బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: బెంగళూరులో మరోసారి లాక్ డౌన్, పక్కా క్లారిటీ ఇచ్చిన సీఎం, ప్రాణాలు ముఖ్యం బ్రదర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో మరోసారి లాక్ డౌన్ ? అమలు చేస్తున్నారని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారని రెండుమూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో లాక్ డౌన్ అమలు చేస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప గత మూడు రోజుల నుంచి వరుసగా మంత్రులు, అధికారులతో తీరకలేకుండా సమావేశాలు ఏర్పాటు చేసి ఇదే విషయంపై చర్చించారు.

ఇక శుక్రవారం బెంగళూరు సిటీకి చెందిన మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, అఖిలపక్ష పార్టీ నాయకులతో పాటు వైద్య, ఆరోగ్య, పోలీసు, బీబీఎంపీ అధికారులతో సమావేశంపై బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ అమలు చెయ్యాలా ? వద్దా ? అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం బెంగళూరులో మళ్లీ లాక్ డౌన్ విధించే విషయంలో సీఎం బీఎస్ యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకుని పక్కా క్లారిటీ ఇచ్చారు.

Coronavirus: మంత్రి ఫ్యామిలీలో ముగ్గురికి కరోనా, ఇల్లు సీల్ డౌన్, పక్కనే పవర్ స్టార్ ఫ్యామిలీ!Coronavirus: మంత్రి ఫ్యామిలీలో ముగ్గురికి కరోనా, ఇల్లు సీల్ డౌన్, పక్కనే పవర్ స్టార్ ఫ్యామిలీ!

ఆర్థికంగా నష్టం వస్తే ఎలా?

ఆర్థికంగా నష్టం వస్తే ఎలా?

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో కర్ణాటక ప్రభుత్వానికి రావలసిన ఆదాయం అంతంతమాత్రంగానే ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. కర్ణాటకను ఆర్థికంగా బలోపేతం చెయ్యడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు.

బెంగళూరు ప్రజల ప్రాణాలు ముఖ్యం

బెంగళూరు ప్రజల ప్రాణాలు ముఖ్యం

బెంగళూరు నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు సిటీలో ఇంత వరకు కరోనా వైరస్ కట్టడికి ప్రజలు సహకరించారని, ఇక ముందు వారి నుంచి మరింత పూర్తి సహకారం తీసుకుని కరోనా మహమ్మారికి కళ్లెం వెయ్యాలని నిర్ణయించామని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప మీడియాకు చెప్పారు. బెంగళూరు ప్రజల ప్రాణాలు కాపాడటానికి మా ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం బీఎస్. యడియూరప్ప వివరించారు.

దేశానికి బెంగళూరు ఆదర్శం

దేశానికి బెంగళూరు ఆదర్శం

బెంగళూరుతో పాటు కర్ణాటకలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అభినందించిందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. దేశంలోని అనేక నగరాలకు కరోనా కట్టడి విషయంలో బెంగళూరు ఆదర్శంగా నిలిచిందని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కేసులు పెరిగిపోకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు ఇంతకు ముందు సహకరించినట్లుగానే ప్రజలు ప్రభుత్వానికి మరింత సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మనవి చేశారు.

బెంగళూరులో లాక్ డౌన్ లేదు

బెంగళూరులో లాక్ డౌన్ లేదు

బెంగళూరు సిటీలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించమని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప పక్కా క్లారిటీ ఇచ్చారు. అయితే బెంగళూరులోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వారివారి నియోజక వర్గాల్లో సంచరించి కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే తాను మనవి చేశానని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియాకు చెప్పారు.

కరోనాతో రాజకీయాలు వద్దు

కరోనాతో రాజకీయాలు వద్దు

బెంగళూరు ప్రజలు ప్రాణాలకు విలువ ఇవ్వాలని, అందువలన సిలికాన్ సిటీతో పాటు కర్ణాటకలో కరోనా కట్టడి విషయంలో రాజకీయాలు చెయ్యకుండా ప్రభుత్వానికి అన్ని పార్టీలు సహకరించాలని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప ప్రతిపక్ష పార్టీలకు మనవి చేశారు. బెంగళూరులో మరోసారి లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతోందని, అందు వలన ఎవరి నియోజక వర్గాల్లో వారు (ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు) సంచరించి కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తాను నమ్ముతున్నానని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు.

Recommended Video

#Lockdown : Street Merchants In Hyderabad Facing Problems Due To Corona Lockdown
ఇప్పటికే బెంగళూరు సీల్ డౌన్

ఇప్పటికే బెంగళూరు సీల్ డౌన్

బెంగళూరు నగరంలో కరోనా వైరస్ వ్యాధి కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను సీల్ డౌన్ చేశామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. సీల్ డౌన్ అయిన ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు మరన్ని జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాపించకుండా కట్టడి చెయ్యడానికి అవకాశం ఉంటుందని సీఎం బీఎస్. యడియూరప్ప తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద బెంగళూరులో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని జరుగుతున్న ప్రచారానికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తెరదించారు.

English summary
Coronavirus: Karnataka Chief Minister BS Yediyurappa Declared That there will be no lockdown in Bengaluru in the concern of economic crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X