వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు అతి తెలివి, లాక్ డౌన్ లో గుర్రపుస్వారీ, ఏం పోయేకాలం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ఊటి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో అనవసరంగా రోడ్ల మీద సంచరించరాదని, బైక్ లు, కార్లు, ఇతర వాహనాలు తీసుకుని రోడ్ల మీదకు రాకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బైక్ లు, కార్లలో రోడ్ల మీదకు రాకూడదని, రోడ్ల మీద నడిచి తిరగకూడదని ప్రభుత్వం చెప్పింది అంతే కదా, నేను సరికొత్త పద్దతిలో తిరగాలని నిర్ణయించాడు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు. అంతే గుర్రం మీద ఎక్కి ముఖానికి మాస్క్ కూడా వేసుకోకుండా నా ప్రతాపం చూడండి అంటూ ఆ ఎమ్మెల్యే కొడుకు మైసూరు- ఊటీ జాతీయరహదారిలో గుర్రపుస్వారీ చేశాడు. ఎమ్మెల్యే కొడుకు హంగామా చూసిన స్థానిక ప్రజలు వీడు కరోనాతో గేమ్స్ ఆడటమే కాకుండా మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని, వీడికేం పోయేకాలం వచ్చిందంటూ మండిపడుతున్నారు.

Coronavirus: కరోనా విరుగుడుకు కాసాకుర మందు రెఢీ, 48 గంటలు, చూడప్ప సిద్దప్ప, నీ వైద్యం చాలప్ప !Coronavirus: కరోనా విరుగుడుకు కాసాకుర మందు రెఢీ, 48 గంటలు, చూడప్ప సిద్దప్ప, నీ వైద్యం చాలప్ప !

 ముఖ్యమంత్రి గ్రేట్

ముఖ్యమంత్రి గ్రేట్

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. కర్ణాటకలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వైరస్ అరికట్టడంలో ముఖ్యమంత్రులు ఎవరెవరు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు అంటూ ఇటీవల ఓ సర్వే చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆ సర్వేలో రెండో స్థానంలో నిలిచారు.

 అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు

అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు

కర్ణాటకలోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ కుమార్. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ కుమార్ కొడుకు భువన్ కుమార్. తన తండ్రి అధికారంలో ఉన్నారు కదా ? నేను ఏం చేసినా పర్వాలేదని భువన్ కుమార్ భావించాడు.

 ప్రభుత్వం ఏం చెప్పింది ?

ప్రభుత్వం ఏం చెప్పింది ?

లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో అనవసరంగా రోడ్ల మీద సంచరించరాదని, బైక్ లు, కార్లు, ఇతర వాహనాలు తీసుకుని రోడ్ల మీదకు రాకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బైక్ లు, కార్లలో రోడ్ల మీదకు రాకూడదని, రోడ్ల మీద నడిచి తిరగకూడదని ప్రభుత్వం చెప్పింది అంతే కదా. నేను గుర్రం మీద తిరిగితే సరిపోతుందని, అప్పుడు ఎలాంటి సమస్య ఉండదని బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ కుమార్ కొడుకు భువన్ కుమార్ నిర్ణయించాడు.

 మైసూరు- ఊటీ హైవేలో గుర్రపుస్వారీ

మైసూరు- ఊటీ హైవేలో గుర్రపుస్వారీ

మైసూరు- ఊటీ జాతీయ రహదారిలోని గుండ్లుపేట ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ సమీపంలో బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ కుమార్ కొడుకు భువన్ కుమార్ గుర్రపుస్వారీ చెయ్యడం మొదలు పెట్టాడు. ముఖానికి మాస్క్ కూడా వేసుకోకుండా, కరోనాను లెక్క చెయ్యకుండా మైసూరు- ఊటీ జాతీయ రహదారిలో భువన్ కుమార్ గుర్రపుస్వారీ చేస్తూ నానా హంగామా చేశాడు.

 వీడికేం పోయేకాలం వచ్చింది

వీడికేం పోయేకాలం వచ్చింది

బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ కుమార్ కొడుకు భువన్ కుమార్ గుర్రపుస్వారీ చేస్తున్న విషయం గుర్తించిన స్థానికులు మండిపడుతున్నారు. కరోనా వైరస్ అరికట్టడానికి లాక్ డౌన్ విధించారని, ఆ నియమాలు లెక్కచెయ్యలేదని, కనీసం ముఖానికి మాస్క్ కూడా పెట్టుకోకుండా అతని ప్రాణాలతో పాటు తమ ప్రాణాలతో భువన్ కుమార్ చెలగాటం ఆడుతున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. ముఖానికి మాస్క్ వేసుకోకుండా రోడ్ల మీద గుర్రపుస్వారీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ కుమార్ కొడుకు భవన్ కుమార్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అధికారులు ఫిర్యాదు చేశారు.

English summary
Lockdown: Karnataka Gundlupete Bjp Mla Niranjan kumar son bhuvan kumar horse riding in the time of Lockdown at Mysuru- Ooty National Highway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X