వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: గోవా సీఎంకు కరోనా పాజిటివ్, బీచ్ లు మూసేయండి, ఒక్కరోజులో సీన్ రివర్స్!

|
Google Oneindia TeluguNews

గోవా/ పణజి/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి బాధితుల జాబితాలో మరో ముఖ్యమంత్రి చేరిపోయారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం అయిన గోవా సీఎంకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. తనకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిందని, తాను త్వరగా కోలుకుని ప్రజాసేవకు అంకితం అవుతానని గోవా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు కరోనా వైరస్ బారినపడి చికిత్స చేయించుకుని ఆ మహమ్మారి వ్యాధి నయం చేసుకున్న విషయం తెలిసిందే.

Coronavirus: 24 గంటల్లో 69 వేల మందికి కరోనా, ఇప్పుడే ఇలా ఉంటే అన్ లాక్ దెబ్బకు, దేవుడా!Coronavirus: 24 గంటల్లో 69 వేల మందికి కరోనా, ఇప్పుడే ఇలా ఉంటే అన్ లాక్ దెబ్బకు, దేవుడా!

 సీఎంకు కరోనా లక్షణాలు లేవు

సీఎంకు కరోనా లక్షణాలు లేవు

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (47)కు కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసింది. తనకు ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని, అయినా వైద్యుల సలహామేరకు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నానని, వ్యాధి త్వరగా నయం చేసుకుని మళ్లీ ప్రజాసేవ చెయ్యడానికి మీ ముందుకు వస్తానని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ట్విట్ చేశారు.

మంగళవారం క్షణం తీరకలేకుండా

మంగళవారం క్షణం తీరకలేకుండా

గోవాలో కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడానికి అక్కడి ప్రమోద్ సావంత్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. మంగళవారం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోవాలోని అన్ని కరోనా క్వారంటైన్ కేంద్రాల్లోని అధికారులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా గోవాలో ఒక్క కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసు లేకుండా చూడాలని సీఎం ప్రమోద్ సావంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 సార్ మీకు పాజిటివ్

సార్ మీకు పాజిటివ్

మంగళవారం కరోనా వైరస్ విషయంలో వైద్య శాఖ, సంబంధిత అధికారుల సమావేశం పూర్తి అయిన తరువాత సీఎం ప్రమోద్ సావంత్ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. తరువాత గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను కలిసిన అధికారులు సార్ మీకు కరోనా పాజిటివ్ వచ్చిందని, వెంటనే ఐసోలేషన్ లో చికిత్స పొందాలని మనవి చేశారు. బుధవారం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వయంగా ట్వీట్ చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో సన్నిహితంగా ఉన్న మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి క్యూ కట్టారు.

 గోవాలో మొత్తం 17 వేలు, ఇక్కడ రోజుకు 10 వేలు

గోవాలో మొత్తం 17 వేలు, ఇక్కడ రోజుకు 10 వేలు

కేంద్రపాలిత ప్రాంతం అయిన గోవాలో ఇప్పటి వరకు 17, 416 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ వ్యాధి చికిత్స విఫలమై ఇప్పటి వరకు 192 మంది మరణించారు. గోవాలో ఇప్పటి వరకు 13, 577 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గోవాలో మొత్తం 17 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు.అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రోజుకు 11 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

English summary
Coronavirus: Goa Chief Minister Pramod Sawant tweeted this morning to say that he has tested positive for coronavirus and that he is in home isolation. Mr Sawant, 47, said he is "asymptomatic and hence have opted for home isolation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X