వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Locldown: పేరు మాత్రమే ఇన్నోసెంట్, తేడావస్తే అత్తారింటిలో జస్ట్ ఆరు నెలలు, మేడమ్ దెబ్బకు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/నీలగిరి: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు తమిళనాడు విలవిలాడుతోంది. ప్రభుత్వం చెప్పినట్లు వినాలని, అధికారులకు సహకరించాలని, కరోనా వైరస్ విషయంలో నిర్లక్షం చేస్తే చేజేతులా ప్రాణం మీదకు తెచ్చుకుంటారని ప్రభుత్వాలు, అధికారులు నెత్తినోరు మొత్తుకుంటున్నా కొందరు జులాయిలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఆకతాయిలకు లేడీ కలెక్టర్ సరైన బుధ్ది చెబుతున్నారు. 60 రుపాయల మాస్క్ వేసుకోకుండా మీరు రోడ్ల మీదకు వస్తే మేము ఏమి చెయ్యం, జస్ట్ ఆరు నెలలు అత్తారింటికి పంపిస్తే లెక్కసరిపోతుంది అంటున్నారు లేడీ కలెక్టర్ ఇన్నోసెంట్ దివ్యా. మీకు కొంచెం తిక్కుంటే మేడమ్ దివ్యాకు ఓ లెక్కుంది, మీరు మాట వినకపోతే లెక్కలు సరిసమానం అయిపోతాయి, ఆమె పేరుమాత్రమే ఇన్నోసెంట్, తేడా వస్తే కథ వేరుగా ఉంటుంది, తరువాత మీ ఇష్టం అంటున్నారు అధికారులు.

Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!

నీలగిరి అంటే మాటలా ? వరల్డ్ ఫేమస్

నీలగిరి అంటే మాటలా ? వరల్డ్ ఫేమస్


తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1, 75, 678కు పెరిగింది. కరోనా వైరస్ వ్యాధి చికిత్స విఫలమై ఇప్పటి వరకు 2, 551 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తమిళనాడులో కరోనా వైరస్ కట్టడి చెయ్యాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి సూచించారు. ఇలాంటి తమిళనాడు రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ది చెందిన నీలగిరి పర్యాటక కేంద్రం ఉంది.

మీపాటు చిన్నగా లేదు తంబి

మీపాటు చిన్నగా లేదు తంబి

నీలగిరి జిల్లాలో కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వంతో సహ ఆ జిల్లా కలెక్టర్ ఇన్నోసెంట్ దివ్యా అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా నీలగిరి జిల్లాలోని కొన్ని పట్టణాలు, పర్యాటక ప్రాంతాల్లో కనీసం ముఖానికి మాస్క్ లు కూడా వేసుకోకుండా బయటకు రావడం, హెల్మెట్లు లేకుండా బైక్ ల్లో జులాయిగా తిరుగుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతో కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో స్థానికులు హడలిపోతున్నారు.

 లేడీ కలెక్టర్ ఆదేశం

లేడీ కలెక్టర్ ఆదేశం

నీలగిరి జిల్లాలో ఎవరైనా సరే ఇళ్ల నుంచి బయటకు వచ్చే సమయంలో ముఖానికి కచ్చితంగా మాస్క్ వేసుకోవాలని, హెల్మెట్లు లేకుండా బైక్ లు నడపరాదని నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్నోసెంట్ దివ్యా ప్రజలకు మనవి చేశారు. ఆ లేడీ కలెక్టర్ ఏం చేస్తారులే ? ఆమె చెప్పిన మాటలు పట్టించుకోవాలా ? ఏందిరా తంబి ? అంటూ కొందరు అల్లరిమూకలు మాస్క్ లు లేకుండా, హెల్మెట్లు లేకుండా బైక్ ల్లో తిరగడం, విచ్చలవిడిగా పర్యాటక ప్రాంతాల్లోని రోడ్ల మీద ఉమ్మివేయడం మొదలుపెట్టారు.

జస్ట్ ఆరు నెలలు అత్తారింట్లో అంతే !

జస్ట్ ఆరు నెలలు అత్తారింట్లో అంతే !


ఎంత చెప్పినా ముఖాలకు మాస్క్ లు వేసుకోకుండా, హెల్మెట్లు పెట్టుకోకుండా బైక్ లో బయటకు వచ్చే వారికి పోలీసులు అపరాదరుసుం విదిస్తున్నా ప్రజలు మాత్రం చెప్పిన మాటవినడం లేదు. ఈ దెబ్బతో నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్నోసెంట్ దివ్యా నేరుగా రంగంలోకి దిగారు. ఎవరైనా మాస్క్ లు లేకుండా బయటకు వచ్చినా, హెల్మెట్లు లేకుండా బైక్ లు నడుపుతున్నట్లు కనపడినా వారిపై వెంటనే కేసులు నమోదు చేసి ఆరు నెలలు అత్తారింటికి (జైలుకు) పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాస్క్ వద్దులే... జస్ట్ ఆరునెలలు అత్తారింట్లో ఉండి వచ్చేయండి అంటూ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

పేరు మాత్రమే ఇన్నోసెంట్..... తేడా వస్తే ?

పేరు మాత్రమే ఇన్నోసెంట్..... తేడా వస్తే ?


కలెక్టర్ పేరు మాత్రమే ‘ఇన్నోసెంట్' దివ్యా అని మేడమ్ కు కోపం వస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని అధికారులు నీలగిరి జిల్లాలోని అల్లరిమూకలను హెచ్చరిస్తున్నారు. మాస్క్ లు లేకుండా బయటకు వస్తే ఆరు నెలల జైలు శిక్ష, రోడ్లలో ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేస్తే రూ. 1, 000 జరిమానా విధిస్తుండటంతో నీలగిరి జిల్లాలోని అల్లరిమూకలు తోకముడుస్తున్నారని స్థానిక ప్రజలు, పోలీసులు అంటున్నారు.

English summary
Coronavirus: Nilgiri Collector Innocent Divya has announced that those who do not wear masks in the Nilgiris district will be sentenced to 6 months imprisonment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X