బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: లైంగిక దాడి, త్రిమూర్తులు అరెస్టు, క్వారంటైన్ లో 24 మంది పోలీసులు, అదీలెక్క!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ఎప్పుడు ఎవరికి ఆ వ్యాధి సోకుతుందో ఆ దేవుడే చెప్పాలి. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రయత్నిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లతో పాటు అనేక మంది ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిదులకు కరోనా వచ్చింది. ఇదే సమయంలో డ్యూటీలో ఉంటున్న పోలీసులకు కరోనా వైరస్ వస్తోంది.

లైంగిక దాడి కేసుకు సంబంధించి త్రిమూర్తులను అరెస్టు చేసిన 24 మంది పోలీసులు ఇప్పుడు కరోనా క్వారంటైన్ లో ఉన్నారు. నిందితుల్లో ఒకరికి కరోనా వచ్చిందని తెలిసిన వెంటనే పోలీసులను హోటల్ క్వారంటైన్ కు తరలించి వారి కుటుంబ సభ్యులను హోమ్ క్వారంటైన్ కు పంపించామని అధికారులు తెలిపారు.

వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా!వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా!

ఐటీ హబ్ లో హడల్

ఐటీ హబ్ లో హడల్

దేశ ఐటీ, బీటీ సంస్థల రాజధాని బెంగళూరు సిటీలో కోటి మందికిపైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు వెలుతున్న వారిని క్వారంటైన్ కు పంపించడానికి అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే బెంగళూరు నగరంలో అనేక ప్రైవేట్ హోటల్స్ లో కరోనా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ముగ్గురు మిత్రులు

ముగ్గురు మిత్రులు

బెంగళూరు నగరంలోని జీవన్ భీమానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన లైంగిక దాడి కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు మే 31వ తేదీన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ముగ్గురిని జీవన్ భీమా నగర్ పోలీస్ స్టేషన్ లో పెట్టిన పోలీసులు వారిని విచారణ చేసి లైంగిక దాడి కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారు.

చావు కబురు చల్లాగా చెప్పారు

చావు కబురు చల్లాగా చెప్పారు

లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారిని జైలుకు పంపించడానికి ముందు వైద్యపరీక్షలు చేయించారు. నిందితులను జైలుకు పంపించిన తరువాత పోలీసులు ఎవరిపనుల్లో వారు ఉండిపోయారు. అయితే ముగ్గురు నిందితుల వైద్య నివేదిక శనివారం బయటకు వచ్చింది. ముగ్గురు కమాంధుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని వచ్చిందని వైద్య శాఖ అధికారులు పోలీసులకు చావు కబురు చల్లగా చెప్పారు.

Recommended Video

A Man Cheating Women Behind Mask || మాస్క్ మాటున మాయగాడు.!
 క్వారంటైన్ లో 24 మంది పోలీసులు

క్వారంటైన్ లో 24 మంది పోలీసులు

నిందితులను అరెస్టు చేసి జీవన్ భీమానగర్ పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పటి నుంచి 24 మంది పోలీసులు ఆ ముగ్గురితో టచ్ లో ఉన్నారు. ఇప్పుడు 24 మంది పోలీసులను బెంగళూరు నగరంలోని హోటల్స్ లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. 24 మంది పోలీసుల కుటుంబ సభ్యులు ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. మొత్తం మీద నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్ కష్టాలు వచ్చాయని వెలుగు చూసింది. జీవన్ భీమానగర్ పోలీస్ స్టేషన్ ను మూసివేసిన అధికారులు మొత్తం శానిటైజర్ తో శుభ్రం చేశారు.

English summary
Coronavirus: Hotel Quarantine for the police who had contact with the accused Infected with the COVID 19 in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X