బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: మీడియా మిత్రులకు కరోనా పరీక్షలు, డీసీఎం, హోమ్ మంత్రి క్వారంటైన్ లో, అందుకే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రజలతో పాటు వైద్య, ఆరోగ్య, పారిశుద్ద కార్మికులు, పోలీసులు, రాజకీయ నాయకులతో పాటు మీడియా ప్రతినిధులు సైతం హడలిపోతున్నారు. ఎప్పుడు ఏరకంగా కరోనా వైరస్ వ్యాధి సోకుతుందో చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాతో పాటు ఆ సంస్థలకు చెందిన 1, 170 మంది సిబ్బందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. మీడియా ప్రతినిధులతో సన్నిహితంగా ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి, వైద్య, ఆరోగ్య శిక్షణా శాఖ మంత్రి ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.

lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!

 మీడియా మిత్రుల కోసం సీఎం ఆదేశాలు

మీడియా మిత్రుల కోసం సీఎం ఆదేశాలు

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆదేశాల మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్ర రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరులో పనిచేస్తున్న మీడియా మిత్రుల కోసం కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ వైద్య పరీక్షల శిబిరంలో ప్రైవేట్ టీవీ ఛానల్ రిపోర్టర్లు, కెమెరామెన్లు, డ్రైవర్లు, మీడియా సిబ్బంది, ప్రింట్ మీడియా రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు, డిజిటల్ మీడియా సిబ్బంది, ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియా ప్రతినిధులు హాజరై కరోనా వైరస్ వైద్య పరీక్షలు చేయించుకున్నారని కర్ణాటక రాష్ట్ర సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ డిపి. మురళిధర్ గుప్తా తెలిపారు.

 1, 170 మంది హాజరు

1, 170 మంది హాజరు

బెంగళూరు నగరంలోని ఇందిరానగర్ లోని సీవీ. రామన్ ఆసుపత్రిలో మీడియా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన కరోనా వైరస్ వైద్య పరీక్షల శిభిరంలో బెంగళూరు నగరంలో పని చేస్తున్న 1, 170 మంది మీడియా సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఏప్రిల్ 23వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మీడియా ప్రతినిధుల కోసం వైద్య శిభిరం నిర్వహించారు.

 మీడియాలో కరోనా నెగటివ్, పాజిటివ్ కేసులు !

మీడియాలో కరోనా నెగటివ్, పాజిటివ్ కేసులు !

ఓ ప్రైవేట్ టీవీ చానల్ లో కెమెరా మెన్ గా పని చేస్తున్న వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసింది. అతనికి నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మిగిలిన మీడియా మిత్రులు ఎవ్వరికీ కరోనా వైరస్ లేదని వెలుగు చూసింది. కరోనా వైరస్ సోకిన కెమెరా మెన్ తో సన్నిహితంగా ఉన్న 36 మంది మీడియా ప్రతినిధులు ఓ ప్రైవేట్ హోటల్ లో గత మూడు రోజుల నుంచి క్వారంటైన్ లో ఉన్నారని అధికారులు తెలిపారు.

 క్వారంటైన్ లో ఉప ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి

క్వారంటైన్ లో ఉప ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి

ప్రైవేట్ టీవీ చానల్ కెమెరా మెన్ తో సన్నిహితంగా ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఐటీ, బీటీ పరిశ్రమల శాఖా మంత్రి డాక్టర్ అశ్వథనారాయణ, కర్ణాటక హోమ్ శాఖా మంత్రి బసవరాజ్ బోమ్మయ్, వైద్య, ఆరోగ్య శిక్షణా శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ కు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముగ్గురికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు నిర్దారించారు. అయితే ముందు జాగ్రత్తగా ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథనారాయణ, హోమ్ మంత్రి బసబరాజ్ బోమ్మయ్, వైద్య, ఆరోగ్య శిక్షణా శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.

 ఊపిరిపీల్చుకున్న ఫ్యామిలీలు

ఊపిరిపీల్చుకున్న ఫ్యామిలీలు

నిత్యం ప్రజల సమస్యలు వెలుగులోకి తీసువస్తూ, కరోనా వైరస్ సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్న మీడియా మిత్రులకు కరోనా వైరస్ సోకలేదని వెలుగు చూడటంతో మీడియా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, కర్ణాటక ప్రభుత్వం, మీడియా యాజమాన్యం ఊపిరిపీల్చుకున్నారు.

Recommended Video

Indian Railways Plan To Operate 400 Special Trains Per Day With 1,000 Passengers

English summary
Coronavirus has been negative among the staff of Bengaluru's media houses who have been tested. A total of 1,170 employees of media institutions, including print, electronic and digital media reporters, camons, and trivers, were examined by COVID 19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X