వ్యాపించడానికి తబ్లీగి జమాత్ జీహాదీలు కారణం అని ఆరోపిస్తూ కేంద్ర మాజీ మంత్రి, ఉత్తర కన్నడ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ట్వీట్ చెయ్యడడంతో ఆయన ట్వీట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేశారు. మా సంస్థ నియమాలు, నిబంధనలు ఉల్లంఘించి మీరు పదేపదే ట్వీట్ చేస్తున్నారని, అందుకే మీ అకౌంట్ బ్లాక్ చేస్తున్నామని ట్వీట్టర్ సంస్థ బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేకి లేఖ పంపించింది. భారత ద్రోహి ట్వీట్టర్ సంస్థ, అందుకే తన అకౌంట్ బ్లాక్ చేశారు, నేను ఈ విషయాన్ని ప్రధాని, కేంద్ర హోమ్ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశానని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అంటున్నారు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

 తబ్లీగి జమాత్ మీద ఫైర్

తబ్లీగి జమాత్ మీద ఫైర్

దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి మూలకారణం ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన వారే ప్రధాన కారణం అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ఏప్రిల్ 8వ లేదీన ట్వీట్ చేశారు. అదే రోజు తబ్లీగి జమాత్ సభ్యులపై మండిపడుతూ బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే నాలుగు సార్లు వరుసగా ట్వీట్ చేశారు.

తబ్లీగి జమాత్ జీహాదీలు

తబ్లీగి జమాత్ జీహాదీలు

తబ్లీగి జమాత్ సభ్యుల వలనే భారతదేశంలో ఎక్కువగా కరోనా వైరస్ వ్యాధి కేసులు నమోదైనాయని, వారు జీహాదీలు అంటూ బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన ట్వీట్ లను ఆ సంస్థ పరిశీలించింది. వెంటనే మీరు చేసిన ట్వీట్ లు మీ అకౌంట్ నుంచి తొలగించాలని ఆ సంస్థ ప్రతినిధులు బీజేపీ అనంత్ కుమార్ హెగ్డేకి సూచించారు. బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ఆయన చేసిన ట్వీట్ లు తొలగించలేదు.

కేంద్ర మాజీ మంత్రి అకౌంట్ బ్లాక్

కేంద్ర మాజీ మంత్రి అకౌంట్ బ్లాక్

బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే తబ్లీగి జమాత్ సభ్యులను జీహాదిలతో పోల్చుతూ చేసిన ట్వీట్ లు మాత్రం తొలగించలేదు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేకి చెప్పినా మాట వినడం లేదని ఆయన ట్వీట్టర్ అకౌంట్ ను ఆ సంస్థ ప్రతినిధులు బ్లాక్ చేశారు. మీ అకౌంట్ ను బ్లాక్ చేశామని ట్వీట్టర్ సంస్థ సింపుల్ గా బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేకి సోషల్ మీడియాలో లేఖ పంపించింది.

భారత ద్రోహి ట్వీట్టర్

భారత ద్రోహి ట్వీట్టర్

కొన్ని రోజుల క్రితం ట్వీట్టర్ లో గురుపత్వంత్ సింగ్ పన్నూన్ అనే ట్వీట్టర్ అకౌంట్ లో పంజాబ్ రాష్ట్రాన్ని భారతదేశం నుంచి విభజించి ఖలీస్తాన్ దేశంగా ప్రకటించాలని ఓ ప్రకటన ( Advertisement)విడుదల చేశారు. ఆ సమయంలో ట్వీట్టర్ సంస్థ Advertisement కోసం డబ్బులు తీసుకుని పంజాబ్ ను ఖలీస్తాన్ దేశంగా ప్రకటించాలని ప్రకటన ఇచ్చారని, ఆ సంస్థ భారతదేశ ద్రోహి అని, భారత సాంప్రధాయాలను గౌరవించడంలేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే మండిపడుతున్నారు.

ప్రధాని, హోమ్ మంత్రికి ఫిర్యాదు

ప్రధాని, హోమ్ మంత్రికి ఫిర్యాదు

భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించడానికి ప్రధాన కారణం తబ్లీగి జమాత్ సభ్యులు అని ట్వీట్ చేసిన తన ట్వీట్టర్ అకౌంట్ ను ఏప్రిల్ 22వ తేదీ బ్లాక్ చేశారని అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. ట్వీట్టర్ సంస్థ భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశానని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అన్నారు.

Recommended Video

Coronavirus Update : High Tension, 80% Asymptomatic Covid Cases In India
దేశం కోసం దేనికైనా సిద్దమే !

దేశం కోసం దేనికైనా సిద్దమే !

దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై. దేశానికి ద్రోహం చెయ్యడానికి ప్రయత్నించే వారిపై తాను పోరాటం చేస్తానని, అందులో తాను వెనక్కి తగ్గనని, అది ట్వీటర్ సంస్థ అయినా, మరేదైనా ఒక్కటే అని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. తబ్లీగి జమాత్ సభ్యులు జీహాదిలు అని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని, తాను చేసిన ట్వీట్ తొలగించనని ఇప్పటికే చెప్పానని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే 2016 నుంచి ట్వీట్టర్ అకౌంట్ కొనసాగిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేకు ట్వీట్టర్ అకౌంట్ లో 74, 300 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

English summary
Coronavirus: Former Union Minister and Uttara Kannada Lok Sabha MP Anantakumar Hegde's Twitter account has been Bocked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X