వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మురుగు నీటిలోనూ కరోనా వైరస్ .. అది వ్యాప్తి చెందుతుందా : గుజరాత్ ఐఐటీ పరిశోధన ఏం తేల్చింది

|
Google Oneindia TeluguNews

మురుగునీటిలో కరోనావైరస్ ఉన్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గాంధీనగర్ (ఐఐటి-జిఎన్) ఒక రీసెర్చ్ లో కనుగొంది. శుద్ధి చేయని మురుగునీటి నుండి సేకరించిన వ్యర్థజలాల నమూనాలలో కరోనావైరస్ యొక్క జన్యువులను కనుగొన్నారు . అయితే ఇది వ్యాప్తికి కారణం మాత్రం కాదని తేల్చింది .అహ్మదాబాద్ లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక అక్కడ ఒక అవుట్లెట్ లో మురుగునీటి కాలవలో వ్యర్ధ జలాలను పరీక్షించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది.

భారత్ లో గత 24 గంటల్లో 9,987 కొత్త కేసులు .. 72 లక్షలకు చేరిన ప్రపంచ కరోనా కేసులు !!భారత్ లో గత 24 గంటల్లో 9,987 కొత్త కేసులు .. 72 లక్షలకు చేరిన ప్రపంచ కరోనా కేసులు !!

 కరోనా వైరస్ మురుగు నీటిలో ఉందని గుర్తించిన పరిశోధన

కరోనా వైరస్ మురుగు నీటిలో ఉందని గుర్తించిన పరిశోధన

కరోనా వ్యాప్తిని గుర్తించడం, పర్యవేక్షించడం మరియు నియంత్రించడం మరియు క్లినికల్ డయాగ్నసిస్ కు ముందు హాట్‌స్పాట్‌లను గుర్తించడం కోసం దేశవ్యాప్తంగా వ్యర్థజలాల ఆధారిత పరిశోధన చెయ్యాలని పరిశోధకులు చెప్తున్నారు. అయితే అది అంత సాధ్యం అయ్యే విషయం కాదని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ శాస్త్రీయ పరిశోధనలు జరిపి మురుగునీటిలో కరోనా వైరస్ యొక్క జన్యువులు ఉన్నట్టు పేర్కొన్నాయి.

కరోనా వైరస్ విషయంలో మురుగు నీటిపై నిఘా పెట్టాలన్న ఐఐటీ గాంధీ నగర్ పరిశోధకులు

కరోనా వైరస్ విషయంలో మురుగు నీటిపై నిఘా పెట్టాలన్న ఐఐటీ గాంధీ నగర్ పరిశోధకులు

ఏప్రిల్‌లో, ఐఐటి-జిఎన్ కూడా 51 ప్రీమియర్ విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా సంస్థల గ్లోబల్ కన్సార్టియంలో చేరిందని చెప్పాలి . కరోనా వైరస్ విషయంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థను నిర్మించే ప్రయత్నంలో, కరోనా వైరస్ విషయంలో మురుగునీటిపై నిఘా పెట్టాలని అభిప్రాయపడుతున్నారు. ఇక మురుగునీరు ద్వారా కరోనా సంక్రమించదు అని పేర్కొన్నారు. ఇక ఇందులో ప్రధానంగా చెప్పిన విషయం ఏమిటంటే మురుగునీరు ఒక ముఖ్యమైన వనరు, ఎందుకంటే వైరస్ లక్షణం ఉన్నవారిని మాత్రమే కాకుండా, విసర్జన ద్వారా లక్షణం లేని వ్యక్తుల శరీరాల నుండి కూడా బయటకు వస్తుంది. కాబట్టి మురుగునీరు టెస్ట్ చేసి ఏయే ప్రాంతాల్లో కరోనా ఉందో తెలుసుకోవచ్చని IIT- గాంధీ నగర్ ప్రొఫెసర్ మనీష్ కుమార్ అన్నారు.

Recommended Video

Bejan Daruwalla Predictions || ఆస్ట్రాలజర్ బెజన్ దరువాలా సంచలనాలు...!!
మురుగునీటిలో కరోనా వ్యాప్తి చెందే జన్యువులు లేవని తేల్చిన పరిశోధకులు

మురుగునీటిలో కరోనా వ్యాప్తి చెందే జన్యువులు లేవని తేల్చిన పరిశోధకులు


ఇక వారు చేసిన పరిశోధన భారతదేశం నుండి వచ్చిన మొదటి పరిశోధన అని, లాక్డౌన్ వ్యవధిలో, అంటే మే 8 మరియు మే 27 లలో కరోనా వైరస్ జన్యువు యొక్క వైవిధ్యాన్ని స్పష్టంగా తమ పరిశోధన వివరిస్తుందని పేర్కొన్నారు . మురుగునీటిలో వైరస్ ఆనవాళ్లను గుర్తించడం ద్వారా ఓ ప్రాంతంలో కోవిడ్ ఉందా లేదా అనే విషయమై ప్రాథమికంగా అవగాహనకు రావచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు. కానీ అది అంత సాధ్యం కాదు. అయితే మురుగు నీటిలో ఉండే జన్యువులు వైరస్ వ్యాప్తికి కారణం అయ్యే జన్యువులు కాదని తేల్చేశారు . ఇక విశ్లేషణ కోసం, గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి (జిపిసిబి) ఐఐటి-జిఎన్ బృందానికి మే 8 మరియు మే 27 న మురుగునీటి నమూనాలను సేకరించడానికి సహాయపడింది,

English summary
first evidence from India of the presence of the corona virus in sewage, the Indian Institute of Technology-Gandhinagar (IIT-Gn) has found non-infectious genes of the coronavirus in wastewater samples collected from untreated sewage in an outlet in Ahmedabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X