వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఫినాయిల్ మేలుకదరా దరిద్రుల్లారా, 11 శానిటైజర్ కంపెనీలపై ఎఫ్ఐఆర్, దూలతీరింది!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ చండీఘర్/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచంలోని అన్ని వ్యాపారాలు దాదాపుగా కుదేలు అయ్యాయి. భారతదేశంలో కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా నిత్యవసర వస్తువులతో పాటు ఔషధాలు, మాస్క్ లు, శానిటైజర్లు, పీపీఇ కిట్లు ఇలా మెడికల్ షాకు సంబంధించిన వ్యాపారాలు మాత్రం జోరుగా జరిగాయి. అయితే ఫినాయిల్ కంటే దారుణంగా శానిటైజర్లు తయారు చేసి విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫినాయిల్ కంటే నాసిరకంగా శానిజైర్లు తయారు చేస్తున్న 11 కంపెనీల దరిద్రుల మీద కేసులు నమోదు చెయ్యాలని మంత్రి ఆదేశాలు జారీ చెయ్యడంతో ఎఫ్ఐర్ లు తయారు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

 ప్రజల సెంటిమెంట్ మీద దెబ్బ

ప్రజల సెంటిమెంట్ మీద దెబ్బ

కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, వారి సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలని కొందరు వ్యాపారులు ప్రయత్నించారు. ఎన్నో ఏళ్ల నుంచి మాస్క్ లు, శానిటైజర్ల వ్యాపారం చేస్తున్న వారికి పోటీగా ఇప్పుడు మాస్క్ లు, శానిటైజర్లు తయారు చేసే కంపెనీలు పుట్టగొడుగుళ్లా పుట్టుకువచ్చాయి.

 వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్

వార్నింగ్ ఇచ్చినా డోంట్ కేర్

నాసిరకం మాస్క్ లు, శానిటైజర్లు తయారు చేసి ప్రజలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు, వైద్యశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చినా కొన్ని పనికిరాని కంపెనీలు ఏమాత్రం పట్టించుకోలేదు. గుడ్డ కనపడిందా మాస్క్ చేసేయ్, నీళ్లు కనపడ్డాయా కెమికల్స్ కలిపి శానిటైజర్లు చేసేయ్ అంటూ చిన్నాచితకా కంపెనీలు రెచ్చిపోతున్నాయి.

అంతా మాఇష్టం

అంతా మాఇష్టం

హర్యానాలో చాలా కంపెనీలు నాసిరకం శానిటైజర్లు తయారు చేసి ఇతర రాష్ట్రాల్లోని వివిద ప్రాంతాలకు పంపిస్తున్నారని అక్కడి అధికారులు గుర్తించారు. నాసిరకం శానిటైజర్లు తయారు చేస్తున్న కంపెనీలను అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. అయినా ఆ కంపెనీలు అంతా మా ఇష్టం అని రెచ్చిపోయాయి. నాసిరకం శానిటైజర్లు తయారు చేస్తున్న కంపెనీలపై అక్కడి ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 11 కంపెనీల దూలతీరింది

11 కంపెనీల దూలతీరింది

హర్యానాలో నాసిరకం శానిటైజర్లు తయారు చేసి ప్రజలను నిలువునా దోచుకుంటున్న 11 కంపెనీలను గుర్తించిన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి అనిల్ విజ్ ఆదేశాలతో పోలీసులు 11 శానిటైజర్లు తయారు చేసే కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేశారు.

Recommended Video

China New Virus : Tick-Borne Virus Spreads Across East China || Oneindia Telugu
248 శానిటైజర్ కంపెనీలు

248 శానిటైజర్ కంపెనీలు

హర్యానాలో 248 శానిటైజర్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. హర్యానా ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని కంపెనీల శానిటైజర్లను ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేయించారు. ఇప్పటి వరకు 123 కంపెనీల శానిటైజర్ పరీక్షా ఫలితాలు వచ్చాయని, వాటిలో 11 కంపెనీల శానిటైజర్లు చాలా నాసిరకంగా, ఎక్కువ మోతాదులో హానికరమైన మెథనాల్ మిక్స్ చేశారని వెలుగు చూసిందని, ఆ కంపెనీల లైసెన్స్ లు రద్దు చేసి వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ బుధవారం మీడియాకు చెప్పారు.

English summary
Coronavirus: Haryana police have filed FIR against 11 Sanitizer company after Quality test failure. and also suspend the license of the brands whose samples failed the tests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X