వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: మాస్క్ ఎలా వాడాలి..? 3 లేయర్ల మాస్క్‌తోనే సేఫ్టీ, 8 గంటల తర్వాత..

|
Google Oneindia TeluguNews

చైనాలోని వుహాన్‌లో ఆవిర్భవించిన కరోనా వైరస్.. క్రమంగా ఇతర దేశాలకు విస్తరించింది. 160కి పైగా దేశాల్లో వైరస్ పాకింది. ప్రపంచవ్యాప్తంగా 7 వేలకు పైగా చనిపోగా.. లక్షల సంఖ్యలో వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్నారు. జ్వరం దగ్గుతో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతాయి. వైరస్ సోకిన వ్యక్తి దగ్గితే మీటర్ దూరంలోపు ఉన్నవారిపై ప్రభావం చూపుతోందని కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. వైరస్ ప్రబలకుండా ఉండేందుకు మాస్క్ ధరించాలని సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం జరుగుతోంది.

మార్కెట్లలో వివిధ రకాల, సైజుల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. ముక్కు, చెవి, గదవను కప్పి ఉంచే వివిధ మాస్కులు ఉన్నాయి. అందులో వాడి పారేసి డిస్పోజబుల్ మాస్క్‌లు ఉండగా.. వాడుతూ వాష్ చేసుకొనే పలు మాస్క్‌లు కూడా ఉన్నాయి. తెలుపు, పసుపు, నీలం రంగుల్లో అవి మార్కెట్లలో లభిస్తున్నాయి.

coronavirus: govt Guidelines on use of masks by public

కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులు లేదంటే వారికి వైద్యం అందిస్తోన్న సిబ్బంది మాత్రమే మాస్క్ ధరించాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఆరోగ్యంగా ఉన్నవారు మాస్క్ ధరించొద్దని.. ఒకవేళ ఎవరైనా మాస్క్ ధరిస్తే ప్రజలకు తప్పుడు భావన వెళ్తుందని పేర్కొన్నది. దీంతో ఇతరులు భయాందోళనకు గురై.. తమను తాము అతిగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉన్నది. మాస్క్ ధరించడం వల్ల వైరస్ దరిచేరదనే అంశంపై స్పష్టత లేదని.. డిస్పోజబుల్ మాస్క్‌ను ఆరు గంటల కంటే ఎక్కువ వాడొద్దని కేంద్ర వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. ఒకవేళ వాడితే తడి ఏర్పడి అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది.

వైరస్ దృష్ట్యా సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవాలని సూచింది. నీటిలో సెకన్ల పాటు చేతులను ఉంచాలని.. ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో 20 సెకన్ల పాటు చేతులు క్లీన్ చేసుకోవాలని సజెస్ట్ చేసింది. చేతులు మురికిగా ఉండే శానిటైజర్ కాకుండా నీరు, సబ్బుతో వాష్ చేసుకోవాలని పేర్కొన్నది.

Recommended Video

కరోనా Thermal Scanning Center At TDP Central Office | Oneindia Telugu

ఎవరైనా వ్యక్తిలో తీవ్రంగా దగ్గు వస్తే.. మూడు లేయర్లు గల మాస్క్ ధరించాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచించింది. ఈ మాస్క్ మిమ్మల్ని కాపాడటమే కాకుండా.. ఇతరులకు వైరస్ సోకుండా నివారిస్తోంది. దీంతోపాటు తరచుగా మీ చేతులను కూడా శుభ్రపరచుకోవాలని.. దీంతో ఇతరులకు వైరస్ సోకకుండా ఉంటుంది. అయితే ఆ మాస్క్ 8 గంటల తర్వాత మార్చాలని సూచించారు. లేదంటే తడి ఏర్పడి.. ఇన్‌ఫెక్సన్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.

English summary
coronavirus effect: Medical masks of different size and shapes are available in the market
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X