• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Gold mask: బంగారంతో కరోనాను భయపెడుతున్న వ్యాపారి, ఎవడిపిచ్చి వాడి ఆనందం, డబ్బుంటే ?

|

భువనేశ్వర్/ ముంబై: ప్రపంచంలోని ప్రజలు అందరూ ప్రస్తుతం ఆ దేవుడిని వేడుకుంటున్నది ఒక్కటే, కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధి నుంచి మా ప్రాణాలు కాపాడు స్వామి అని. అయితే కరోనా వైరస్ దెబ్బతో కొందరు సెలబ్రిటీలు అయిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాళ్లు ఎవడి పిచ్చి వాడి ఆనందం అంటున్నారు. పూర్వకాలం నుంచి నేటి వరకు ప్రాణాలు కాపాడుకోవడానికి మానవుడికి ఆహారం అవసరం. ఇప్పుడు ఆహారంతో పాటు మొబైల్, ఇంటర్నెట్ లేకపోతే మనిషి జీవించలేని స్థితికి చేరుకున్నాడు. కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు మాస్క్ మానువుడికి ఎంతో అవసరం అయ్యింది. మాస్క్ వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ప్రతిరోజు మనవి చేస్తూనే ఉన్నారు. అయితే శ్రీమంతులు వారి స్టేటస్ చూపించుకోవడానికి బంగారు మాస్క్ లు చేయించుకుని వార్తల్లో నిలుస్తున్నారు. ఒడిశాలోని ఓ వ్యక్తి బంగారు మాస్క్ తో పాటు మెడలో బంగారు గొలుసులు వేసుకుని కరోనా వైరస్ నే భయపెట్టాలని ప్రయత్నిస్తున్నాడు.

Ex-lover blackmail: ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ లకు నేను రెఢీ, నగ్న వీడియోలతో టార్చర్, థర్డ్ డిగ్రీతో !

ముంబై, సూరత్, పూణేలో జోరుగా వ్యాపారం

ముంబై, సూరత్, పూణేలో జోరుగా వ్యాపారం

కరోనా వైరస్ దెబ్బకు ప్రతిఒక్కరు మాస్క్ లు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేకుండా ఎవరైనా బయటకు వస్తే పోలీసులు భారీ మొత్తంలో అపరాదరుసుం వసూలు చేస్తున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బకు బంగారు నగల వ్యాపారం దెబ్బ తినడంతో ముంబై, సూరత్, పూణే తదితర ప్రాంతాల్లో కొందరు బంగారు నగల వ్యాపారులు బంగారుతో మాస్క్ లు తయారు చేసి మార్కెట్ లో పెట్టి వ్యాపారం చేస్తున్నారు.

ఎవడి పిచ్చి వాడి ఆనందం

ఎవడి పిచ్చి వాడి ఆనందం

ఒడిశాలోని కేశరపురలో నివాసం ఉంటున్న అలోక్ మెహంతి పెద్ద పారిశ్రామికవేత్త. మామూలుగానే అలోక్ మెహంతి మెడలో బంగారు గొలుసులు వేసుకుని జనాలను భయపెడుతుంటాడు. ఆడవాళ్ల కంటే ఎక్కువగా బంగారు చైన్లు మెడలో వేసుకోవడం ప్రముఖ పారిశ్రామికవేత్త అలోక్ మెహంతికి కొన్ని ఏళ్లుగా అలవాటుగా మారిపోయింది.

 ఏం పోయింది.... వేసుకుంటే పోలా !

ఏం పోయింది.... వేసుకుంటే పోలా !

ఇటీవల మార్కెట్ లోకి బంగారు మాస్క్ లు వచ్చాయని టీవీల్లో న్యూస్ తెలుసుకున్న పారిశ్రామివేత్త అలోక్ మెహంతి ముంబైలోని ఓ బంగారు నగల వ్యాపారిని సంప్రధించారు. తనకు బంగారంతో తయారు చేసిన N95 మాస్క్ తయారు చేసి ఇవ్వాలని, ధర ఎంతైనా పర్వాలేదని ముంబైలోని బంగారు నగల వ్యాపారికి అలోక్ మెహంతి చెప్పాడు.

 బంగారు మాస్క్ ఫోటోలు వైరల్

బంగారు మాస్క్ ఫోటోలు వైరల్

ముంబైలోని బంగారు నగల వ్యాపారి రూ. 3. 59 లక్షల విలువైన N95 మాస్క్ తయారు చేసి ఒడిశాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అలోక్ మెహంతికి పంపించాడు. అంతే బంగారు రంగులో దగదగ మెరిసోతున్న బంగారంతో తయారు చేసిన N95 మాస్క్ వేసుకున్న అలోక్ మెహంతి ఫోటోలకు ఫోజు ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. తాను పూణే వ్యాపారి వేసుకున్న బంగారు మాస్క్ చూసి మురిసిపోయి తాను ఓ బంగారు మాస్క్ చేయించుకున్నానని అలోక్ మెహంతి అంటున్నాడు.

  Tirumala Darshans Should Stop : Ramana Deekshitulu - ఆపాల్సిన అవసరం ఏముంది ? YV Subba Reddy
  బంగారం తినలేం కదా ?

  బంగారం తినలేం కదా ?

  మనం బంగారం తినలేం కదా, అందుకే బంగారంతో తయారు చేసిన మాస్క్ వేసుకుంటే పోయేది ఏముంది ? అంటున్నాడు పారిశ్రామికవేత్త అలోక్ మెహంతి. ఇదే సమయంలో కరోనా వైరస్ పుణ్యామా అంటూ మార్కెట్ లోకి కొత్తకొత్త వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి, కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో పేద ప్రజలకు తినడానికి మెతుకు చిక్కక అల్లాడుతుంటే కొందరు శ్రీమంతులు ఇలా పాటుపడుతున్నారని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మండిపడుతున్నారు.

  English summary
  Coronavirus Gold mask: After inspired from Pune business man now Odisha man got himself a gold mask in the price of Rs. 3.5 lakh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X