• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Coronavirus: కరోనా విరుగుడుకు పరిష్కారం ఓల్డ్ మంక్ రమ్, ఎగ్ ఫ్రై, గోమూత్రం, పాపడ్, సూర్యుడు !

|

న్యూఢిల్లీ/ ముంబై/ బెంగళూరు: ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఆలోచిస్తున్నది ఒక్కటే ఒక్కటి. అదే కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి విరుగుడు మందు. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రధానులు, అధ్యక్షులు మీకు ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు చెయ్యడానికి మేము సిద్దంగా ఉన్నాము, మీరు కరోనా వైరస్ కు విరుగుడు మంది కనిపెట్టాలని శాస్త్రవేత్తలు, పేరుపొందిన వైద్యులకు మనవి చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇలా పడరానిపాట్లు పడుతుంటే కొందరు రాజకీయ నాయకులు మాత్రం మేము చెప్పినట్లు చేస్తే మీకు కరోనా వైరస్ వ్యాధి సోకదు, మీకు కరోనా వైరస్ వ్యాధి నయం అవుతోంది అంటూ ఉచిత సలహాలు ఇచ్చేసి ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారు. ఓల్డ్ మంక్ రమ్, ఎగ్ ఫ్రై, గో మూత్రం, సూర్యకిరణాలు, గో బ్యాక్ కరోనా గో బ్యాక్ ఇలా ఒక్కొక్క రాజకీయ నాయకుడిది ఒకో తీరు కావడంతో ఇప్పుడు నవ్వుకోవాలో, అయ్యోపాపం అనాలో ప్రజలకు అర్థం కాకుండా పోతోంది.

Mafia Don: దేశాన్ని గడగడలాడించి కుక్కచావు, ఫ్రెండ్ భార్యపై మోజు, స్వర్గం చూపించింది, పక్కాప్లాన్ తోMafia Don: దేశాన్ని గడగడలాడించి కుక్కచావు, ఫ్రెండ్ భార్యపై మోజు, స్వర్గం చూపించింది, పక్కాప్లాన్ తో

భాబీజీ పాపడ్ తో కరోనా పరార్

కేంద్ర పార్లమెంటరీ, గంగా ప్రక్షాళన, జనవనురుల శాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఒక్కరోజు ముందు (నిన్న) కరోనాకు విరుగుడు మందు తన దగ్గర ఉందని, మీరు ఇలా చేస్తే ఆ మహమ్మారి వైరస్ మీ దగ్గరకు కూడారాదని బాంబు పేల్చారు. భాబీజీ పాపడ్ కరోనాను పారదోలుతుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెబుతున్న వీడియో బుధవారం విడుదల కావడంతో సోషల్ మీడియాలో దూమరం రేపింది. కరోనా వైరస్ తో పోరాడే యాంటీబాడీలను ప్రేరేపించేందుకు ఉతమిచ్చేలా ఈ పాపడ్ తయారు చేశారని కేంద్ర మంత్రి మేఘ్వాల్ రామ్ మేఘ్వాల్ భాబీజీ పాపడ్ విడుదల చేసే సమయంలో ఆయన ఈ విషయం చెప్పిన్లు వీడియోలో ఉంది. కరోనా మహమ్మారి పోరాటంలో అసత్య, అశాస్త్రీయ సమాచారన్ని ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న అర్జున్ రామ్ మేఘ్వాల్ పై సుమోటో చర్యలు తీసుకోవాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

 నా కరోనా మసాలా మెనూ ఇదే

నా కరోనా మసాలా మెనూ ఇదే

Morning - I drink gaumutra
Lunch- I have Patanjali's Coronil
Evening- I chant 100 times ‘Go corona go'
Dinner- I have started eating Bhabhiji Papad

ఇలా ప్రతిరోజు ఆహారం తీసుకుంటే కరోనా వైరస్ మన దగ్గరికి కూడారాదా ? అంటూ హర్షా గొంకా అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో నెటిజన్లు వారికి తోచిన విధంగా కామెంట్లు పెడుతూ జోకులు వేసుకుంటున్నారు.

