బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా దెబ్బకు కర్ణాటక లాక్ డౌన్, ఏప్రిల్ 30 డెడ్ లైన్ !, మా నిర్ణయం అదే, అప్ప !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి దేశం మొత్తం విధించిన లాక్ డౌన్ ఈనెల 14వ తేదీ అర్ధరాత్రితో పూర్తి అవుతోంది. కర్ణాటకలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ విస్థరిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. రానున్న రెండు వారాలు కర్ణాటక ప్రజలకు ఎంతో కీలకమైన రోజులని, అందరూ లాక్ డౌన్ కు సహకరించాలని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప ప్రజలకు మనవి చేశారు. ఏప్రిల్ 30 వరకు పొడగిస్తున్న లాక్ డౌన్ నియమాల గురించి వచ్చే రెండు రోజుల్లో పూర్తి వివరాలు, సమాచారం ఇస్తామని, ప్రజలు అంతవరకు ఓపికగా ఉండాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తెలిపారు.

Coronavirus: కరోనా దెబ్బకు బెంగళూరులో సీల్ డౌన్ !, రెండు వార్డుల్లో 45 వేల మంది, A to Z !Coronavirus: కరోనా దెబ్బకు బెంగళూరులో సీల్ డౌన్ !, రెండు వార్డుల్లో 45 వేల మంది, A to Z !

సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడిచేసేందుకు లాక్ డౌన్ పొడిగించే విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు చర్చించారు. మెజారిటీ రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి మనవి చేశాయి.

Recommended Video

India Lockdown:PM Modi Interacts With Cheif Ministers Via Video Conference About Covid-19 & Lockdown
మా నిర్ణయం అదే

మా నిర్ణయం అదే

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ పొడిగించే విషయంలో తమ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించాలని తాము ముందుగానే ఓ నిర్ణయం తీసుకున్నామని, అదే విషయం ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు.

300 కరోనా కేంద్రాలు, 2 లక్షల మాస్క్ లు

300 కరోనా కేంద్రాలు, 2 లక్షల మాస్క్ లు

ప్రతిరోజు రెండు లక్షల మాస్క్ లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. అంతే కాకుండా 300 కరోనా ప్రయోగశాలలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం యడియూరప్ప వివరించారు. పార్టీలకు అతీతంగా అందరూ కలసి కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి శక్తి వంచన లేకుండా పని చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ తమకు సూచించారని సీఎం బీఎస్. యడియూరప్ప వివరించారు.

ఈ 14 రోజులు చాల విలువైనవి

ఈ 14 రోజులు చాల విలువైనవి

మరో 14 రోజుల పాటు లాక్ డౌన్ విస్తరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి తాము మనవి చేశామని, కరోనా వైరస్ కట్టడి చెయ్యడానికి ఈ రెండు వారాలు చాలకీలమైనవని తాము భావించామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. చేపల పెంపకం, ఆ వ్యాపారుల కార్యకలాపాలకు లాక్ డౌన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నామని, చేపలు పట్టే వారికి లాక్ డౌన్ నియమాలు మినహాయింపు ఉంటుందని సీఎం యడియూరప్ప వివరించారు.

ప్రభుత్వ కార్యాలయాలకు ఓకే

ప్రభుత్వ కార్యాలయాలకు ఓకే

రెండోసారి లాక్ డౌన్ పొడగించే విషయంలో కొన్ని మార్పులు ఉంటాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. ప్రభుత్వంలోని పలు శాఖల కార్యాలయాల పూర్తి కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించామని, వాటి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. లాక్ డౌన్ విస్తరించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భారతదేశంలోని 130 కోట్ల మంది స్వాగతిస్తారని తాను నమ్ముతున్నానని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు.

English summary
Coronavirus: Karnataka Chief Minister BS Yediyurappa Given Information Lockdown Extended Till April 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X