వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:ఆసుపత్రిలో కరోనా రోగి టిక్ టాక్ వీడియోలతో యువతి హంగామా, సెల్ఫీలు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ అరియూరు: కరోనా వైరస్ (COVID 19) వ్యాధితో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగి ప్రభుత్వ ఆసుపత్రిలో టిక్ టాక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆసుపత్రి నియమాలు ఉల్లంఘించి కరోనా రోగి టిక్ టాక్ వీడియోలు చిత్రీకరించడానికి అనుమతి ఇవ్వడంతో పాటు ముగ్గురు ఉద్యోగులు ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. కరోనా వైరస్ రోగి సెల్ ఫోన్ చేతపట్టుకుని టిక్ టాక్ వీడియోలు చిత్రీకరించిన ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో వారిని క్వారంటైన్ లో నిర్బంధించారు.

Coronavirus: లాక్ డౌన్, రోడ్లలో ప్రజలు హల్ చల్, కరోనా హెల్మెట్ తో పరుగో పరుగు, సూపర్ !Coronavirus: లాక్ డౌన్, రోడ్లలో ప్రజలు హల్ చల్, కరోనా హెల్మెట్ తో పరుగో పరుగు, సూపర్ !

 ఫినిక్స్ మాల్ లో యువతి ఉద్యోగం

ఫినిక్స్ మాల్ లో యువతి ఉద్యోగం

తమిళనాడులోని అరియలూరు ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతి వేలాచేరిలోని ప్రముఖ ఫినిక్స్ మాల్ లో ఉద్యోగం చేస్తున్నది. ఈమె మార్చి 24వ తేదీ చెన్నై నుంచి తిరిగి వచ్చింది. చెన్నై నుంచి వచ్చిన యువతికి జ్వరం ఎక్కవగా ఉండటంతో గత శుక్రవారం ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు.

 కరోనా వైరస్ వ్యాధి ?

కరోనా వైరస్ వ్యాధి ?

చెనై నుంచి వచ్చిన యువతికి కరోనా వైరస్ సోకిందని తెలుసుకున్న వైద్యులు ఆమెను ప్రభుత్వ అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ మహిళా వార్డుకు తరలించారు. అప్పటి నుంచి ఆ యువతిని బయటకు రానివ్వకుండా వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 కరోనా రోగికి టిక్ టాక్ పిచ్చి

కరోనా రోగికి టిక్ టాక్ పిచ్చి

అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతికి చాలాకాలం నుంచి టిక్ టాక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. టిక్ టాక్ వీడియోల పిచ్చి ఎక్కువగా ఉన్న యువతి ఆసుపత్రిలో కాలక్షేపం చెయ్యడానికి ఆమెకు అధికారులు, సిబ్బంది కొని పుస్తకాలు ఇచ్చారు. అయితే ఆ పుస్తకాలు చదవకుండా ఆ యువతి డిప్రెషన్ లోకి వెళ్లిందని తెలిసింది.

 ఆసుపత్రిలో టిక్ టాక్ వీడియోలతో హల్ చల్

ఆసుపత్రిలో టిక్ టాక్ వీడియోలతో హల్ చల్

అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న యువతి అక్కడ పారిశుద్ద కార్మికులుగా పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు మాయమాటలు చెప్పింది. తాను వెంటనే టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకుంటే తనను ఇన్ని రోజులు ఫాలో అవుతున్న నెటిజన్లు తనను మరిచిపోతారని ఆ యువతి వారి దగ్గర వాపోయింది. తరువాత ఆసుపత్రి ఉద్యోగుల సహాయంతో ఆసుపత్రిలో అటూఇటూ తిరుగుతూ టిక్ టాక్ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ టిక్ టాక్ వీడియోలను చూసిన నెటిజన్లు అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రి సీనియర్ వైద్యులకు సమాచారం ఇచ్చారు.

 ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ ?

ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ ?

ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న యువతి ముగ్గురు ఉద్యోగుల దగ్గరకు వెళ్లి టిక్ టాక్ వీడియోలు తీసిందని అధికారులు గుర్తించారు. అంతే కాకుండా ముగ్గురు ఉద్యోగులు యువతి మొబైల్ తీసుకుని టిక్ టాక్ వీడియోలు చిత్రీకరించడంతో పాటు ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారని ఆసుపత్రి వైద్యులు, సంబంధిత అధికారులు గుర్తించారు. యువతి సెల్ ఫోన్ చేతుల్లో పట్టుకోవడం, ఆమెతో సెల్ఫీలు తీసుకోవడంతో ఆ ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ వ్యాపించి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

 క్వారంటైన్ లో ఉాద్యోగులు !

క్వారంటైన్ లో ఉాద్యోగులు !

కరోనా వైరస్ చికిత్స పొందుతున్న రోగితో కలిసిమెలసి తిరిగి ఆమెతో సెల్ఫీలు తీసుకున్న ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశామని అరియలూరు ప్రభుత్వ ఆసుపత్రి సీనియర్ అధికారి మీడియాకు చెప్పారు. అంతే కాకుండా ముగ్గురు ఉద్యోగులను క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఆ ముగ్గురు ఉద్యోగులు ఎవరెవరిని దగ్గరగా కలిశారు అని అధికారులు ఆరా తీస్తున్నారు.

 దెబ్బకు దెయ్యం దిగింది !

దెబ్బకు దెయ్యం దిగింది !

కరోనా వైరస్ రోగికి మొబైల్ ఫోన్ ఇవ్వడం చాల పెద్ద నేరమని, అంతే కాకుండా ఆ మొబైల్ తీసుకుని వీడియోలు తీసిన ముగ్గురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందని వెలుగు చూస్తే వారిని శాస్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అధికారులు చెప్పారు. మొత్తం మీద కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ చికిత్స పొందుతున్న యువతి టిక్ టాక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి.

English summary
COVID 19: Three sanitation workers at the Ariyalur Government Hospital were suspended for helping a coronavirus patient shoot a TikTok video. The three have been quarantined as they held the woman’s cellphone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X