బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus:కేరళలో కరోనాతో పోరాడిన ఇటలీ పౌరుడు, యముడితో ఢీ: సన్మానం, బెంగళూరుకు !

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) వ్యాధి దెబ్బకు ప్రపంచం అంతా విలవిలలాడుతోంది. ఇటలీలో కరోనా కాటుకు 23, 660 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భారతదేశంలో కరోనా లాక్ డౌన్ కు ముందే కేరళకు వచ్చి కరోనా వైరస్ బారినపడిన ఇటలీ పౌరుడు చివరికి కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొంది యుముడిని ఢీకొని ఆ వ్యాధిని జయించాడు. కరోనా వైరస్ మహమ్మారిని జయించిన ఇటలీ పౌరుడిని ఆసుపత్రి సిబ్బందితో పాటు కేరళ ప్రభుత్వం సన్మానించింది. ఇటలీ పౌరుడు కేరళ నుంచి బెంగళూరు వెళ్లడానికి కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!

లాక్ డౌన్ ముందే కేరళలో !

లాక్ డౌన్ ముందే కేరళలో !

కరోనా మహమ్మారిని కట్టడి చెయ్యడానికి భారతదేశం మొత్తం గత నెల లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా లాక్ డౌన్ కు ముందే ఇటలీకి చెందిన రాబర్టో టోనిజ్ కేరళ వెళ్లాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా కేరళలో చిక్కుకుపోయిన రాబర్టో టోనిజ్ మార్చి 13వ తేదీన తిరువనంతపురం సమీపంలోని వార్కాల ప్రాంతంలో అనారోగ్యానికి గురైనాడు.

కరోనా పాజిటివ్

కరోనా పాజిటివ్

కేరళలో చిక్కుకున్న ఇటలీ పౌరుడు రాబర్టో టోనిజ్ కు కరోనా పాజిటివ్ అని మార్చి 26వ తేదీ వెలుగు చూడటంతో అతన్ని తిరువనంతపురంలోని కరోనా ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అప్పటి నుంచి తిరువనంతపురంలోని కరోనా ఐసోలేషన్ వార్డులో రాబర్టో టోనిజ్ చికిత్స పొందుతున్నాడు.

కరోనాను జయించిన టోనిజ్

కరోనాను జయించిన టోనిజ్

తిరువనంతపురంలోని కరోనా ఐసోలేషన్ వార్డులో చేరిన రాబర్ట్ టోనిజ్ వైద్యులు చెప్పినట్లు వింటూ చికిత్సకు పూర్తిగా సహకరించాడు. ఐసోలేషన్ వార్డులో కరోనా వైద్యిని జయించిన రాబర్టో టోనిజ్ సంతోషంతో పులకించిపోయాడు. రాబర్టో టోనిజ్ కు వ్యాధి పూర్తిగా నయం అయ్యిందని తిరువనంతపురం వైద్యులు సోమవారం నిర్దారించారు.

ఇటలీ పౌరుడికి సన్మానం

ఇటలీ పౌరుడికి సన్మానం

వైద్యులు చెప్పినట్లు వింటూ చికిత్సకు పూర్తిగా సహకరించి యముడితో పోరాడిన ఇటలీ పౌరుడు రాబర్టో టోనిజ్ ను సోమవారం తిరువనంతపురం వైద్యులు, కేరళ ప్రభుత్వం సన్మానించింది. తిరువనంతపురంలోని ఐసోలేషన్ వార్డులో కరోనా వైరస్ పాజిటివ్ చికిత్స పొందుతున్న రోగులు రాబర్టో టోనిజ్ ను అభినందించారు.

బెంగళూరుకు కారులో !

బెంగళూరుకు కారులో !

సోమవారం రాబర్టో టోనిజ్ కు తిరువనంతపురం ఆసుపత్రి వైద్యులు, కేరళ ప్రభుత్వం ఓ చిహ్నం బహుమతిగా ఇచ్చి సత్కరించి అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తరువాత రాబర్ట్ టోనిజ్ బెంగళూరు వెళ్లడానికి అనుమతి ఇచ్చిన కేరళ ప్రభుత్వం ఓ కారును ఏర్పాటు చేసింది. తనకు మెరుగైన చికిత్స అందించి తన ప్రాణాలు కాపాడిన తిరువనంతపురం వైద్యులకు, కేరళ ప్రభుత్వానికి ఇటలీ పౌరుడు రాబర్టో టోనిజ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇటలీలో కరోనా మరణమృదంగం

ఇటలీలో కరోనా మరణమృదంగం

ఇటలీలో కరోనా మరణమృదంగంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇప్పటి వరకు ఇటలీలో 1, 78, 972 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ వ్యాధితో ఇటలీలో 23, 660 మంది చనిపోగా 47, 055 మంది చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు. కేరళ నుంచి బెంగళూరు బయలుదేరిన రాబర్టో టోనిజ్ అక్కడి నుంచి ఇటలీ వెళ్లడానికి సిద్దం అయ్యాడు.

Recommended Video

Fake News Buster EP 10 : సోడియం హైపోక్లోరైట్ మనుషులు వాడచ్చా ?

English summary
Coronavirus: Italys Roberto Tonizz recovered from COVID19 in Kerala. He had tested positive on March 13. He left for Bengaluru after making a full recovery on April 20, 2020. He will leave for Italy from Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X