వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కొవాలి..? లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి..? వైద్యులు ఏం చెప్తున్నారు...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ రక్కసి చాపకింద నీరులా మెల్లమెల్లగా ఇతరదేశాలకు వ్యాపిస్తోంది. చైనాలోని వుహన్ నగరంలో బయటపడ్డ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వైరస్ సోకి చైనాలో ఇప్పటికే 106 మంది చనిపోగా.. వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, వైరస్ బారి నుంచి ఎలా కాపాడుకోవాలి, నిపుణులు ఏం చెబుతున్నారో చుద్దాం పదండి.

ఐదు కేసులు..

ఐదు కేసులు..

చైనాలోని వుహన్ నగరం కరోనా వైరస్ ఇతరదేశాలకు వ్యాపిస్తోంది. వైరస్ అమెరికాకు కూడా చేరింది. వాషింగ్టన్‌కు చెందిన 30 ఏళ్ల యువకుడు, చికాగోకు చెందిన 60 ఏళ్ల వృద్దుడు, కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి, లాస్ ఏంజెల్స్‌ కౌంటీలో ఓ రోగి, అరిజోనాలో మరొకరికి మొత్తం ఐదుగురికి వ్యాధి సోకింది. వీరంతా ఇటీవల వుహన్ వెళ్లి తిరిగొచ్చిన వారేనని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో వ్యాధి నివారణ కోసం అమెరికా అధికారులు చర్యలు చేపట్టారు.

పరిశీలించాకే..

పరిశీలించాకే..

కరోనా వైరస్ చైనా నుంచే వస్తోంది. వుహన్ నగరం వెళ్లొచ్చిన వారి నుంచే వ్యాధి రావడంతో అమెరికాలోని ఐదు విమానాశ్రయాల్లో చర్యలు తీసుకున్నారు. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కె్న్నోడి అంతర్జాతీయ విమానాశ్రయం, లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం, శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం, హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం, చికాగో ఓ హరే అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేపడుతున్నారు. వుహన్ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చిన విమానాలను అమెరికాలోని ఐదు ఎయిర్‌పోర్టులలో తనిఖీ చేస్తారు. అక్కడ వైద్యులు ప్రయాణికులను పరీక్షించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు.

 2 వేల మంది

2 వేల మంది

ఆయా ఎయిర్‌పోర్టులలో వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం నిపుణులు పరీక్సలు చేస్తారు. అమెరికాలో ఇప్పటికే 2 వేల మందికి జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు. అయితే విమానాశ్రయ స్క్రీనింగ్ సెంటర్లలో వ్యాధి సోకిన అందరిని నిర్ధారించకపోవచ్చు. వైరస్ సోకిన తర్వాత వారం రోజుల వరకు వ్యాధి ఉందనే విషయం తెలియదు. వైరస్ ఉన్న లక్షణాలు ఏవీ బయటపడకపోవడంతో కొందరినీ గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టాకోమా ఎయిర్‌పోర్టులో అధికారులు సైన్ బోర్డులు పెట్టారు. వుహన్ నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి వైరస్ ఎలా సోకుతుందో తెలియజేసే బోర్డులు పెట్టారు. సైన్ బోర్డులను ఇంగ్లిష్, చైనీస్ భాషల్లో పెట్టారు. ఈ నెల 14వ తేదీన బోర్డును ఏర్పాటు చేశారు. ఒకరోజు ముందు వైరస్ సోకిన వ్యక్తి అమెరికా రావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

Recommended Video

Coronavirus : Is This A Chinese Bio W@r/ Biological W@r Fare We@pon ? || Oneindia Telugu
లెవల్ 2 నుంచి 3

లెవల్ 2 నుంచి 3

వుహన్ నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య లెవల్ 2 నుంచి లెవల్ 3కి చేరింది. దీంతో అవసరం లేని వారు వుహన్ ప్రయాణాన్ని విరమించుకోవాలని అధికారులు కోరుతున్నారు. వుహన్‌లో ప్రజారవాణాను నిలిపివేసిన తరుణంలో అమెరికా ఈ ప్రకటన చేసింది. వుహన్ నుంచి బస్సులు, సబ్ వేలు, విమానాలు, రైళ్ల ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాదు రెండువారాల క్రితం కూడా చైనా పర్యటించిన వారు జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వారు ఇతరులను టచ్ చేయొద్దని, ప్రయాణం చేయొద్దని, పరిశుభ్రంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోన్న వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అర్థం కావడం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

వ్యాక్సిన్..?

వ్యాక్సిన్..?

కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నంలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. కానీ అదీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి. వైరస్‌పై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు పరిశోధనలో నిమగ్నమయ్యారు. కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు కొన్ని నెలల సమయం పడుతోంది. వ్యాక్సిన్ కనిపెట్టాక.. దాని పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది. మరోవైపు టెక్సాస్, న్యూయార్క్, చైనాలో కూడా వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నామని డాక్టర్ పీటర్ హోటెజ్ పేర్కొన్నారు. ఈయన హ్యుస్టాన్‌లో బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ విభాగంలో వ్యాక్సిన్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. కానీ వ్యాక్సిన్ కనుగొనడంలో మాత్రం వీరు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ తీవ్రమైనది, ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆరోగ్య ముప్పుగా పరిణమించింది అని హోటెజ్ పేర్కొనడం వైరస్ ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు.

జాగ్రత్తలు ఇవే..

జాగ్రత్తలు ఇవే..

1.పరిశుభ్రంగా ఉండటం

2.తరచూ చేతులను సబ్బుతో కడగడం

3.తుమ్మేటప్పుడు/దగ్గేటప్పుడు రుమాలు అడ్డుపెట్టుకోవడం

4.ఇతరులకు దూరంగా ఉండటం/ వారిని అంటుకోవడం ద్వారా వారికి వైరస్ సోకే ప్రమాదం

5. జంతువులకు దూరంగా ఉండటం/ మాంసం కోసే దగ్గర ఉండే ప్రజలు దూరంగా ఉండాలి

6. కరోనా వైరస్ ఉందని భావిస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి

English summary
Coronavirus Live Updates: Across the US, scientists are trying to create a vaccine for the new virus. But don't expect it anytime soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X