వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: డేంజర్ బెల్స్, 30 శాతం జిల్లాల్లో ప్రభావం, పెద్ద జిల్లాల్లో 60 శాతం పాజిటివ్..

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చాపకింద నీరులా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. దేశంలోని 30 శాతం జిల్లాలకు వైరస్ పాకిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 720 జిల్లాల్లో 211 జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించామని పేర్కొన్నది. పెద్ద జిల్లాల్లో 60 శాతం మేర వైరస్ ప్రభావం ఉందని.. మిగతా జిల్లాల్లో 30 శాతం వరకు ఎఫెక్ట్ చూపించిందని తెలిపింది.

ఆయా జిల్లాల్లో వైరస్ ప్రభావం హెచ్చు తగ్గులు ఉంటాయని గుర్తుచేసింది. కొన్ని జిల్లాల్లో వైరస్ పరీక్షించే కిట్ల కొరత ఉందని విరించారు. అవసరమైన మేర సదుపాయాలు కూడా లేవని తెలిపింది. లాక్ డౌన్ వల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగామని కర్ణాటకకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. నెలాఖరు వరకు శ్వాస తీసుకొనేందుకు ఉపయోగించే పంపులు 16 వేల, వెంటిలేటర్లు 5 వేలు అవసరమవుతాయని జేఎన్‌యూ ప్రొఫెసర్ సంతోష్ పేర్కొన్నారు.

Coronavirus has spread to 30% of Indias districts

దేశవ్యాప్తంగా 6 వేల వెంటిలెటర్లు, 2 వేల ఐసీయూ పడకలు ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ఆయా జిల్లాలు, ప్రధాన నగరాల్లో 100 కరోనా వైరస్ సదుపాయాలు కల్పించే సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపింది. 17 రాష్ట్రాలు, కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాల్లో గల 20 జిల్లాలకు పైగా 20 శాతం కరోనా వైరస్ ప్రభావం చూపించిందని వెల్లడించింది.

English summary
Coronavirus has spread to 30% of India's districts union health department officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X