Go Corona Go Corona అంతే

కరోనా వైరస్ విరుగుడుకు మరో కేంద్ర మంత్రి చక్కటి చిట్కా చెప్పారు. కేంద్ర మంత్రి రామదాస్ అథావాలే మార్చి 11వ తేదీన ఆయన మద్దతుదారులతో కలిసి గో కరోనా గో కరోనా అంటూ బహిరంగ ప్రదేశంలో ఆందోళనకు దిగారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి రామదాస్ అథావాలే మీడియాతో మాట్లాడుతూ ప్రతిఒక్కరు కరోనా వైరస్ తో పోరాటం చెయ్యడానికి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యాలని ప్రజలకు ఉచిత సలహా ఇచ్చారు. కేంద్ర మంత్రి రామదాస్ అథావాలే రోడ్డు మీద గో కరోనా గో అంటూ ఆందోళన చేసిన సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో అప్పటి నుంచి ఇప్పటి వరకు వైరల్ అవుతూనే ఉన్నాయి.

స్యూరుడు మనల్ని కాపాడుతాడు

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖా మంత్రి అశ్విని కుమార్ సైతం ప్రజలకు ఓ సలహా ఇచ్చారు. ప్రతిఒక్కరు ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు సూర్యకిరణాలు పడేలా ఎండలో కుర్చుంటే కరోనా వైరస్ మహమ్మారి మన దగ్గరకు కూడా రాదని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ మార్చి 19వ తేదీన ఓ సలహా ఇచ్చారు. కేంద్ర మంత్రి అశ్విని కుమార్ ఇచ్చిన సలహాపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది.

 లేడీ ఎమ్మెల్యే హరిప్రియ గోమూత్రం ఐడియా

లేడీ ఎమ్మెల్యే హరిప్రియ గోమూత్రం ఐడియా

అసోంలోని బీజేపీ లేడీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియా కరోనా వైరస్ విరుగుడుకు ఓ మంచి చిట్కా చెప్పి నవ్వులపాలైనారు. గోవు మూత్రం (గోమూత్రం) సేవిస్తే కరోనా వైరస్ మీ దగ్గరకు కూడారాదని, ఆ మమహ్మారిని అరికట్టడికి ఇదో చక్కటి ఔషదమని బీజేపీ లేడీ ఎమ్మెల్యే

సుమన్ హరిప్రియా ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఈ విషయంపై సొంత పార్టీ నేతలే బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియా మీద అసహనం వ్యక్తం చేశారు.

  COVID-19 : గణనీయంగా పెరిగిన రోగ నిరోధక శక్తి.. ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందంటే..!

  Old Monk Rum, ఎగ్ ఫ్రై చిట్కా

  కేంద్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేకు మేమేం తక్కువ అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఉచిత సలహా ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. కర్ణాటకలోని మంగళూరు సిటీ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ రవిచంద్రన్ గట్టి కరోనా వైరస్ విరుగుడుకు ఓ గట్టి సలహా ఇచ్చారు. ఓల్డ్ మంక్ రమ్ తాగి ఎగ్ ఫ్రై తింటే కరోనా వైరస్ మహమ్మారి మీ దరిదాపులకు కూడా రాదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రవిచంద్రన్ గట్టి ఓ ఉచిత సలహా ఇచ్చేశారు. అసలే కరోనా భయంతో ఆందోళన చెందుతున్న ప్రజలకు పలు రాజకీయ పార్టీల నాయకులు ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చేసి వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

  English summary
  Coronavirus: BJP leader Arun Ram Meghwal (Union minister of state) claims ‘Bhabhiji Papad’ will be helpful in fighting Coronavirus. here some other politicians who found vaccine for COVID- 19.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X